Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 3 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 8 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
ఆయన మళ్లీ.. చంద్రబాబువైపు చూస్తున్నారే!!
- Sports
INDvsAUS : కోహ్లీపై కన్నేయండి.. అదే జరిగితే ఇండియాదే విజయం: మాజీ కోచ్
- Movies
Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!
- Finance
Multibagger Stock: అప్పర్ సర్క్యూట్లు కొడుతున్న మల్టీబ్యాగర్ స్టాక్..
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Realme నుంచి బడ్జెట్ ధరలో సరికొత్త బడ్స్ విడుదల.. సేల్ ఎప్పుడంటే!
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ రియల్‌మీ, భారత మార్కెట్లో మొబైల్స్‌తో పాటు ఇతర ఉత్పత్తుల్ని క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా Realme 9iతో పాటు, కంపెనీ ఈరోజు భారత మార్కెట్లో కొత్త TWS ఇయర్‌బడ్‌లను కూడా విడుదల చేసింది. Realme TechLife Buds T100 TWS పేరుతో ఇయర్‌బడ్స్ ను విడుదల చేసింది.

మార్కెట్లో వాటి ధర రూ.1,499 గా నిర్ణయించింది. అంతేకాకుండా, ఆగస్ట్ 24 నుండి ఆ ఇయర్ బడ్స్ Flipkart మరియు Realme.com ద్వారా సేల్ చేయవచ్చని పేర్కొంది. పరిమిత-కాల ఆఫర్‌గా, ఆసక్తి గల వినియోగదారులు వీటిని రూ.1,299 కొనుగోలు చేసేలా కంపెనీ ఆఫర్ ప్రకటించింది.
Realme TechLife Buds T100 TWS స్పెసిఫికేషన్లు:
Realme TechLife Buds T100 ఇయర్‌బడ్స్ స్పష్టమైన సౌండ్ బేస్ కోసం PEEK+TPUని ఉపయోగించి తయారు చేసిన 10mm అధునాతన డయాఫ్రాగమ్‌తో అమర్చబడింది. మీరు కాల్స్ కోసం ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నప్పుడు యాంబియంట్ నాయిస్‌ను తగ్గించి మొత్తం కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా AI ENC టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇంకా, ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన 88ms తక్కువ లేటెన్సీ మోడ్‌ను కలిగి ఉంటాయి, ఈ ఫీచర్ గేమింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇది 10mm డైనమిక్ డ్రైవర్లతో కూడా వస్తుంది.

Google ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ ఫీచర్ ద్వారా, Realme TechLife Buds T100 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఇప్పటికే పెయిర్ చేసిన పరికరంతో తక్షణమే సులువుగా జత చేయవచ్చు. డిజైన్ పరంగా, యాక్సెసరీ ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, చెవి సైజుకు తగ్గట్టు మార్చుకోవడానికి అదనంగా సిలికాన్ టిప్స్‌ను అందిస్తున్నారు. ఇక ఛార్జింగ్ కేస్ పెబల్ ఆకారంలో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.
బ్యాటరీ లైఫ్ పరంగా, Realme TechLife Buds T100 బడ్స్ ఆరు గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. ఛార్జింగ్ కేస్ 28 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ TWS ఇయర్‌బడ్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడా వస్తాయి, దీని వలన వినియోగదారులు కేవలం 10 నిమిషాల పాటు ప్లగిన్ చేయడం ద్వారా 120 నిమిషాల ప్లేబ్యాక్‌ను పొందగలరు. మీరు జిమ్‌లో మరియు అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు దీనిని ఉపయోగించడానికి Realme TechLife Buds T100లో IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కంపెనీ ఈ ఇయర్‌బడ్‌లను వైట్ anb మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ దేశంలో ఈ కంపెనీ నుంచి ఇదువరకు విడుదల చేసిన Realme Buds Air 3 Neolకి సక్సెసర్‌గా పేర్కొంటున్నారు.

ఇదేకాకుండా, భారత్‌లో రియల్‌మీ కంపెనీ నుంచి వేరబుల్స్ సెగ్మెంట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Realme Tech Life Watch R100 స్మార్ట్ వాచ్ గురించి కూడా తెలుసుకుందాం:
Realme Tech Life Watch R100 స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్లు:
రియల్ మీ కంపెనీకి చెఇందిన ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ బ్లాక్ మరియు వైట్ కలర్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరబుల్ రూ.3,999 ధరకు అందుబాటులో ఉంది. ఇక ఈ ఈ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. దీనికి 360 x 360 pixels రిసొల్యూషన్‌తో 1.32 అంగుళాల కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. దాంతో పాటు ఈ వాచ్‌కు మనం రెండు మ్యాన్యువల్ ఆపరేటింగ్ హార్డ్ బటన్స్ కూడా కనుగొనవచ్చు. UI Navigation కు, స్ట్పోర్ట్ మోడ్ యాక్టివేట్ చేయడానికి ఈ బటన్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ వాచ్ చాలా లైట్‌వెయిట్ గా ఉంటుంది.
ఈ వాచ్ లో ఇంకా మరెన్నో విశేషాలు
ఈ రియల్ మీ Realme Tech Life Watch R100 లో ఇంకా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. Bluetooth Calling సౌకర్యంతో పాటుగా కంపాస్, క్యాలెండర్, అలారం క్లాక్, స్పీకర్, మైక్రోఫోన్ సపోర్ట్ వ్యవస్థలను ఈ వాచ్ కలిగి ఉంది. ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్‌లపై రియల్ మీ ఒక ఏడాది వరకు వారెంటీ కల్పించనుంది. ఇక ధర విషయానికొస్తే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరబుల్ రూ.3,999 ధరకు కొనుగోలు దారులకు అందుబాటులో ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470