రెడ్‌మి AI స్పీకర్, రూటర్ AC2100 ధరలు ఎలా ఉన్నాయో చూడండి

|

ప్రముఖ చైనా కంపెని షియోమి ఈ ఏడాది ప్రారంభంలో రెడ్‌మి సంస్థను దాని సబ్ బ్రాండ్‌గా ప్రకటించింది. సబ్ బ్రాండ్ అయినప్పటికి రెడ్‌మి చాలా విషయాలలో షియోమికి చాలా భిన్నంగా చేస్తున్నారు. మొదట ఇది తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను రెడ్‌మి K 20 సిరీస్ రూపంలో ప్రవేశపెట్టింది. తరువాత ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతున్న కొత్త ల్యాప్‌టాప్‌లను ప్రకటించింది.

రూటర్ AC2100
 

ఇప్పుడు కొత్తగా రెడ్‌మి K 30-సిరీస్ మరియు రెడ్‌మిబుక్ 13 ల్యాప్‌టాప్‌లను ప్రకటించండంతో పాటు ఈ సంస్థ మరో రెండు కొత్త ఉత్పత్తులను కూడా విడుదల చేసింది. వీటిలో రెడ్‌మి AI స్పీకర్ ప్లే మరియు రెడ్‌మి రూటర్ AC2100 ఉన్నాయి.

జియోను అదిగమించిన వోడాఫోన్,ఎయిర్టెల్

రెడ్‌మి AI స్పీకర్ ప్లే ఫీచర్స్

రెడ్‌మి AI స్పీకర్ ప్లే ఫీచర్స్

రెడ్‌మి AI స్పీకర్ ప్లే షియోమి సొంత షియోమి ఐ 3.0 వర్చువల్ వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. ఇది స్మార్ట్ హోమ్ పరికరాల నియంత్రణను కూడా అనుమతిస్తుంది. రెడ్‌మి AI స్పీకర్ ప్లే ధర CNY 79 (సుమారు రూ .800). ఈ స్మార్ట్ స్పీకర్ వైట్,బ్లూ,లైమ్ మరియు రెడ్ వంటి నాలుగు కలర్ ఎంపికలలో లభిస్తుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

డిజైన్ పరంగా చూస్తే ఈ పోర్టబుల్ స్పీకర్ ABS ప్లాస్టిక్ బిల్డ్‌తో పొడవైన క్యూబికల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో 1.75-అంగుళాల 5W స్పీకర్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటికీ అనుకూలంగా ఉన్న రెడ్‌మి AI స్పీకర్ ప్లే CVC-ఎనేబుల్డ్ కమ్యూనికేషన్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్‌ను కూడా అనుమతిస్తుంది. రెడ్‌మి AI స్మార్ట్ స్పీకర్ వైర్‌లెస్ బ్లూటూత్ మెష్ టెక్నాలజీకి కూడా మద్దతు ఇస్తుంది. ఇది 2,000 అనుకూలమైన MI హోమ్ ఉత్పత్తులతో పని చేస్తుంది. అలాగే యూజర్ యొక్క నిర్దిష్ట ఉచ్చారణకు అనుగుణంగా ఉండే ఇంటెలిజెంట్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ ఇందులో అదనపు ఆకర్షణ.

రెడ్‌మి రూటర్ AC2100 ఫీచర్స్
 

రెడ్‌మి రూటర్ AC2100 ఫీచర్స్

రెడ్‌మి రూటర్ AC2100 2.4GHz మరియు 5GHz బ్యాండ్‌లలో పనిచేయగలదు. దీని ద్వారా 2033 Mbps వేగంతో డేటాను ప్రసారం చేయగలదు. ఇది మరింత స్థిరమైన డేటా ట్రాన్స్మిషన్ను కలిగి ఉండటానికి ఎర్రర్ కరెక్షన్ అల్గోరిథంను కలిగి ఉంది. రౌటర్ ఫ్లాట్-గుండ్రని డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది వైట్ కలర్ లో వస్తుంది. సిగ్నల్ వేగాన్ని తెలియజేయడానికి దీని ముందు భాగంలో అనేక LED సూచికలను కలిగి ఉంది. రౌటర్ ఆరు ఓమ్నిడైరెక్షనల్లలో 5dbi యాంటెన్నాలను కూడా కలిగి ఉంది.

MiWiFi

సాఫ్ట్‌వేర్ స్థాయిలో ఇది MiWiFi యాప్ కు అనుకూలంగా ఉంటుంది. MiWiFi యాప్ తో కనెక్ట్ చేయబడిన డివైస్ లను మానేజ్ చేయవచ్చు అలాగే వెబ్‌సైట్‌లకు యాక్సిస్ ను నిరోధించవచ్చు, ఇంటర్నెట్ వేగం మరియు ప్రతి డివైస్ యాక్సిస్ చేయగల బ్యాండ్‌విడ్త్‌ను పరిమితం చేయవచ్చు. కొత్త డివైస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన ప్రతిసారీ యాప్ మొబైల్‌లో నోటిఫికేషన్‌లను చూపుతుంది.

రెడ్‌మి రూటర్

రెడ్‌మి రూటర్ AC2100 డ్యూయల్-బ్యాండ్ వై-ఫైను 4 x 4 MU-MIMO టెక్నాలజీ మరియు ఐపివి 6 సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 880MHz వద్ద క్లాక్ చేసిన డ్యూయల్ కోర్ చిప్‌సెట్‌తో పాటు 128MB ర్యామ్‌తో వస్తుంది. దీని వెనుకవైపు ఒక గిగాబిట్ WAN పోర్ట్ మరియు రెండు గిగాబిట్ LAN పోర్టులు ఉన్నాయి. ఈ రౌటర్ ఒకే సారి 128 డివైస్ లను కనెక్ట్ చేయగలదు. షియోమి రెడ్‌మి రూటర్ ఎసి 2100 యొక్క ధర చైనాలో CNY 169 (సుమారు రూ. 1,700).

Most Read Articles
Best Mobiles in India

English summary
Redmi Launched AI Speaker Play and Router AC2100: Price,Specifications,Availability and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X