షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్ల తయారీ సంస్థ షియోమీ ఈ ఏప్రిల్ 23వ తేదీ స్మార్టర్ లివింగ్ (Xiaomi Smarter Living 2024) పేరుతో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో అనేక ఉత్పత్తులను ప్రారంభించనుంది. ఫలితంగా తన ఫోర్ట్‌ఫోలియోలను విస్తరించుకోనుంది.
ఈ తాజాగా షియోమీ కీలక ప్రకటన చేసింది. ఇదే ఈవెంట్‌లో రెడ్‌మి బడ్స్ 5A (Redmi Buds 5A Launch) ను లాంచ్ చేయనుంది. దీంతోపాటు రెడ్‌మి ప్యాడ్ SE ను విడుదల చేయనుంది. మరియు రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ANC, బ్లూటూత్ 5.4 ఫీచర్లు :
రెడ్‌మి బడ్స్ 5A ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్), బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. గూగుల్ ఫాస్ట్ పెయిర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ రెడ్‌మి బడ్స్ 5A.. 12mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ బడ్స్ తెలుపు, నలుపు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. అయితే ఈ బడ్స్ మరిన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. విడుదల నాటికి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెడ్‌మి బడ్స్ 5 ధర రూ.2999 గా ఉన్నాయి. ఇవి 12.4 mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంది. 26dB వరకు ANC సపోర్టు చేస్తాయి. సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 38 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
ఈ షియోమీ ప్రత్యేక ఈవెంట్‌లో రెడ్‌మి ప్యాడ్ SE మరియు ఇతర అనేక ఉత్పత్తులను కూడా ప్రారంభించనుంది. రెడ్‌మి ప్యాడ్ SE క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 680 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన బ్యాటరీని కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 14 గంటల ప్లేబ్యాక్ టైం లేదా 43 రోజులపాటు స్టాండ్‌బై టైం పొందుతుందని సంస్థ చెబుతోంది.

దీంతోపాటు ఈ రెడ్‌మి ప్యాడ్ SE స్ప్లిట్ స్క్రీన్ మరియు ఫ్లోటింగ్ విండోస్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రెండు ఫీచర్లపై సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ప్యాడ్ గత సంవత్సరం యూరప్‌లో లాంచ్ అయింది. ఆ వివరాల ఆధారంగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 199 (భారత కరెన్సీ ప్రకారం రూ.18,000) గా ఉంది.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI పైన పనిచేస్తుంది. మరియు 11 అంగుళాల పుల్ HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 10W వైర్ USB-C ఛార్జింగ్ సపోర్టుతో 8000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులు కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








