Just In
- 48 min ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 4 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 6 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- Sports
INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్
- News
తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు సవివరంగా బదులిచ్చిన ప్రధాని మోడీ
- Movies
తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ వివరణ.. ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
బడ్జెట్ ధరలో Realme (Tech Life Watch R100) స్మార్ట్ వాచ్.. విడుదల ఎప్పుడంటే!
యుగమంతా స్మార్ట్‌గా అభివృద్ధి చెందుతున్నప్పుడు అందుకు తగ్గట్టు జనాలు కూడా మారిపోతున్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఓ స్మార్ట్ థింగ్స్ వినియోగంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో స్మార్ట్ వాచ్‌లకు, స్మార్ట్ టీవీలు, సహా ఇతరత్రా ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. నేటి జనరేషన్ యువత కూడా Smart Watch లు చేతికి ధరించేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉండడం కూడా యువతను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు నిత్యం ఏదో ఓ కొత్త మోడల్ స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తుండడం మనం గమనించవచ్చు. అందులో భాగంగానే తాజాగా రియల్ మీ సంస్థ సరికొత్త Realme Tech Life Watch R100 స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అది కూడా బడ్జెట్ ధరలో అందించే దిశగా ముందడుగు వేసింది. ఈ వాచ్‌ను రియల్ మీ జూన్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Realme Tech Life Watch R100 విశేషాలు..
రియల్ మీ సంస్థ ఈ Realme Tech Life Watch R100 ను వినియోగదారులకు బడ్జెట్ ధరలో అందించనుంది. రియల్ మీ టెక్ లైఫ్ ఎకో సిస్టమ్ సాంకేతికతతో తయారు చేసిన ఈ స్మార్ట్ వాచ్ Bluetooth Calling ఫీచర్ కలిగి ఉంది. ఇది సర్కిల్ (వృత్తాకారం) ఆకారంలో స్పోర్ట్స్ మోడ్‌ని కలిగి ఉంది. దీనికి అత్యధిక బ్యాటరీ సెల్‌ను ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జింగ్ ఫుల్ చేస్తే అత్యధిక సమయం వాచ్‌ను ఉపయోగించవచ్చని సంస్థ తెలిపింది. కాగా రియల్ మీ కంపెనీ ఈ వాచ్‌ను రియల్ మీ జూన్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ వాచ్ ఎంతో లైట్ వెయిట్..
రియల్ మీ విడుదల చేస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ రెండు కలర్లలో అందుబాటులోకి రానుంది. బ్లాక్ మరియు వైట్ కలర్లలో ఇది అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా దీనికి గ్రే సిలికాన్ బ్యాండ్ అందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ కు 360 x 360 pixels రిసొల్యూషన్‌తో 1.32 అంగుళాల కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. దాంతో పాటు ఈ వాచ్‌కు మనం రెండు మ్యాన్యువల్ ఆపరేటింగ్ హార్డ్ బటన్స్‌కూడా కనుగొనవచ్చు. UI Navigation కు, స్ట్పోర్ట్ మోడ్ యాక్టివేట్ చేయడానికి ఈ బటన్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ వాచ్ చాలా లైట్‌వెయిట్ గా ఉంటుంది. దాదాపు 46గ్రాముల కన్నా ఎక్కువ ఉండకపోవడం విశేషం.
ఈ వాచ్ లో ఇంకా మరెన్నో విశేషాలు
ఈ రియల్ మీ Realme Tech Life Watch R100 లో ఇంకా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. Bluetooth Calling సౌకర్యంతో పాటుగా కంపాస్, క్యాలెండర్, అలారం క్లాక్, స్పీకర్, మైక్రోఫోన్ సపోర్ట్ వ్యవస్థలను ఈ వాచ్ కలిగి ఉంది. ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్‌లపై రియల్ మీ ఒక ఏడాది వరకు వారెంటీ కల్పించనుంది. ఈ వాచ్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, దీని ధర దాదాపు రూ.6వేలకు తక్కువగానే ఉంటుందని సమాచారం.
బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో ఇదువరకు విడుదలైన వాచెస్ (రూ.5వేల లోపు)..
ఇప్పటివరకు విడుదలైన స్మార్ట్ వాచ్‌లలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కలిగి, బడ్జెట్ ధరలో ఉన్న వాటిని మనం ఒకసారి పరిశీలిద్దాం.

Noise ColorFit Pulse Buzz (Rs. 3,299)
ఈ స్మార్ట్‌వాచ్ 42ఎంఎం ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్ కలర్‌లో ఉండి చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా వివిధ కలర్లలో బ్యాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. 360 x 360 pixels రిసొల్యూషన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు, మీ హార్ట్ బీట్ రేటు మానిటర్ చేసేందుకు వీలుంటుంది. ఈ స్మార్ట్ వాచ్ మీద అమెజాన్ కంపెనీ మీకు గొప్ప తగ్గింపును అందజేస్తుంది. ఇది భారత్‌లో జూన్ 8న విడుదలైంది.

Fire-Boltt Ninja Calling విత్ ఏఐ అసిస్టెంట్
ఈ స్మార్ట్‌వాచ్ 1.69 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు, మీ హార్ట్ బీట్ రేటు మానిటర్ చేసేందుకు వీలుంటుంది. ఇది రెక్టాంగిల్ ఆకారంలో ఉంటుంది. దీనికి ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, డీప్ గ్రీన్, గ్రే సహా అనేక ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. దీని ధర Rs. 2,999 గా ఉంది.

Gizfit 910 Pro (Rs. 2,499)
ఈ స్మార్ట్‌వాచ్ 1.69 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో (240 X 240px resolution) తో వస్తుంది. ఈ వాచ్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు, మీ హార్ట్ బీట్ రేటు మానిటర్ చేసేందుకు వీలుంటుంది. ఇది రెక్టాంగిల్ ఆకారంలో ఉంటుంది. దీనికి ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంది. ఈ వాచ్ స్క్రీన్ ఆఫ్ మరియు ఆన్ చేయడానికి ఒక హార్డ్ బటన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో రూ.2,499 కే అందుబాటులో ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470