మార్కెట్లోకి Ricoh కొత్త ప్రొజెక్టర్లు

|

ప్రముఖ ఐటీ ఉత్పత్తుల కంపెనీ రికో ఇండియా లిమిటెడ్ (Ricoh India Ltd) అడ్వాన్సుడ్ ఫీచర్లతో రూపొందించబడిన సరికొత్త ప్రొజెక్టర్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. PJ 52440, PJ x2440, PJ WX2440 మోడల్స్‌లో ఈ ప్రొజెక్టర్లు అందుబాటులో ఉంటాయి.

Ricoh launches its new series of innovative and high-end projectors in India

రికో అడ్వాన్సుడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ప్రొజెక్టర్లను చాలా కాంపాక్ట్‌గా డిజైన్ చేసినట్లు కంపెనీ తన ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. తక్కువ బరువును కలిగి ఉండే ఈ ప్రొజెక్టర్లను మల్టీపర్పస్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చట. ఈ కొత్త డివైస్‌లను క్లాస్ రూమ్‌లతో పాటు సమావేశ గదులలో ఉపయోగించుకునే వీలుంటుంది.

కనెక్టువిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ పెర్ఫామెన్స్‌ను ఈ ప్రొజెక్టర్లు ఆఫర్ చేస్తాయని కంపెనీ చెబుతోంది. వీటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి సులువుగా క్యారీ చేసే వీలుంటుందట. ఈ ప్రొజెక్టర్స్ ద్వారా 30 అంగుళాల నుంచి 300 అంగుళాల వరకు వెడల్పు వికర్ణంలో వివిధ రకాల ప్రొజెక్షన్ సైజుల్లో ప్రెజంటేషన్స్ ఇవ్వవొచ్చని కంపెనీ పేర్కొంది. ప్రెజంటేషన్ సమయంలో హైక్వాలిటీ కలర్‌తో పాటు క్రిస్ప్, క్లియర్ ఇమేజెస్ ఇంకా క్లియర్ టెక్స్ట్‌ను ఈ ప్రొజెక్టర్స్ డెలివరీ చేస్తాయని కంపెనీ వివరించింది.

డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ టెక్నాలజీ పై పనిచేసే ఈ ప్రొజెక్టర్స్ పనితీరు పరంగా కొత్త బెంచ్ మార్క్స్‌ను సెట్ చేస్తాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఇంకా సీఎమ్ఓ యుకీ ఉచిడా పేర్కొన్నారు. ఈ ప్రొజెక్టర్‌లలో ఎక్విప్ చేసిన ల్యాంప్ జీవిత కాలాన్ని సరికొత్త సాంకేతికతతో 5000 గంటల నుంచి 6000 గంటల వరకుకు పొడిగించినట్లు ఆయన తెలిపారు.

ఈ ప్రొజెక్టర్స్ రన్ అయ్యే సమయంలో ల్యాగ్స్ అనేవి చాలా తక్కువుగా ఉంటాయని, నాయిస్ లెవల్స్ కూడా 31dB కంటే తక్కువుగానే నమోదవుతాయని రికో చెబుతోంది. ఈ ప్రొజెక్టర్‌లను 'Eco' మోడ్‌లో రన్ చేసుకోవటం ద్వారా ఇమేజ్ క్వాలిటీ ఆటోమెటిక్‌గా అడ్జస్ట్ అవటంతో పాటు ఎనర్జీ కూడా సేవ్ అవుతుందట.

Ricoh PJ 52440 ప్రొజెక్టర్ ప్రత్యేకతలు..

Ricoh PJ 52440 ప్రొజెక్టర్ ప్రత్యేకతలు..

ఈ ఎంట్రీ లెవల్ ప్రొజెక్టర్‌ను పెద్ద స్ర్కీన్‌ల మీద స్టిల్ ఇమేజెస్ కోసం పవర్ పాయింట్ ప్రెజంటేషన్స్ అలానే కంప్యూటర్ స్ర్కీన్ ప్రొజెక్షన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్‌లో బ్రైట్నెస్ 3,000 lumensగానూ, హై కాంట్రాస్ట్ 10000:1 నిష్పత్తితోనూ ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ ద్వారా ఇమేజ్‌‍లను 800 x 600 డీపీఐ SVGA రిసల్యూషన్‌తో ప్రొజెక్ట్ చేసుకునే వీలుంటుంది. HDMI కనెక్టువిటీ ఆప్షన్‌తో వస్తోన్న ఈ డివైస్ బరువు 2.5 కిలోగ్రాములని కంపెనీ తెలిపింది. రిటైల్ మార్కెట్లో ఈ ప్రొజెక్టర్ ధర రూ.32,450.

Ricoh PJ x2440 ప్రొజెక్టర్ ప్రత్యేకతలు..

Ricoh PJ x2440 ప్రొజెక్టర్ ప్రత్యేకతలు..

ఈ ప్రొజెక్టర్‌ను ప్రత్యేకించి హైక్వాలిటీ ఇంకా డిటేల్డ్ ఇమేజెస్ ఇంకా వీడియోస్ కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రొజెక్టర్ ద్వారా కంటెంట్‌ను 1024 x 768 డీపీఐ XGA రిసల్యూషన్‌తో ప్రొజెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్రొజెక్టర్‌లో బ్రైట్నెస్ 3,000 lumensగానూ, హై కాంట్రాస్ట్ 10000:1 నిష్పత్తితోనూ ఉంటుంది.

ఈ ప్రొజెక్టర్ 16:10 aspect ratioతో వస్తోంది. మల్టిపుల్ ఇన్‌పుట్ టెర్మినల్స్‌తో పాటు బిల్ట్-ఇన్ HDMI/MHL పోర్ట్స్‌తో వస్తోన్న ఈ ప్రొజెక్టర్‌ను వివిధ రకాల మల్టీమీడియా డివైస్‌లతో పాటు డెస్క్‌టాప్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, డీవీడీ ఇంకా బ్లూ-రే ప్లేయర్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.

CAD డ్రాయింగ్స్, బ్లూప్రింట్స్ ఇంకా స్సెషల్ వీడియోలను వీక్షించేందుకు అవసరమైన 3డీ ప్రొజెక్షన్ టూల్స్‌ను కూడా ఈ ప్రొజెకర్ట్‌కు యాడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. వైర్‌లెస్ ప్రొజెక్షన్ సమయంలో వై-ఫై డాంగిల్‌ను ఉపయోగించుకోవల్సి ఉంటుంది. రిటైల్ మార్కెట్లో ఈ ప్రొజెక్టర్ ధర రూ.37,750.

ఆండ్రాయిడ్ వేర్‌కు Oreo 8.0 అప్‌డేట్ఆండ్రాయిడ్ వేర్‌కు Oreo 8.0 అప్‌డేట్

Ricoh PJ Wx2440 ప్రొజెక్టర్ ప్రత్యేకతలు..

Ricoh PJ Wx2440 ప్రొజెక్టర్ ప్రత్యేకతలు..

ఈ ప్రొజెక్టర్ ద్వారా కంటెంట్‌ను 1280 x 800 డీపీఐ WXGA రిసల్యూషన్‌తో ప్రొజెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్రొజెక్టర్‌లో బ్రైట్నెస్ 3,100 lumensగానూ, హై కాంట్రాస్ట్ 10000:1 నిష్పత్తితోనూ ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ 16:10 aspect ratioతో వస్తోంది. మల్టిపుల్ ఇన్‌పుట్ టెర్మినల్స్‌తో పాటు బిల్ట్-ఇన్ HDMI/MHL పోర్ట్స్‌తో వస్తోన్న ఈ ప్రొజెక్టర్‌ను డెస్క్‌టాప్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, డీవీడీ ఇంకా బ్లూ-రే

ప్లేయర్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. CAD డ్రాయింగ్స్, బ్లూప్రింట్స్ ఇంకా స్సెషల్ వీడియోలను వీక్షించేందుకు అవసరమైన 3డీ ప్రొజెక్షన్ టూల్స్‌ను కూడా ఈ ప్రొజెకర్ట్‌కు యాడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. రిటైల్ మార్కెట్లో ఈ ప్రొజెక్టర్ ధర రూ.45,910.

Best Mobiles in India

Read more about:
English summary
Ricoh launches its new series of innovative and high-end projectors in India. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X