సింగిల్ ఛార్జింగ్‌తో 18 రోజుల బ్యాటరీ లైఫ్ అందించే స్మార్ట్‌వాచ్‌పై డిస్కౌంట్.. GPS, బ్లూటూత్ సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ రెడ్‌మి భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం సెప్టెంబర్‌లో రెడ్‌మి వాచ్ 5 లైట్ స్మార్ట్‌వాచ్ ను (Redmi Watch 5 Lite Smartwatch) లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 18 రోజులపాటు వినియోగించుకోవచ్చని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఈ వాచ్ మెరుగైన వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. 1.96 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు అనేక హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వాచ్‌ను ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ లో (Amazon) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
నాలుగు నెలల్లోనే ధర తగ్గింపు :
రెడ్‌మి వాచ్ 5 లైట్ స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం రెండు కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. బ్లాక్, లైట్ గ్లోడ్ రంగుల్లో లభిస్తుంది. విడుదల సమయంలో ఈ వాచ్ ప్రారంభ ధర రూ.3999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్ ను రూ.3499 కే సొంతం చేసుకోవచ్చు. నాలుగు నెలల్లోనే తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.

రెడ్‌మి వాచ్ 5 లైట్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
ఈ రెడ్‌మి స్మార్ట్‌వాచ్ 1.96 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 410*502 రిజల్యూషన్ సహా 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. డిజైన్ పరంగా ఈ వాచ్ ఆకట్టుకుంటోంది.
GPS సహా :
ఈ స్మార్ట్‌వాచ్ అడ్వాన్స్‌డ్ GPS మరియు గెశ్చర్స్ కంట్రోల్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు HyperOS పైన పనిచేస్తోంది. హిందీ సహా ఇతర భాషల్లో నోటిఫికేషన్ లను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 వెర్షన్ మరియు iOS వెర్షన్ 12 లేదా అంతకంటే అప్‌డేట్ వెర్షన్‌లపై పనిచేస్తోంది.
హెల్త్ ట్రాకర్‌లు :
ఈ రెడ్‌మి అనేక హెల్త్ ట్రాకర్‌లు మరియు అనేక సెన్సార్‌లను కలిగి ఉంటుంది. హార్ట్ రేట్ ట్రాకర్, SpO2 స్థాయిని పర్యవేక్షిస్తుంది. దీంతోపాటు మహిళల్లో రుతుక్రమాన్ని కూడా పర్యవేక్షించవచ్చు. గైరోస్కోప్, యాక్సిలిరోమీటర్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.
ఇతర ఫీచర్‌లు :
ఈ రెడ్‌మి వాచ్ DND, థియేటర్ మోడ్, వాటర్ క్లీనింగ్ మోడ్, ఫోన్ ఫైండర్, సైట్ మోడ్, టార్చ్ లైట్ ఫంక్షన్, స్టా్‌ప్ వాచ్, కెమెరా షట్టర్ కంట్రోల్, అలారం వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ 160 స్పోర్ట్స్ మోడ్స్, 200 వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. ఈ వాచ్ అలెక్సా ఫీచర్ ను సపోర్టు చేస్తుంది.
రెడ్‌మి వాచ్ 5 లైట్ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ 5.3 ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా వాచ్ నుంచే కాల్స్‌కు స్పందించవచ్చు. దీంతోపాటు ఈ వాచ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ వాచ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా 50 మీటర్ల లోతు నీటిలో 10 నిమిషాల వరకు ఈ వాచ్‌ను ఉంచినా.. డ్యామేజీ కాదని సంస్థ తెలిపింది. వర్కౌట్‌లు, స్విమ్మింగ్ వంటి సమయాల్లో అనుకూలంగా ఉంటుంది.
సింగిల్ ఛార్జింగ్‌తో 18 రోజుల బ్యాటరీ లైఫ్ :
ఈ రెడ్‌మి స్మార్ట్‌వాచ్ 470mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 18 రోజులపాటు వినియోగించుకోవచ్చు. అధిక సమయంపాటు ఉపయోగించినా 12 రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని రెడ్‌మి తెలిపింది. ఫలితంగా ఎక్కువ సార్లు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు.


Click it and Unblock the Notifications








