Home
Gadgets

ఆకట్టుకొనే డిజైన్‌తో రెడ్‌మి వాచ్‌ మూవ్‌ స్మార్ట్‌వాచ్‌.. ఎప్పుడు విడుదల కానుందంటే..?

భారత్‌ మార్కెట్‌ లో స్మార్ట్‌వాచ్‌ లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. అందుకే అనేక సంస్థలు యూజర్ల అవసరాలు, సౌకర్యాల ఆధారంగా కొత్త డిజైన్‌, వేరియంట్స్‌ లో స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేస్తున్నాయి. తాజాగా రెడ్‌మి నుంచి కీలక ప్రకటన వచ్చింది. త్వరలో కొత్త వాచ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. లాంచ్‌ తేదీ సహా వాచ్‌ డిజైన్‌ ను కూడా విడుదల చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియా హ్యాండిల్‌ పోస్ట్‌ చేసింది.

ఈ సంవత్సరం రెడ్‌మి నుంచి వాచ్‌ 5 గ్లోబల్ మార్కెట్‌ లో లాంచ్‌ అయింది. అయితే భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి రాలేదు. ఈ వాచ్‌ చైనాలో గత సంవత్సరం నవంబర్‌లో విడుదల అయింది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 24 రోజుల వరకు వినియోగించుకోవచ్చు.

Redmi Watch Move Smartwatch launch date

ఎప్పుడు విడుదల కానుంది? :
అయితే రెడ్‌మి సోషల్ మీడియా పోస్ట్‌ ఆధారంగా రెడ్‌మి వాచ్‌ మూవ్‌ స్మార్ట్‌వాచ్‌ (Redmi Watch Move Smartwatch) ఏప్రిల్‌ 21 భారత్ మార్కెట్‌ లో విడుదల కానుంది. ఈ ఫోన్‌ డిజైన్‌ ను కూడా విడుదల చేసింది. ఈ రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ షియోమీ ఇండియా ఇ-స్టోర్‌ లో కొనుగోలు చేయవచ్చు.

డిజైన్‌ విడుదల :
రెడ్‌మి వాచ్‌ మూవ్‌ స్మార్ట్‌వాచ్‌ దీర్ఘచతురస్రాకార (Rectangular) డిజైన్‌ ను కలిగి ఉంది. మరియు కుడివైపు క్రోన్‌ ను గమనించవచ్చు. ఇది ఫంక్షన్‌ కీ గా పనిచేసే అవకాశం ఉంది. మరియు ఈ వాచ్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ వాచ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ కానుంది.

రెడ్‌మి వాచ్‌ మూవ్‌ డిజైన్ మినహా ఇతర వివరాలను వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ వాచ్ ఫీచర్‌ లు, బ్యాటరీ లైఫ్‌, వేరియంట్స్‌, బ్లూటూత్‌ సహా ధర వంటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గత సంవత్సరం భారత్‌ లో రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.2499 కే కొనుగోలు చేయవచ్చు. షియోమీ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌, షియోమీ ఆఫ్‌లైన్‌ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. మ్యాటీ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 18 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది.

రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్‌ 2 అంగుళాల దీర్ఘచతురస్రాకార LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 140 స్పోర్ట్స్‌ మోడ్స్‌, 200 వాచ్‌ ఫేస్‌లను సపోర్టు చేస్తుంది. షియోమీ HyperOS పైన పనిచేస్తోంది. ఇన్‌బిల్ట్‌ వాయిస్‌ యాక్టివేటెడ్‌ అసిస్టెంట్‌ అలెక్సాను కలిగి ఉంటుంది.

ఈ రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ హార్ట్‌ రేట్‌, SpO2, స్లీప్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. మరియు మహిళల రుతుక్రమం సమాచారం అందిస్తుంది. బ్లూటూత్‌ 5.3 ను సపోర్టు చేస్తుంది. మరియు ENC ఫీచర్‌తో కూడిన మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంది. 470mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 18 రోజుల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. ఎక్కువ వినియోగిస్తే 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Redmi Watch Move Smartwatch launch date revealed in india design teased
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X