Home
Gadgets

18 రోజుల బ్యాటరీ లైఫ్‌, 2 అంగుళాల డిస్‌ప్లేతో స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్‌లు, ధర, సేల్‌ వివరాలు..!

రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ వాచ్‌ (Redmi watch 5 active smart watch launched) భారత్‌లో లాంచ్‌ అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌ జింక్‌ అల్లాయ్ మెటల్‌తో కూడిన బాడీని కలిగి ఉంది. మరియు IPX8 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయింది. సింగిల్‌ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 18 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది.

రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌వాచ్‌ 320*385 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 2 అంగుళాల దీర్ఘచతురస్రాకార LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 500 నిట్స్‌గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 140 స్పోర్ట్స్‌ మోడ్స్‌, 200 వాచ్‌ ఫేస్‌లను సపోర్టు చేస్తుంది. IPX8 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.

Redmi watch 5 active smart watch launched in india

ఈ రెడ్‌మి వాచ్‌ 5 యాక్టి్వ్‌ స్మార్ట్‌వాచ్‌ షియోమీ HyperOS (అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌) పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌, iOS స్మార్ట్‌ఫోన్‌లను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ ఇన్‌బిల్ట్‌ వాయిస్‌ యాక్టివేటెడ్‌ అసిస్టెంట్‌ అలెక్సాను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ హిందీ భాషను కూడా సపోర్టు చేస్తుంది.

ఈ రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంది. హార్ట్‌ రేట్‌, SpO2 స్థాయి, సహా నిద్రకు సంబంధించిన నాణ్యత, ఇతర వివరాలను అందిస్తుంది. మహిళల్లో రుతుక్రమాన్ని గురించిన సమాచారం అందిస్తుంది. ఎంఐ ఫిట్‌నెస్‌ యాప్‌ ద్వారా ఈ వివరాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉంది.

ఈ రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ 5.3 ను సపోర్టు చేస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా నేరుగా వాచ్‌ నుంచే కాలింగ్‌ చేయడం సహా ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు స్పందించవచ్చు. ఈ వాచ్‌ ENC (ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) ఫీచర్‌తో కూడిన మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది.

ఈ రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ 470mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 18 రోజులపాటు వినియోగించుకోవచ్చునని చెబుతోంది. ఎక్కువ ఫీచర్‌లను (Heavy Usage) వినియోగించిన సమయంలో సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా గరిష్ఠంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ వస్తుంది.

రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ స్మార్ట్‌వాచ్‌ ధర, సేల్‌ వివరాలు :
రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.2799 గా ఉంది. సెప్టెంబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. షియోమీ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షియోమీ ఆఫ్‌లైన్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ మ్యాటీ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లాక్ రంగుల్లో లభించనుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi watch 5 active smart watch launched in india with 18 days of battery life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X