Home
Gadgets

రెడ్ మీ ఫైర్ టీవీ లాంచ్ తేదీ విడుదలైంది! ఈ టీవీ స్పెషల్ ఫీచర్లు ఇవే!

By Maheswara

భారతదేశంలో రెడ్‌మి ఫైర్ టీవీని త్వరలోనే లాంచ్‌ చేస్తున్నట్లు షియోమి ఇప్పుడే ధృవీకరించింది. ఈ లాంచ్ కూడా మరి కొద్ది రోజుల్లోనే అంటే మార్చి 14, 2023న జరుగుతుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీ ఫైర్ టీవీ OS తో పనిచేస్తుంది. ప్రస్తుత మార్కెట్లోని ఆండ్రాయిడ్ టీవీలతో విసిగిపోయిన వినియోగదారులకు ఇది సరికొత్త మార్పు.

ఈ స్మార్ట్ TV స్పేస్‌లో షియోమీ మరియు రెడ్ మీ అందించే చాలా సేవలు ఆండ్రాయిడ్ TV లు ఇవ్వలేవు. ఈ ఫైర్ TV OS అమెజాన్ యాజమాన్యంలో ఉంటుంది మరియు నిర్వహించబడుతుంది. మీరు ఎప్పుడైనా అమెజాన్ ఫైర్ TV స్టిక్ ని ఉపయోగించినట్లయితే, మీకు ఫైర్ TV OS యొక్క అనుభవం ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు.

Redmi Fire TV Set To Launch On March 14 In India, Specifications Details In Telugu.

ఈ స్మార్ట్ టీవీ లాంచ్ త్వరలోనే ఉన్నందున దీని కోసం కొత్త పేజీని షియోమీ ఏర్పాటు చేసింది. ఈ టీజర్ పేజీలో, రెడ్ మీ ఫైర్ టీవీ బాక్స్ తో పాటే ఫైర్ OS 7 తో వస్తుందని షియోమీ ధృవీకరించింది. ఈ కొత్త స్మార్ట్ టీవీతో ప్రీమియం అనుభవాన్ని వినియోగదారులకు అందించాలని కంపెనీ కోరుకుంటోంది. ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు అమెజాన్ మ్యూజిక్ వంటి ప్రముఖ OTT (ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫారమ్‌లకు ప్రత్యేకమైన బటన్ లతో కూడిన రిమోట్‌ను కలిగి ఉంటుంది.

కేవలం వాయిస్ ఆదేశాలతో కూడా ఈ స్మార్ట్ టీవీని మీరు వాడటానికి మీకు సహాయపడే వర్చువల్ అసిస్టెంట్ అయిన అలెక్సాను యాక్సెస్ చేయడానికి ఈ రిమోట్ వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో స్మార్ట్ హోమ్ కంట్రోల్ హబ్ కూడా ఉంటుంది. దీనితో, మీరు కనెక్ట్ చేయబడిన అన్ని స్మార్ట్ IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరాలను కూడా మీరు నియంత్రించగలుగుతారు.

Redmi Fire TV Set To Launch On March 14 In India, Specifications Details In Telugu.

ఈ కొత్త రెడ్‌మి ఫైర్ టీవీ బెజెల్ లెస్ డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ వినియోగదారులకు అత్యుత్తమ విజువల్స్ మరియు అద్భుతమైన ఆడియో అనుభూతిని అందిస్తుందని షియోమీ తెలిపింది.రెడ్‌మి విడుదల చేయనున్న కొత్త స్మార్ట్ టీవీలు 4K డిస్‌ప్లే మరియు హెచ్‌డిఆర్ 10/హెచ్‌ఎల్‌జి సపోర్ట్‌తో వస్తాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలు అత్యుత్తమ స్క్రీన్ అనుభవాన్ని అందిస్తాయి.

ఈ కొత్త స్మార్ట్ టీవీలు ఫైర్ OS 7 ని కలిగి ఉంటాయి కాబట్టి స్మార్ట్ టీవీ అనుభవం అద్భుతంగా ఉంటుంది.రాబోయే ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీలు 2GB RAM మరియు 16GB స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తాయి. ఇంకా, ఈ కొత్త స్మార్ట్ టీవీలు క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు మాలి G52 GPU మద్దతుతో లాంచ్ చేయబడతాయి.

ఇక కనెక్టివిటీ విభాగంలో, ఇది AirPlay, Miracast, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ 5.0కి మద్దతు ఇవ్వగలదు.షియోమీ బ్రాండ్ భారతదేశంలో లాంచ్ చేసిన తర్వాత రాబోయే రెడ్‌మి ఫైర్ టీవీ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. మార్చి 14, 2023 లాంచ్ తేదీ కూడా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కావున పూర్తి వివరాలకోసం వేచిచూడాల్సిందే.

Best Mobiles in India

English summary
Redmi Fire TV Set To Launch On March 14 In India, Specifications Details In Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X