Realme Watch 5 : అమోలెడ్ డిస్‌ప్లే, IP68 రేటింగ్, హెల్త్ ట్రాకర్లతో స్మార్ట్‌వాచ్ విడుదల..!
Realme Watch 5 launched : రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్ లో ఇవాళ రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌తోపాటు రియల్‌మి వాచ్ 5 ను కూడా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ అమోలెడ్ డిస్‌ప్లే, IP68 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి 20 రోజుల వరకు వినియోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది. దీంతోపాటు అనేక హెల్త్ ట్రాకర్లు కూడా ఉన్నాయి. GPS, బ్లూటూత్ కాలింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
రియల్‌మి వాచ్ 5 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌వాచ్ 1.97 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 60Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ వాచ్ 300+ వాచ్ ఫేసెస్ ను కలిగి ఉంటుంది. రియల్‌మి వాచ్ అల్యూమినియం క్రౌన్ ను కలిగి ఉంది. IP68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.

హెల్త్ ట్రాకర్లు :
ఈ వాచ్ 108 స్పోర్ట్స్ మోడ్స్ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్, ఒత్తిడి స్థాయి, GPS సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్, గేమ్ గార్డియన్ మోడ్, NFC, 3D వేవ్ స్ట్రాప్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.
20 రోజుల బ్యాటరీ లైఫ్ :
రియల్‌మి వాచ్ 5 స్మార్ట్‌వాచ్ 460mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి స్టాండర్డ్ మోడ్‌లో 16 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. అదే లైట్ స్మార్ట్ మోడ్ లో గరిష్ఠంగా 20 రోజుల వరకు వినియోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది.
ధర, కలర్ వేరియంట్స్ :
రియల్‌మి వాచ్ 5 స్మార్ట్‌వాచ్ (Realme Watch 5 Sale in india) ధర రూ.4,499 గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, మింట్ బ్లూ, వైబ్రంట్ ఆరెంజ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
ఈ వాచ్ సేల్ డిసెంబర్ 10 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుందని రియల్‌మి తెలిపింది.
ఈ వాచ్‌తోపాటు రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ఆఫర్ లో భాగంగా రూ.13499 కే కొనుగోలు చేయవచ్చని రియల్‌మి తెలిపింది. ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ ఫోన్ 50MP, 2MP. 16MP (సెల్ఫీ) కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల ఫుల్ HD LCD తో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








