Home
Gadgets

సింగిల్‌ ఛార్జింగ్‌తో 20 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఇచ్చే రెడ్‌మీ వాచ్‌ 4 విడుదల..!

రెడ్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ Redmi Watch 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌ చతురస్రాకార డయల్‌ మరియు అల్యూమినియం ప్రేమ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. PPG సెన్సార్‌ సహా అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 20 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తోంది.

రెడ్‌మీ వాచ్‌ 4 స్మార్ట్‌వాచ్‌ ధర $107 (భారత కరెన్సీలో రూ.8,890) గా ఉంది. సిల్వర్‌ గ్రే లేదా ఒబ్సిడియన్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మరియు మ్యాచింగ్‌ స్ట్రిప్‌ తో వస్తుంది. పాస్టెల్‌ పర్పల్‌, డార్క్‌ సియాన్‌ లేదా మింట్‌ గ్రీన్‌ రంగుల్లో స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.

redmi-watch-4-smartwatch-price

రెడ్‌మీ వాచ్‌ 4 ఫీచర్లు: రెడ్‌మీ వాచ్‌ 4 స్మార్ట్‌వాచ్‌ 1.97 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 390*450 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 600 నిట్‌ల వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. షియోమీ హైపర్‌ OS ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 150 కి పైగా స్పోర్స్ట్‌ మోడ్‌లు మరియు ఫిట్‌నెస్‌, హెల్త్‌ ట్రాకర్లతోపాటు రోజువారీ కార్యకలాపాలను ట్రాక్‌ చేయనుంది.

హార్ట్‌ బీట్‌ రేట్‌, SpO2, నిద్ర నాణ్యతను పర్యవేక్షిస్తుంది. వాటర్‌ ఫ్రూఫ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రెడ్‌మీ వాచ్‌ 4.. 470mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేసి 20 రోజుల వరకు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది.

redmi-watch-4-smartwatch-price

ప్రస్తుతం అమెజాన్‌ లో గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2024 పేరులో సేల్‌ నడుస్తోంది. ఈ సేల్ జనవరి 13న ప్రారంభం అయింది. ఈనెల 18 వరకు సేల్‌ కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా SBI కార్డుల కొనుగోలు చేస్తే తక్షణ 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ గ్యాడ్జెట్లు సహా గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది.

మరో ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌ జనవరి 14న ప్రారంభం అయింది. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా ICICI, బ్యాంక్ ఆఫ్‌ బరోడా కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.

redmi-watch-4-smartwatch-price

దీంతోపాటు ఫ్లిప్‌కార్టు యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2024లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, గ్యాడ్జెట్లు, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్‌, గృహోపకరణాలపై ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi watch 4 smartwatch launched globally with key features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X