20 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మి వాచ్ S2, 40 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో బడ్స్ T310 విడుదల... సేల్ వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్ ఇవాళ భారత్‌లో రియల్‌మి 13 ప్రో 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు సహా రియల్‌మి వాచ్ S2 (Realme watch S2 Launched), రియల్‌మి బడ్స్ T310 (Realme Buds T310 Launched) ను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లో మిడ్ రేంజ్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు హెల్త్ ట్రాకర్‌లను కూడా కలిగి ఉంది. అదే బడ్స్ T310 అనేక ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది.
రియల్‌మి వాచ్ S2 ధర, స్పెసిఫికేషన్‌లు :
ఈ రియల్‌మి స్మార్ట్‌వాచ్ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో అందుబాటులోకి వచ్చింది. 380mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 20 రోజులపాటు పనిచేస్తుందని రియల్‌మి సంస్థ చెబుతోంది.

ఈ రియల్‌మి వాచ్ S2 ఏఐ పర్సనల్ అసిస్టెంట్ మరియు స్మార్ట్‌వాచ్ ఫేస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్ ట్రాకర్లతో అందుబాటులోకి వచ్చింది. హార్ట్ రేట్, SpO2, 24 గంటలపాటు నిద్ర నాణ్యత పర్యవేక్షణ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. దీంతోపాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ రియల్‌మి వాచ్ S2 మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది. మిడ్‌నైట్ బ్లాక్, ఓసియన్ బ్లాక్, మెటాలిక్ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్, ఒసియన్ రంగుల వాచ్ ధర రూ.4499 గా ఉంది. అదే మెటాలిక్ గ్రే కలర్ వేరియంట్ ధర రూ.4999 గా ఉంది. ఆగస్టు 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి బడ్స్ T310 స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి బడ్స్ T310 మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్లను కలిగి ఉంది. డీప్, పవర్‌ఫుల్ సౌండ్, 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్‌ల ద్వారా మెరుగైన ఆడియోను పొందవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ 46dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో పనిచేస్తుంది.
దీంతోపాటు ఈ బడ్స్ AI డీప్ కాల్ నాయిస్ రిడక్షన్, స్మార్ట్ డ్యూయల్ డివైస్ కనెక్షన్, 45ms అల్ట్రా లో లేటెన్సీ, బ్లూటూత్ 5.4, డైనమిక్ సౌండ్ ఎఫెక్ట్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 40 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చని సంస్థ చెబుతోంది. IP55 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ రియల్‌మి బడ్స్ T310 ధర రూ.2199 గా ఉంది. ఆగస్టు 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. మానెట్ పర్పుల్, వైబ్రంట్ బ్లాక్, ఎజైల్ వైట్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








