12.1 అంగుళాల డిస్‌ప్లే, 10000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్ .. స్పెసిఫికేషన్‌లు, లాంచ్ వివరాలు..?
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ షియోమీ రెడ్‌మి ప్యాడ్ ప్రో (Redmi Pad pro) ట్యాబ్లెట్ ను చైనాలో ఏప్రిల్‌లో విడుదల చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ట్యాబ్లెట్ భారత్ లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. అయితే చైనా వేరియంట్ కంటే కొన్ని భిన్నమైన స్పెసిఫికేషన్ లను కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. తాజాగా రెడ్‌మి ప్యాడ్ ప్రో ట్యా్బ్లెట్ భారత సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో కనిపించింది. దీని ఆధారంగా త్వరలో భారత్ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరియు మోడల్ నంబర్ 2405CRPFDI తో రెడ్‌మి ప్యాడ్ ప్రో వేరియంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ (BIS) కనిపించింది.
అయితే రెడ్‌మి ప్యాడ్ ప్రో ట్యాబ్లెట్ భారత్ మార్కెట్‌లో విడుదలపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్ జూన్ 12న భారత్‌లో విడుదల కానుంది. ఇదే రోజు ప్యాడ్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు షియోమీ సంస్థ రెడ్‌మి ప్యాడ్ మరియు రెడ్‌మి ప్యాడ్ SE.. రెండు రెడ్‌మి ట్యాబ్లెట్‌లను మాత్రమే విడుదల చేసింది. అయితే కొత్త ట్యాబ్లెట్ ప్యాడ్ ప్రో గురించి సంస్థ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ ట్యాబ్లెట్ చైనాలో విడుదల అయినందున కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలను అంచనా వేయవచ్చు.
అయితే తాజాగా వచ్చిన ఓ లీక్ ఆధారంగా రెడ్‌మి ప్యాడ్ ప్రో భారత్ వేరియంట్ సెల్యూలర్ మరియు Wi-Fi కనెక్టివిటీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 8MP వెనుక కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10,000mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మి ప్యాడ్ ప్రో ట్యాబ్లెట్ 12.1 అంగుళాల 2.5k రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ పైన పనిచేయనుంది. 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉంది. స్టోరేజీని 1.5TB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. రెడ్‌మి ప్యాడ్ ప్రో ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








