భారత్‌లో Realme (Tech Life Watch R100) స్మార్ట్ వాచ్ విడుదల..
ఇటీవల ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఓ స్మార్ట్ థింగ్స్ వినియోగంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో స్మార్ట్ వాచ్‌లకు, స్మార్ట్ టీవీలు, సహా ఇతరత్రా ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. నేటి జనరేషన్ యువత కూడా Smart Watch లు చేతికి ధరించేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉండడం కూడా యువతను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు నిత్యం ఏదో ఓ కొత్త మోడల్ స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తుండడం మనం గమనించవచ్చు. అందులో భాగంగానే తాజాగా రియల్ మీ సంస్థ సరికొత్త Realme Tech Life Watch R100 స్మార్ట్ వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కానీ, ఆన్‌లైన్‌లో జూన్ 28 నుంచి వాచ్‌లు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత కంపెనీ అధికారిక వెబ్‌సైట్ తెలియజేసింది. అయితే ఈ వాచ్‌ను కంపెనీ బడ్జెట్ ధరలో అందించే దిశగా ముందడుగు వేసింది. ఈ వాచ్ రియల్ మీ వాచ్ ప్రస్తుతం భారత్ మార్కెట్లో విడుదలైంది. వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Realme Tech Life Watch R100 విశేషాలు..
రియల్ మీ సంస్థ ఈ Realme Tech Life Watch R100 ను వినియోగదారులకు బడ్జెట్ ధరలో అందిస్తోంది. రియల్ మీ టెక్ లైఫ్ ఎకో సిస్టమ్ సాంకేతికతతో తయారు చేసిన ఈ స్మార్ట్ వాచ్ Bluetooth Calling ఫీచర్ కలిగి ఉంది. ఇది సర్కిల్ (వృత్తాకారం) ఆకారంలో స్పోర్ట్స్ మోడ్‌ని కలిగి ఉంది. దీనికి అత్యధిక బ్యాటరీ సెల్‌ను ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జింగ్ ఫుల్ చేస్తే అత్యధిక సమయం వాచ్‌ను ఉపయోగించవచ్చని సంస్థ తెలిపింది. ఇది 380ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. కాగా రియల్ మీ కంపెనీ ఈ వాచ్‌ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేయడం విశేషం

ఈ వాచ్ ఎంతో లైట్ వెయిట్..
రియల్ మీ విడుదల చేస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ రెండు కలర్లలో అందుబాటులోకి రానుంది. బ్లాక్ మరియు వైట్ కలర్లలో ఇది అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా దీనికి గ్రే సిలికాన్ బ్యాండ్ అందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ కు 360 x 360 pixels రిసొల్యూషన్‌తో 1.32 అంగుళాల కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. దాంతో పాటు ఈ వాచ్‌కు మనం రెండు మ్యాన్యువల్ ఆపరేటింగ్ హార్డ్ బటన్స్ కూడా కనుగొనవచ్చు. UI Navigation కు, స్ట్పోర్ట్ మోడ్ యాక్టివేట్ చేయడానికి ఈ బటన్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ వాచ్ చాలా లైట్‌వెయిట్ గా ఉంటుంది. దాదాపు 46గ్రాముల కన్నా ఎక్కువ ఉండకపోవడం విశేషం. ఇది 24*7 హార్ట్ బీట్ రేటును మానిటరింగ్ చేస్తుంది. అంతేకాకుండా 100+ స్పోర్ట్స్ మోడ్ ఫీచర్ కలిగి ఉంది. వీటితో పాటు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీపింగ్ మానిటర్, స్ట్రెస్ మానిటర్ ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది.

ఈ వాచ్ లో ఇంకా మరెన్నో విశేషాలు
ఈ రియల్ మీ Realme Tech Life Watch R100 లో ఇంకా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. Bluetooth Calling సౌకర్యంతో పాటుగా కంపాస్, క్యాలెండర్, అలారం క్లాక్, స్పీకర్, మైక్రోఫోన్ సపోర్ట్ వ్యవస్థలను ఈ వాచ్ కలిగి ఉంది. ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్‌లపై రియల్ మీ ఒక ఏడాది వరకు వారెంటీ కల్పించనుంది. ఈ వాచ్ ధరను కంపెనీ రూ.3,999గా ప్రకటించింది. కానీ, జూన్ 28 వ తేదీ న రూ.3,699 కే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ వాచ్ కంపెనీ అధికారిక సైట్ మరియు ఇతర ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








