గొప్ప ఫీచ‌ర్ల‌తో Realme Watch 3 Pro స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌! ధ‌ర ఎంతంటే!

|

Realme కంపెనీ భార‌త మార్కెట్లోకి తాజాగా ప‌లు స‌రికొత్త వేర‌బుల్స్‌ను లాంచ్ చేసింది. త‌మ కంపెనీ నుంచి AIoT ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ Realme Watch 3 Pro స్మార్ట్‌వాచ్ స‌హా, Realme Buds Air 3S ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లను కంపెనీ మంగళవారం భార‌త మార్కెట్లో విడుదల చేసింది. కొత్తగా లాంచ్ చేసిన డివైజ్‌లు కంపెనీకి చెందిన‌ టెక్‌లైఫ్ ఎకోసిస్టమ్‌లో ఒక భాగమని Realme పేర్కొంది.

 
గొప్ప ఫీచ‌ర్ల‌తో Realme Watch 3 Pro స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌! ధ‌ర ఎంతంటే

తాజాగా లాంచ్ చేయ‌బ‌డిన స్మార్ట్‌వాచ్ 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వ‌స్తోంది. ఇది మల్టీ-సిస్టమ్ GPS మరియు AI ఎన్విరాన్‌మెంట్ నాయిస్ రిడక్షన్ అల్గారిథమ్‌తో పాటుగా, బ్లూటూత్ కాలింగ్ ఫీచ‌ర్ల‌ను కలిగి ఉంది. ఇదే ఈవెంట్‌లో కంపెనీ, Realme Buds Air 3S ఇయ‌ర్‌ఫోన్స్ ప్యాక్ ను విడుద‌ల చేసింది. ఇవి 11mm లిక్విడ్ సిలికాన్ ట్రిపుల్ టైటానియం బేస్‌ డ్రైవర్‌లతో అధిక నాణ్యత గల స్టీరియో సరౌండ్ సౌండ్‌ను అందిస్తాయని కంపెనీ వెల్ల‌డించింది.

Realme Watch 3 Pro మరియు Realme Buds Air 3S ధర, లభ్యత:

Realme Watch 3 Pro మరియు Realme Buds Air 3S ధర, లభ్యత:

భారతదేశంలో కొత్తగా ప్రారంభించబడిన Realme Watch 3 Pro ధర రూ.4,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఇది సెప్టెంబర్ 9 వ తేదీన 12pm (మధ్యాహ్నం) నుండి Realme.com, Flipkart మరియు మెయిన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. Realme వాచ్ బ్లాక్‌, గ్రే రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది.

ఇక‌, Realme Buds Air 3S TWS ఇయర్‌ఫోన్‌ల ధర విష‌యానికొస్తే.. భార‌త మార్కెట్లో రూ.2,499 గా నిర్ణ‌యించారు. మరియు అవి సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 12 గంటల నుండి (మధ్యాహ్నం) Realme.com, Amazon మరియు మెయిన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా ఇవి సేల్‌కు రానున్నాయి. ఇయర్‌ఫోన్‌లు బాస్ బ్లాక్ మరియు బాస్ వైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తాయి.

Realme Watch 3 Pro స్పెసిఫికేష‌న్లు:
 

Realme Watch 3 Pro స్పెసిఫికేష‌న్లు:

Realme Watch 3 Pro స్మార్ట్‌వాచ్‌ 368x448 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వ‌స్తోంది. ఇది ఆల్బమ్ వాచ్ ఫేస్‌లతో సహా 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు మద్దతును అందిస్తుంది. ఇది నిరంతర GPS ఆపరేషన్‌లో భాగంగా బ్యాటరీ 20 గంటల వరకు ఉంటుందని Realme తెలిపింది. ఇది లొకేషన్ ట్రాకింగ్‌లో వినియోగదారులకు సహాయపడే ఐదు GNSS సిస్టమ్‌లతో వస్తుంది. దీనికి బ్లూటూత్ కాలింగ్ ఫీచ‌ర్ కూడా ఉంది.

Realme Watch 3 Proలో హృదయ స్పందన రేటు, స్టెప్ మరియు స్లీప్ ట్రాకింగ్ కోసం SpO2 మానిట‌రింగ్ క‌లిగిన సెన్సార్లు ఉన్నాయి. ఇతర ఆరోగ్య సంబంధిత లక్షణాలలో స్ట్రెస్ మానిట‌రింగ్‌, స్త్రీల‌ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించే ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్-సంబంధిత ఫీచర్ల విషయానికొస్తే, వర్కౌట్ ట్రాకింగ్ కోసం Realme Watch 3 Pro వాచ్ 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. రియల్‌మీ యాప్‌ని ఉపయోగించి శిక్షణ గణాంకాలను ట్రాక్ చేయడానికి కూడా స్మార్ట్‌వాచ్ అనుమతిస్తుంది. దీనికి 345mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాటరీ ఉంది, ఒక‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా గరిష్టంగా 10 రోజుల వరకు బ్యాట‌రీ లైఫ్ పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ పేర్కొంది.

Realme Buds Air 3S స్పెసిఫికేషన్స్:

Realme Buds Air 3S స్పెసిఫికేషన్స్:

Realme Buds Air 3S TWS ఇయర్‌ఫోన్‌లు మ్యూజిక్ బాక్స్ డిజైన్‌ను కలిగి ఉన్న‌ట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌ఫోన్‌లు మంచి మ్యూజిక్ బేస్ అందించడం కోసం 11mm ట్రిపుల్ టైటానియం బేస్ డ్రైవర్‌లను క‌లిగి ఉన్నాయి. డాల్బీ అట్మాస్ మరియు EQ ట్యూనింగ్ కోసం స్టీరియో సరౌండ్ సౌండ్ అవుట్‌పుట్‌ను అనుమతిస్తుంది. ఇంకా, మంచి సౌండ్ అనుభూతి కోసం ఇది AAC అధిక-నాణ్యత క‌లిగిన ఆడియో స‌పోర్టు క‌లిగి ఉంది.

Realme Buds Air 3S లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.3 స‌దుపాయాన్ని అందిస్తున్నారు. ఈ బ‌డ్స్‌ను ఒకే సమయంలో రెండు డివైజ్‌ల‌కు లింక్ చేయవచ్చు. Realme Buds Air 3Sను ఒక‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా గరిష్టంగా 30 గంటల వరకు నిరంతర ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ వెల్ల‌డించింది. ఇవి ఒక గంటలో పూర్తిగా ఛార్జ్ చేయబడతాయి. అంతేకాకుండా, వీటిని 10 నిమిషాల ఛార్జ్ చేయ‌డం ద్వారా 5 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. Realme Buds Air 3Sలో కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తొలగించే AI ENC నాయిస్ క్యాన్సిలింగ్ అల్గారిథమ్ కూడా ఉంది. వాట‌ర్ మ‌రియు డ‌స్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ బ‌డ్స్‌కు IPX5 రేట్ టెక్నాల‌జీ వినియోగించ‌డం జ‌రిగింది.

Best Mobiles in India

English summary
Realme Watch 3 Pro Realme Buds Air 3S TWS Earphones Launched in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X