జియోతో పోటీకి సై, రూ. 999కే Airtel 4జీ హాట్‌స్పాట్

Written By:

దేశీయ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తన 4జీ హాట్‌స్పాట్ డివైస్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. జియోకి పోటీగా తన డివైస్ ధరపై దాదాపు 50 శాతానికి పైగా తగ్గింపును అందించింది. రూ. 1950 ధరలో లభ్యమవుతున్న ఈ డివైస్‌‌ను ఇప్పుడు మీరు రూ.999కే కొనుగోలు చేయవచ్చు.మరో వైపు జియో కూడా తన జియోఫై డివైస్‌ను రూ.999 ధరకే అందిస్తున్నది.

సంచలనం రేపిన ఫ్రీడం 251 ఫోన్లపై మరో కీలక ప్రకటన..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 డివైస్‌లను ఏక కాలంలో...

ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ పరికరానికి 10 డివైస్‌లను ఏక కాలంలో కనెక్ట్ చేసుకుని వైఫై సేవలను పొందవచ్చు.

1500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

ఇందులో 1500 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది. దీంతో ఈ హాట్‌స్పాట్ పరికరం 6 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.

యూజర్ ఉన్న ప్రదేశంలో..

అంతేకాదు ఒక వేళ యూజర్ ఉన్న ప్రదేశంలో 4జీ అందుబాటులో లేకపోతే 3జీ ద్వారా కూడా ఈ హాట్‌స్పాట్ పనిచేస్తుంది. దీంతో వినియోగదారులు నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.

జియో డివైస్ నుంచి..

జియో డివైస్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను తన కస్టమర్లకు అందిస్తున్నది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio impact: Airtel 4G Hotspot now available for Rs 999 Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot