Flipkartలో అద్భుతమైన ఆఫర్లతో రియల్‌మి వాచ్ S సిరీస్ మొదటి సేల్...

|

ప్రముఖ రియల్‌మి సంస్థ ఇటీవల తన రియల్‌మి వాచ్ S సిరీస్ రెండు స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. ఈ రియల్‌మి వాచ్ S, రియల్‌మి వాచ్ S ప్రో యొక్క అమ్మకాలు ఈ రోజు నుండి మొదలయ్యాయి. రియల్‌మి వాచ్ S యొక్క మొదటి ఫ్లాష్ సేల్‌ ఇప్పటికే ప్రారంభం కాగా ప్రో వేరియంట్ యొక్క ఫ్లాష్ అమ్మకాలు రేపు అంటే డిసెంబర్ 29 న మొదలుకానున్నాయి. వృత్తాకార డయల్ డిజైన్‌తో విడుదల చేసిన కొత్త వాచ్లు హృదయ స్పందన మరియు నిద్ర పర్యవేక్షణ వంటి ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాక్ అప్ ను అందించే బ్యాటరీని కలిగి ఉంటుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి వాచ్ S సిరీస్ ధరలు & సేల్స్ ఆఫర్స్

రియల్‌మి వాచ్ S సిరీస్ ధరలు & సేల్స్ ఆఫర్స్

రియల్‌మి వాచ్ S ఇండియాలో 4,999 రూపాయలు మరియు ప్రో వేరియంట్ 9999 రూపాయల ధర వద్ద విడుదల అయ్యాయి. S వేరియంట్ అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరియు ప్రో వేరియంట్ అమ్మకాలు రేపటి నుంచి రియల్‌మి.కామ్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అనుబాటులో ఉండనున్నాయి. ఇవి సిలికాన్ స్ట్రాప్ లతో బ్లాక్, బ్లూ, గ్రీన్ మరియు ఆరంజ్ అనే నాలుగు కలర్ ఎంపికలలో పొందవచ్చు. ఈ రెండిటి కొనుగోలు మీద ఫ్లిప్‌కార్ట్ లో ఎంచుకున్న క్రెడిట్ కార్డులు మరియు EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపుతో అందించబడతాయి. రియల్‌మే వాచ్ S ప్రోను ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో నో-కాస్ట్ EMI ఎంపికలతో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి వాచ్ S స్పెసిఫికేషన్స్

రియల్‌మి వాచ్ S స్పెసిఫికేషన్స్

రియల్‌మి వాచ్ S 360x360 పిక్సెల్స్ పరిమాణంతో 1.3 అంగుళాల వృత్తాకార డిస్ప్లేను 600 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ఇది 2.5 D-కర్వ్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్ట్ చేయబడి వస్తుంది. ఇది క్రికెట్, ఇండోర్ రన్, అవుట్డోర్ సైక్లింగ్, ఫుట్‌బాల్, యోగా వంటి 16 స్పోర్ట్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ వాచ్ రియల్ టైమ్ హృదయ స్పందన పర్యవేక్షణ కోసం PPG సెన్సార్ మరియు బ్లడ్ ఆక్సిజన్ స్థాయి పర్యవేక్షణ కోసం స్పొ 2 సెన్సార్ తో వస్తుంది. ఆలాగే ఇది 1.5 మీటర్ల వరకు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది 390mAh బ్యాటరీని కలిగి ఉండి ఒక ఛార్జీపై 15 రోజుల వాడకాన్ని అందించగలదు.

రియల్‌మి వాచ్ S ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి వాచ్ S ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి వాచ్ S ప్రో వాచ్ 1.39-అంగుళాల వృత్తాకార AMOLED డిస్ప్లేను 454x454 పిక్సెల్స్ సాంద్రత, 450 నిట్స్ ప్రకాశంతో మరియు 2.5 D-కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. అధునాతన ఆల్వేస్-ఆన్ డిస్ప్లే యొక్క OTA అప్ డేట్ త్వేరలోనే ప్రవేశపెట్టబడుతుంది. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడి ARM కార్టెక్స్ M4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది కూడా బహిరంగ రన్, ఇండోర్ రన్, అవుట్డోర్ సైక్లింగ్, స్విమ్మింగ్ మరియు క్రికెట్‌తో సహా 15 రకాల స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. 5ATM నీటి నిరోధకత, 24x7- హృదయ స్పందన మానిటర్ మరియు ఆక్సిజన్ స్థాయి మానిటర్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది ఇన్‌బిల్ట్ డ్యూయల్-శాటిలైట్ జిపిఎస్ మరియు స్టెప్ మానిటరింగ్, నిశ్చల రిమైండర్, స్లీప్ మానిటరింగ్, హైడ్రేషన్ రిమైండర్ మరియు ధ్యానం సడలించడం వంటి ఇతర ఆరోగ్య విధులకు మద్దతు ఇస్తుంది. ఇది 420 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme Watch S Series First Sale Starts in Flipkart and Realme.com: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X