Realme Watch 5 : రియల్‌మి వాచ్ 5 కీలక వివరాలు లీక్.. 14 రోజుల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కాలింగ్?
Realme Watch 5 India Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి త్వరలో P4x, రియల్‌మి C85 5G ఫోన్‌లు భారత్ మార్కెట్ లో లాంచ్ కానున్నాయి. C85 5G ఫోన్ ఈనెల 28 వ తేదీన విడుదల కానుంది. అయితే రియల్‌మి నుంచి త్వరలో స్మార్ట్‌వాచ్ లాంచ్ కానుంది. రియల్‌మి వాచ్ 5 పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ వాచ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా :
రియల్‌మి వాచ్ 5 స్మార్ట్‌వాచ్ త్వరలో భారత్ మార్కెట్ లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఫ్లి్ప్‌కార్ట్ ద్వారా డిజైన్ విడుదల అయింది. ఈ వాచ్ దీర్ఘచతురస్రాకార డయల్ కలిగి ఉంది. మరియు సింగిల్ ఛార్జింగ్ తో ఏకంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్ పొందుతుందని తెలుస్తోంది.

గ్లోబల్ వేరియంట్ ఫీచర్లు :
రియల్‌మి వాచ్ 5 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ వాచ్ గ్లోబల్ వేరియంట్ 60Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్ తో 1.97 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్ 108 స్పోర్ట్స్ మోడ్స్ ను కలిగి ఉంది. మరియు 300 వాచ్ ఫేస్‌స్ ను సపోర్టు చేస్తుంది.
బ్లూటూత్ కాలింగ్, GPS, NFC సహా అనేక ఫీచర్లు :
ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ను సపోర్టు చేస్తుంది. నేవిగేషన్ కోసం GPS తోపాటు 5 బిల్ట్ ఇన్ గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు NFC పేమెంట్స్ ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ సింగిల్ ఛార్జింగ్ తో 720 నిమిషాల బ్లూటూత్ కాలింగ్ టైం అందిస్తుందని చెబుతోంది.
14 రోజుల వ్యాలిడిటీ, హెల్త్ ట్రాకర్లు :
ఈ రియల్‌మి వాచ్ అనేక హెల్త్ ఫీచర్ లను కలిగి ఉంది. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 ట్రాకింగ్, నిద్ర సహా ఒత్తిడి ట్రాకింగ్ చేసే ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 14 రోజులపాటు వినియోగించుకోవచ్చు.
IP68 రేటింగ్‌తో :
రియల్ వాచ్ 5 గ్లోబల్ మార్కెట్ లో IP68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ధర EUR 60 ( భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.6000 ) గా ఉంది. అయితే భారత్ మార్కెట్ కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.
అవే ఫీచర్లు ఉంటాయా? :
గ్లోబల్ వేరియంట్‌లో ఫీచర్లే, భారత్ వేరియంట్ లోనూ ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. సుమారుగా గ్లోబల్ వేరియంట్ ధరలోనే అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








