రోల‌బుల్ LG OLED Signature R టీవీలు విడుద‌ల‌.. ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

|

ద‌క్షిణ కొరియాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రానికి ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ శుభ‌వార్త చెప్పింది. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న LG Signature OLED R రోల‌బుల్ (మ‌డ‌త‌బెట్ట గ‌లిగే టీవీలు) టీవీలు భార‌త్‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఎల్‌జీ సంస్థ వ‌ర్గాలు బుధ‌వారం ప్ర‌క‌టించాయి. రోల‌బుల్ ఓఎల్ఈడీ టీవీ మ‌రియు LG Signature OLED R మోడ‌ల్ టీవీ భార‌త్‌లో విడుద‌లైంది.

 

త్వ‌ర‌లో దేశ‌వ్యాప్తంగా ఎల్‌జీ స్టోర్ల‌లో అమ్మ‌కాలు

త్వ‌ర‌లో దేశ‌వ్యాప్తంగా ఎల్‌జీ స్టోర్ల‌లో అమ్మ‌కాలు

దేశంలోని ప‌లు ఎంపిక చేయ‌బ‌డిన స్టోర్‌ల‌లో వీటి అమ్మ‌కాలు జ‌ర‌ప‌నున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతానికి ఇవి ముంబ‌యిలోని క్రోమా స్టోర్‌లో అమ్మ‌కం జ‌రుపుతున్న‌ట్లు సంస్థ పేర్కొంది. అతి త్వ‌ర‌లో మ‌రిన్ని అవుట్‌లెట్ల‌లో వీటి అమ్మ‌కాలు ప్రారంభించడానికి కంపెనీ స‌న్నాహాలు చేస్తోంది. ఈ రోల‌బుల్ టీవీలో ప్ర‌ధానంగా ఆక‌ట్లుకునే అంశం ఏంటంటే.. మ్యూజిక్ ఒక్క‌టే వినాల‌నుకున్న‌ప్పుడు టీవీని మ‌డ‌త‌బెట్టి సౌండ్ సిస్ట‌మ్‌గా మ‌ర్చుకుని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఈ టీవీలో దృశ్యాలు రియ‌ల్ లైఫ్ (నిజ జీవిత‌) అనుభూతిని క‌లిగిస్తాయి.

 ఈ టీవీ ధ‌రెంతో తెలిస్తే షాకే!

ఈ టీవీ ధ‌రెంతో తెలిస్తే షాకే!

అధునాత‌న టెక్నాల‌జీతో త‌యారు చేసిన ఈ టీవీ ధ‌ర తెలిస్తే షాక‌వ్వాల్సిందే. దీని ధ‌ర‌ను కంపెనీ రూ.75ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది. ఎల్‌జీ ఎల‌క్ట్రానిక్స్ హోం ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా డైరెక్ట‌ర్ హ‌క్ హ్యున్ కిమ్ ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. ఈ రోల‌బుల్ టీవీ నిజంగా ల‌గ్జ‌రీ ప్రొడ‌క్ట్ అని తెలిపారు. ఈ టీవీ వినియోగ‌దారుల‌కు అత్యుత్తమ అనుభూతిని క‌లిగిస్తుంద‌ని అన్నారు. అదేవిధంగా టీవీ మార్కెట్‌లో ఎల్‌జీ సంస్థ పాత్ర‌ను మ‌రోసారి ఆయ‌న ప్ర‌స్తావించారు.

LG Signature OLED Rటీవీ ఫీచ‌ర్లు..
 

LG Signature OLED Rటీవీ ఫీచ‌ర్లు..

LG Signature OLED R టీవీ 65 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ీడీ డిస్‌ప్లే క‌లిగి ఉంది. దీనికి సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్ టెక్నాల‌జీని ఉజ‌యోగించారు. దీనికి α9 Gen 4 (నాలుగో జ‌న‌రేష‌న్‌) AI ప్రాసెస‌ర్‌ను అందిస్తున్నారు. ఇక సౌండ్ విష‌యానికి వ‌స్తే అద్భుత‌మైన యూజ‌ర్ అనుభూతి కోసం డాల్బీ ఆట్మోస్ స్పెష‌ల్ ఫీచ‌ర్ క‌ల్పిస్తున్నారు. కెంపెనీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దీనికి డాల్బీ విజ‌న్ ఐక్యూ ఫెసిలిటీ క‌ల్పించారు. అంతేకాకుండా సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్ టెక్నాల‌జీ ఈ టీవీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. అద్భుత‌మైన గేమింగ్ అనుభూతి పొందేలా ఈ టీవీ 4K 120fps and G-Sync స‌పోర్టుతో త‌యారుచేసిన‌ట్లు సంస్థ వెల్ల‌డించ‌డం విశేషం.

LG G2మ‌రియు C2 సిరీస్ OLED స్మార్ట్ టీవీలు..

LG G2మ‌రియు C2 సిరీస్ OLED స్మార్ట్ టీవీలు..

G2 సిరీస్ టీవీలు 55 మ‌రియు 65 అంగుళాల స్క్రీన్ ల‌ను క‌లిగి ఉన్నాయి. ఇక C2 విష‌యానికి వ‌స్తే ఇందులో వ‌ర‌స‌గా 42, 55, 65, 77, 83, 97 అంగుళాల ఓఎల్ఈడీ పానెల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సిరీస్‌లు మంచి క్వాలిటీ కోసం ఎల్‌జీ ఇవో సాంకేతికత ఆధారంగా త‌యారు చేశారు. అంతేకాకుండా ఈ రెండు టీవీ సిరీస్‌ల‌కు బ్రైట్‌నెస్ బూస్ట‌ర్ మాక్స్ టెక్నాల‌జీని అందిస్తున్నారు. ఇత‌ర ఓఎల్ీడీ పానెల్స్‌తో పోలిస్తే G2 సిరీస్ టీవీలు 30%, సీ2 సిరీస్ టీవీలు అధిక బ్రైట్‌నెస్ క‌లిగి ఉన్నాయి. ఈ టీవీల‌కు ఎల్‌జీ స‌రికొత్త చిప్‌సెట్ α9 Gen 5 intelligent ప్రాసెసర్ ఉప‌యోగించారు. ఎల్‌జీ ఓఎల్ీడీ టీవీలు ప్రారంభ ధ‌ర రూ.89,990 నుంచి గ‌రిష్ఠంగా 75 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నాయి. ఈ టీవ‌వీలు త్వ‌ర‌లో దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎల్‌జీ అవుట్‌లెట్ స్టోర్ల‌లో అందుబాటులోకి రానున్నాయి. LG Signature OLED R మోడ‌ల్ ప్ర‌స్తుతానికి ముంబ‌యిలోని క్రోమా స్టోర్‌లో అమ్మ‌కం జ‌రుపుతున్న‌ట్లు సంస్థ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Rs 75 lakh worth LG’s new rollable TV launched in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X