Realme నుంచి రేపు భారత్‌లోకి స్మార్ట్‌ఫోన్, తొలి హెడ్‌ఫోన్స్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి రేపు (అక్టోబర్ 15) రెండు ఉత్పత్తులు విడుదల కానున్నాయి. రియల్‌మి P1 స్పీ్‌డ్ 5G స్మార్ట్‌ఫోన్ (Realme P1 Speed 5G Smartphone) సహా టెక్‌లైఫ్ స్టూడియో H1 పేరుతో (Realme Techlife Studio H) తొలి హెడ్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ తరహా హెడ్‌ఫోన్స్‌ను తొలిసారిగా విడుదల చేస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్స్ రియల్‌మి ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి హెడ్‌ఫోన్స్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి టెక్‌లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్ ఆన్ ఇయర్ డిజైన్ ను కలిగి ఉంటాయి. ఈ హెడ్‌ఫోన్స్ భారీ ఇయర్‌కప్స్ మరియు కిందివైపు వాల్యూమ్ కంట్రోల్ బటన్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు 40mm మెగా డైనమిక్ బాస్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి.

హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ : ఈ రియల్‌మి హెడ్‌ఫోన్స్ LDAC ఆడియో కోడిక్ టెక్నాలజీ మరియు Hi-Res సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు ఈ రియల్‌మి టెక్‌లైఫ్ స్టూడియో H1 హెడ్‌ఫోన్స్ 43dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. TWS బడ్స్ తరహాలోనే రూ.5000 కంటే తక్కువ ధరను కలిగి ఉంటాయని తెలుస్తోంది.
రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ :
దీంతోపాటు రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ కూడా రేపు విడుదల కానుంది. ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను సంస్థ ధ్రువీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 2.8D మైక్రో కర్వ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 26GB LPDDR4x ర్యామ్ (వర్చువల్ ర్యామ్‌తో కలిపి) మరియు 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాతో విడుదల కానుందని తెలుస్తోంది. గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ హ్యాండ్‌సెట్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ W-Fi 6, బ్లూటూత్ 5.4 వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు, IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్ సహా ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫాం ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 సెగ్మెంట్‌లో ఉంటుందని తెలుస్తోంది.
రియల్‌మి P1 సిరీస్‌లో ఇటీవల P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల FHD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. AI గేమింగ్ ఐ ప్రొటెక్షన్ డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది.
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు OIS సపోర్టుతో 50MP సోనీ LYT-600 కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర ప్రస్తుతం రూ.21999 గా ఉంది.


Click it and Unblock the Notifications








