రూ.399కే JioFi dongle, ఈ ఒక్క రోజు మాత్రమే!
ఈ సీజన్‌లో రిలయన్స్ JioFi dongleను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది సరైన సమయం. అమెజాన్ ఇండియా తన ఆన్ గోయింగ్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా జియోఫై డాంగిల్‌ను రూ.899కే విక్రయిస్తోంది.
ఈ సీజన్‌లో రిలయన్స్ JioFi dongleను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది సరైన సమయం. అమెజాన్ ఇండియా తన ఆన్ గోయింగ్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా జియోఫై డాంగిల్‌ను రూ.899కే విక్రయిస్తోంది. వాస్తవానికి ఈ డాంగిల్ ధర రూ.999గా ఉంది. ప్రస్తుతానికి ఈ ఆఫర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే వరిస్తుంది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ను తీసుకోని యూజర్లు రూ.129 చెల్లించటం ద్వారా ప్రైమ్ మెంబర్ షిప్‌ను తీసుకోవచ్చు.

రూ.500 క్యాష్‌బ్యాక్‌తో రూ.399కే..
జియోఫోన్ పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్‌ను జియో ఈ మధ్య మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా JioFi dongle పై రూ.500 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ అనౌన్స్ చేసింది. అయితే, ఈ క్యాష్‌బ్యాక్ అనేది డాంగిల్ కొనుగోలు చేసిన 12 నెలల తరువాత యూజర్‌కు లబిస్తుంది. ఈ విధంగా లెక్కేసుకంటే రూ.339కే జియోఫై డాంగిల్ మన సొంతమవుతుంది.

రూ.199 ప్లాన్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా..
జియో పోస్ట్ పెయిడ్ యూజర్లు రూ.199 అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను ఆప్ట్ చేసుకుని ఈ డాంగిల్‌ను వినియోగించటం ద్వారా క్యాష్ బ్యాక్ అనేది వర్తిస్తుంది. రూ.199 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఇంటర్నెషనల్ కాలింగ్ పై నిమిషానికి 50 పైసలు మాత్రమే వసూలు చేయటం జరుగుతుంది. ఈ ప్లాన్‌కు అర్హత సాధించాలంటే యూజర్లు జియోఫై డివైస్‌తో పాటు కొత్త జియో పోస్ట్‌పెయిడ్ సిమ్‌ను కొనుగోల చేయవల్సి ఉంటుంది.

రూ.1999 నుంచి రూ.999కు...
గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పోర్టబుల్ రూటర్ ధరను రూ.1999 నుంచి రూ.999కు జియో తగ్గించింది. తాజా సేల్ లో భాగంగా ఈ రూటర్ రూ.899కే లభ్యమవుతోంది. తన 4జీ రూటర్ విక్రయాలన మరింతగా పెంచే క్రమంలో దీనిపై జియో కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను జియో అందిస్తోంది. దీంతో జియోఫై రూటర్ రూ.399 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది.

కేవలం పోస్ట్ పెయిడ్ యూజర్లకు మాత్రమే
తాజాగా ప్రకటించిన కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం కొత్త జియోఫై యూనిట్ కొనుగోలు చేసే పోస్ట్ పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో తన పోస్టు పెయిడ్ ప్లాన్ రూ.199 కింద 25 జీబీ డేటాతో పాటు , ఉచిత వాయిస్ కాల్స్ ఇంకా అపరిమిత ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. వీటితటో పాటు జియో యాప్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను సదుపాయం కూడా యూజర్లకు లభిస్తుంది.


Click it and Unblock the Notifications








