మడిచి జేబులో పెట్టుకునే కీబోర్డును ఎప్పుడైనా చూశారా ?

టెక్నాలజీరంగంలో ఇతర దేశాలకు సవాల్ విసరుతున్న దక్షిణ కొరియా మరో ముందడుగు దిశగా అడుగులు వేస్తోంది.

|

టెక్నాలజీరంగంలో ఇతర దేశాలకు సవాల్ విసరుతున్న దక్షిణ కొరియా మరో ముందడుగు దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు మడతపెట్టి జేబులో పెట్టుకునే విధంగా సరికొత్త కీబోర్డును తయారు చేశారు. జేబులో పెట్టుకుని మీరు ఎక్కడికైనా ఈ కీబోర్డును తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు అనుసంధానం చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తతం మార్కెట్‌ పలు రకాల కీబోర్డులు ఉన్నాయి. వాటిలో చాపలా చుట్టి వెంట తీసుకెళ్లగలిగేవి ఉన్నాయి.

 

సెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఆ ఫోన్ ఇండియాకు వస్తోందిసెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఆ ఫోన్ ఇండియాకు వస్తోంది

ఎలాగైనా మడతపెట్టవచ్చు

ఎలాగైనా మడతపెట్టవచ్చు

ఇప్పుడు సౌత్‌ కొరియాలోని సెజోంగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కీబోర్డును ఎలాగైనా మడతపెట్టవచ్చు.

సెన్సర్‌ షీట్‌

సెన్సర్‌ షీట్‌

ఈ కీబోర్డు కోసం శాస్త్రవేత్తలు మొదట ఓ సెన్సర్‌ షీట్‌ను తయారు చేశారు. అనంతరం దానిపై సిలికాన్‌ రబ్బర్‌తో చేసిన మరో షీట్‌ను అమర్చారు.

కండక్టివ్ కార్బన్ నానోట్యూబ్స్‌

కండక్టివ్ కార్బన్ నానోట్యూబ్స్‌

ఈ రెండిటి మధ్య కండక్టివ్ కార్బన్ నానోట్యూబ్స్‌ను అనుసంధానించారు. రబ్బర్ షీట్ పైభాగంలో కీబోర్డ్‌లోని బటన్స్‌ను సూచించేలా గడులు గీశారు.

ఒక్కో గడి ఒక్కో అక్షరాన్ని
 

ఒక్కో గడి ఒక్కో అక్షరాన్ని

దీంతో ఒక్కో గడి ఒక్కో అక్షరాన్ని సూచిస్తుంది. మనం టైప్ చేసినప్పుడు వేళ్ల ద్వారా కలిగే ఒత్తిడి రబ్బర్‌షీట్ ద్వారా నానోట్యూబ్స్‌పై పడి అడుగున ఉన్న సెన్సర్ షీట్‌కు తగులుతుంది.

సెన్సార్లు

సెన్సార్లు

అప్పుడు సెన్సార్లు ఏ అక్షరాన్ని టైప్ చేశామో గుర్తించి కంప్యూటర్‌కు పంపుతుంది. ఈ కీబోర్డ్ మిగతా కీబోర్డుల్లాగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఒక డాలర్‌ మాత్రమే

ఒక డాలర్‌ మాత్రమే

ఒక కీబోర్డును తయారు చేయడానికి కేవలం ఒక డాలర్‌ మాత్రమే ఖర్చవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Best Mobiles in India

English summary
Novel keyboard can be crumpled and carried in pockets More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X