18 రోజుల బ్యాటరీ లైఫ్, 10 నిమిషాలపాటు నీటిలో ఉంచినా డ్యామేజీ కానీ స్మార్ట్‌వాచ్.. అర్ధరాత్రి నుంచే సేల్!
ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ షియోమీ తాజాగా భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మి వాచ్ 5 లైట్ పేరుతో (Redmi Watch 5 Lite Smartwatch) చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. 1.96 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. మరియు బ్లూటూత్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో కాలింగ్ సమయంలో మెరుగైన అనుభూతిని పొందవచ్చు.
రెడ్‌మి వాచ్ 5 లైట్ స్మార్ట్‌వాచ్ ఫీచర్‌లు :
రెడ్‌మి వాచ్ 5 లైట్ స్మార్ట్‌వాచ్ 1.96 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఫలితంగా సూర్యకాంతి ఎక్కువగా ఉన్న సమయంలోనూ ఈ స్మార్ట్‌వాచ్‌ను సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. ఈ వాచ్ స్లీక్ మెటాలిక్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.

50 మీటర్ల నీటిలో ఉంచినా డ్యామేజీ కాదు! :
ఈ రెడ్‌మి స్మార్ట్‌వాచ్ 160 స్పోర్ట్స్ మోడ్స్ మరియు 200 వాచ్ ఫేస్‌లను కలిగి ఉంటుంది. మరియు అలెక్సా సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ 5 లైట్.. 5 ATM వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా 50 మీటర్ల లోతు నీటిలో 10 నిమిషాల వరకు ఈ వాచ్‌ను ఉంచినా ఎటువంటి డ్యామేజీ కాదు. స్విమ్మింగ్ సహా ఇతర వాటర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేందుకు సౌకర్యంగా ఉంటుంది.
నాయిస్ క్యాన్సిలేషన్ :
ఈ వాచ్ బ్లూటూత్ V5.3 LE తో పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా వాచ్ నుంచే మెసేజ్‌లకు స్పందించవచ్చు. మరియు కాంటాక్ట్‌లను తనిఖీ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ వాచ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా కాలింగ్ సమయంలో అనవసర శబ్ధాలను నివారిస్తుంది.

హిందీ సహా ఇతర భాషల్లో :
ఈ రెడ్‌మి వాచ్ షియోమీ HyperOS పైన పనిచేస్తుంది. మెరుగైన అనుభూతిని అందిస్తుంది. హిందీ సహా ఇతర భాషల్లో నోటిఫికేషన్‌లను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 వెర్షన్ లేదా అంతకంటే అప్‌డేట్ వెర్షన్ మరియు iOS వెర్షన్ 12 లేదా అంతకంటే అప్‌డేట్ వెర్షన్ తో పనిచేస్తుంది.
18 రోజుల బ్యాటరీ లైఫ్ :
రెడ్‌మి వాచ్ 5 లైట్ 470mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 18 రోజులపాటు వినియోగించుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఎక్కువగా వినియోగిస్తే 12 రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా మెరుగైన వాచ్‌గా పరిగణించవచ్చు.
ఈ వాచ్ హార్ట్ రేట్ సెన్సార్, SpO2 స్థాయిని పర్యవేక్షిస్తుంది. యాక్సిలిరోమీటర్, గైరోస్కోప్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ఒత్తిడి స్థాయి, మహిళల్లో రుతుక్రమాన్ని కూడా పర్యవేక్షించవచ్చు. ఈ రెడ్‌మి వాచ్ సైట్ మోడ్, DND, థియేటర్ మోడ్, వాటర్ క్లీనింగ్ మోడ్, ఫోన్ ఫైండర్, టార్చ్ లైట్ ఫంక్షన్, కెమెరా షట్టర్ కంట్రోల్, అలారం, స్టా్‌ప్ వాచ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
రెడ్‌మి వాచ్ 5 లైట్ ధర, సేల్ వివరాలు :
రెడ్‌మి వాచ్ 5 లైట్ ధర రూ.3999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.3499 కే కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, గ్రే రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది. షియోమీ అధికారిక వెబ్‌సైట్, mi.com, షియోమీ రిటైల్ భాగస్వామ్య స్టోర్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








