రియల్‌మి నుంచి సూపర్ డిజైన్, ఫీచర్‌లతో హెడ్‌ఫోన్స్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
రియల్‌మి ఇవాళ తొలిసారిగా టెక్‌లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్‌ను (Realme Techlife Studio H1 Headphones) విడుదల చేసింది. దీంతోపాటు రియల్‌మి p1 స్పీడ్ 5G హ్యాండ్‌సెట్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ హెడ్‌ఫోన్స్ హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ను కలిగి ఉంటాయి. ఈ హెడ్‌ఫోన్స్ ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి. మరియు ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. దీంతోపాటు 80ms అల్ట్రా లో లేటెన్సీ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ సహా ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి టెక్‌లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్ 40mm మెగా డైనమిక్ బాస్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్స్ LDAC ఆడియో కోడిక్ మరియు Hi-Res సర్టిఫికేషన్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ హెడ్‌ఫోన్స్ 43dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్, 3 లెవల్ స్మార్ట్ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్), స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చాయి.

దీంతోపాటు ఈ రియల్‌మి హెడ్‌ఫోన్స్ 80ms అల్ట్రా లో లేటెన్సీ ఫీచర్‌ను కలిగి ఉంది. మరియు బ్లూటూత్ 5.4 తో పనిచేస్తుంది. 10 మీటర్ల వరకు రేంజ్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మి టెక్‌లైఫ్ స్టూడియో H1 600mAh బ్యాటరీని కలిగి ఉంది. పూర్తి ఛార్జింగ్ అయ్యేందుకు 1.5 గంటల సమయం పడుతుంది. రెడ్, వైట్, బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రియల్‌మి టెక్‌లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్‌ను అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఇతర ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్ ధర రూ.4,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.500 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా ప్రారంభ ధర రూ.4,499 గా ఉంది.
*ఈ హెడ్‌ఫోన్స్‌తోపాటు రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల అయింది. 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS తో పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా వెనుకవైపు డ్యూయల్ కెమెరాలతో విడుదల అయింది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.
ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రెండు వేరియంట్‌లపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








