ధర రూ.11,999 కే 32 అంగుళాల రెడ్‌మి స్మార్ట్ టీవీ.. ఫీచర్‌లు, సేల్ పూర్తి వివరాలు..!!
షియోమీ సంస్థ భారత్‌లో రెడ్‌మి స్మార్ట్ ఫైర్ TV 32 2024 ను (Redmi Smart Fire TV 32 2024 Edition) విడుదల చేసింది. ఈ స్మార్ట్‌టీవీ అనేక ఆధునిక ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ మోడల్ 32 అంగుళాల HD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మరియు ఫైర్OS పైన పనిచేస్తుంది. దీంతోపాటు వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీతో వస్తుంది. దీంతోపాటు మెరుగైన ఆడియోను పొందవచ్చు. ఈ టీవీ రిమోట్ అలెక్సా ఫీచర్‌తో సదుపాయంతో రానుంది.
రెడ్‌మి స్మార్ట్ ఫైర్ TV 32 2024 ఎడిషన్ భారత్ ధర రూ.11999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.10999 కే కొనుగోలు చేయవచ్చు. జూన్ 12వ తేదీన సేల్ ప్రారంభం అవుతుంది. Mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి స్మార్ట్ ఫైర్ TV 32 2024 ఎడిషన్ 32 అంగుళాల HD రెడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ టీవీ 178 డిగ్రీల్లో చూసేందుకు వీలుంటుంది. దీంతోపాటు దీంతోపాటు ఆటో లో లేటెన్సీ మోడ్ మరియు 6.5ms రెస్పాన్స్ టైం వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
ఈ టీవీ గేమింగ్ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ టీవీ 3 వైపులా బోర్డర్ లేని డిజైన్ (Borderless) ను కలిగి ఉంటుంది. మరియు 96.9 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో ను కలిగి ఉంటుంది. అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
రెడ్‌మి ఫైర్ TV.. 1.5GHz క్వాడ్ కోర్ కార్టెక్స్ A35 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. Mali G31MP2 GPU తో జతచేయబడి ఉంటుంది. టీవీ 1TB ర్యామ్ మరియు 8GB అంతర్గత స్టోరేజీను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Fire TV OS 7 పైన పనిచేస్తుంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫాంలు అయిన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా గరిష్ఠంగా 12,000 యాప్‌లను నిర్వహించగలుగుతుంది.
ఈ రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 2024 ఎడిషన్ అలెక్సాతో కూడిన రెడ్‌మి వాయిస్ రిమోట్‌ను కలిగి ఉంటుంది. ఈ రిమోట్‌లో టీవీ గైడ్, ప్లేబ్యాక్ కంట్రోల్, ఛానల్ నావిగేషన్, మ్యూట్ సహా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ప్లాట్‌ఫాంలలోకి లాగిన్ అయ్యేందుకు ప్రత్యేక బటన్‌లను కలిగి ఉంటాయి.
ఈ రెడ్‌మి స్మార్ట్‌టీవీ వైఫై 802.11, ఎయిర్ ప్లే మరియు వైర్‌లెస్ స్ట్రీమింగ్ కోసం Miracast, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు 2 HDMI 2.1 పోర్టులు, 2 USB 2.0 పోర్టులు, 3.5mm ఆడియో జాక్ సహా మరిన్ని పోర్టులు ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








