Home
Gadgets

14 రోజుల బ్యాటరీ లైఫ్‌, బ్లూటూత్‌ ఇంటర్‌కామ్‌ సపోర్టు, IP68 రేటింగ్‌తో స్మార్ట్‌వాచ్‌..!

రియల్‌మి నుంచి త్వరలో వాచ్‌ 5 విడుదల అయ్యే (Realme Watch 5) అవకాశం ఉంది. 2022 సంవత్సరంలో లాంచ్ అయిన వాచ్‌ 3 సిరీస్‌ కు తర్వాత వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది. రియల్‌మి వాచ్ 5 కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. డిజైన్ సహా కొన్ని కీలక స్పెసిఫికేషన్‌ ల వివరాలు ఉన్నాయి. ఈ వాచ్‌ పూర్తి వివరాలు.

డిస్‌ప్లే అంచనా వివరాలు :
ప్రస్తుతం లీక్‌ అయిన వివరాల ఆధారంగా రియల్‌మి వాచ్ 5 స్మార్ట్‌వాచ్‌ 1.97 అంగుళాల స్వేర్‌ అమోలెడ్‌ వాచ్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 390 x 450 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Realme Watch 5 smartwatch

IP68 రేటింగ్‌తో! :
రియల్‌మి వాచ్ 5 స్మార్ట్‌వాచ్‌ 300 పైగా వాచ్ ఫేసేస్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. Xpertpick రిపోర్టు ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ వాచ్‌ IP68 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

హై క్వాలిటీ బ్లూటూత్‌ కాలింగ్‌! :
ఈ రిపోర్టు ఆధారంగా ఈ స్మార్ట్‌వాచ్‌ హై క్వాలిటీ బ్లూటూత్‌ కాలింగ్‌ సదుపాయాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు GPS, GNSS సిస్టమ్‌, NFC వంటి ఫీచర్‌లు కూడా ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకమైన గేమింగ్‌ మోడ్‌ను కూడా సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. దీని ద్వారా గేమింగ్‌ టూల్స్ సహా రియల్‌టైం మానిటరింగ్‌ చేయవచ్చు.

నేరుగా వాచ్ నుంచే కాల్స్‌ :
ఈ వాచ్‌ మరో ఆసక్తికర ఫీచర్‌ ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రియల్‌మి వాచ్‌ 5 స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ ఇంటర్‌కామ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా నేరుగా స్మార్ట్‌వాచ్‌ నుంచే కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

14 రోజుల బ్యాటరీ లైఫ్‌ :
ఈ రియల్‌మి వాచ్‌ 5 స్మార్ట్‌వాచ్‌ 460mAh బ్యాటరీతో లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ వాచ్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 14 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. లైట్‌ స్మార్ట్‌ మోడ్‌ లో 20 రోజుల బ్యాటరీ లైఫ్‌ అందిస్తోందని తెలుస్తోంది.

ఐదు సంవత్సరాల గ్యారెంటీ! :
ఈ వాచ్‌ ఐదు సంవత్సరాల బ్యాటరీ గ్యారెంటీతో వస్తుందని తెలుస్తోంది. లీక్‌ అయిన ఫోటోల ఆధారంగా ఈ స్మార్ట్‌వాచ్‌ రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుందని భావిస్తున్నారు. బ్లాక్‌ స్ట్రాప్‌తో కూడిన బ్లాక్‌ కేస్‌, సిల్వర్ స్ట్రాప్‌తో కూడిన సిల్వర్‌ కేస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా రియల్‌మి వాచ్‌ 5 గ్లోబల్‌ మార్కెట్లో త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారత్‌లో విడుదల కానుందా లేదా అనే వివరాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఎంత ధరలో అందుబాటులోకి వస్తుందనే వివరాలు కూడా వెల్లడి కాలేదు.

Best Mobiles in India

English summary
Realme Watch 5 smartwatch images and key features tipped online full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X