Home
Gadgets

రెడ్‌మి బడ్స్‌ 6 ఇయర్‌బడ్స్‌ విడుదల తేదీ వెల్లడి.. ANC, ENC ఫీచర్‌లతో 42 గంటల బ్యాటరీ లైఫ్‌..!

భారత్‌ మార్కెట్‌లో డిసెంబర్‌ 9వ తేదీన రెడ్‌మి నోట్ 14 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కానుందని షియోమీ ఇప్పటికే వెల్లడించింది. ఈ సిరీస్‌ లో భాగంగా నోట్‌ 14, నోట్‌ 14 ప్రో, ప్రో ప్లస్‌ మోడళ్లు లాంచ్ కానున్నాయి. అయితే షియోమీ నుంచి తాజాగా మరో ప్రకటన వచ్చింది. డిసెంబర్‌ 9న రెడ్‌మి బడ్స్‌ 6 TWS ఇయర్‌బడ్స్‌ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ బడ్స్ ఇప్పటికే చైనాలో లాంచ్‌ అయింది. అయితే భారత్‌ లోనూ చైనా వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

రెడ్‌మి బడ్స్‌ 6 ఇయర్‌బడ్స్‌ (Redmi Buds 6 TWS Earbuds) ANC ఫీచర్‌ సహా సింగిల్‌ ఛార్జింగ్‌ తో 42 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ ఇస్తుందని సంస్థ చెబుతోంది. షియోమి ఇండియా వెబ్‌సైట్‌ సహా అమెజాన్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ వివరాలను అమెజాన్, షియోమీ ఇండియా ధ్రువీకరించింది.

Redmi Buds 6 TWS Earbuds

రెడ్‌మి బడ్స్‌ 6 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి TWS ఇయర్‌బడ్స్‌ కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివరాల ఆధారంగా ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బడ్స్‌ 49dB వద్ద డ్యూయల్‌ డ్రైవర్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ENC) ఫీచర్‌ను కలిగి ఉంది.

దీంతోపాటు రెడ్‌మి బడ్స్ 6 TWS ఇయర్‌బడ్స్‌ IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌ తో విడుదల కానున్నాయి. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 42 గంటలపాటు వినియోగించుకోవచ్చు. USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

Redmi Buds 6 TWS Earbuds

డిజైన్‌ పరంగా రెడ్‌మి బడ్స్‌ 6 ఇండియన్ వేరియంట్‌.. చైనా మోడల్ తరహా లోనే ఉంది. పిల్ షేప్‌తో (Pill shaped) కూడిన ఛార్జింగ్‌ కేస్‌ను కలిగి ఉంది. ఛార్జింగ్‌ కేస్‌ LED లైట్‌ ను అమర్చి ఉంటుంది. దీంతోపాటు టీజర్‌ ఆధారంగా ఈ బడ్స్ బ్లాక్‌, సియాన్, వైట్‌ రంగుల్లో లభిస్తుంది.

ధర విషయానికి వస్తే రెడ్‌మి బడ్స్ 6 TWS ఇయర్‌బడ్స్‌ (Redmi Buds 6 Price) చైనా మార్కెట్‌ లో CNY 199 (భారత కరెన్సీ ప్రకారం రూ.2,400) గా ఉంది. ‌అయితే భారత్‌ లో ధరపై షియోమీ ఇండియా ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఇతర ఫీచర్‌ ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

డిసెంబర్‌ 9 వ తేదీన రెడ్‌మి నోట్‌ 14 సిరీస్ లాంచ్‌ కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు ఆధారంగా రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్‌ వేరియంట్ వెనుక వైపు 50MP ప్రైమరీ + 50MP పొర్ట్రెయిట్‌ టెలీఫొటో కెమెరా + 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 90Hz ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6,200mAh భారీ బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Buds 6 TWS Earbuds launch date confirmed in india check features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X