Home
Gadgets

Samsung Power Banks ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో శాంసంగ్ పవర్‌ బ్యాంక్‌లు విడుదల.. ధర, సేల్ వివరాలు

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ శాంసంగ్‌ తాజాగా భారత్‌ మార్కెట్‌లో రెండు పవర్‌ బ్యాంక్‌ లను ( Samsung Power Banks ) విడుదల చేసింది. 10000mAh మరియు 20000mAh పవర్‌ బ్యాంక్‌ లను లాంచ్‌ చేసింది. ఈ రెండు కూడా ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చాయి.

పవర్‌ బ్యాంక్‌ ధర, సేల్‌ వివరాలు : 20000mAh పవర్‌ బ్యాంక్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు తో వస్తుంది. దీని ధర రూ.4,299 గా ఉంది. అదే 10000mAh పవర్‌ బ్యాంక్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు తో లాంచ్‌ అయింది. దీని ధర రూ.3499 గా ఉంది. ఈ రెండు పవర్‌ బ్యాంక్‌లను అమెజాన్‌ మరియు శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్ Samsung.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Samsung launched two powerful power banks in india

ప్రీమియం లిథియం అయాన్‌ బ్యాటరీ : 20000mAh పవర్‌ బ్యాంక్‌ ప్రీమియం లిథియం అయాన్‌ బ్యాటరీలను కలిగి ఉంటుంది. మరియు లో కరెంట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ పవర్‌ బ్యాంక్‌ ట్రిపుల్‌ ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. మూడు డివైజ్‌లను ఒకేసారి ఛార్జింగ్ చేయవచ్చు. కేవలం స్మార్ట్‌ఫోన్లనే కాకుండా హెడ్‌ఫోన్‌లు, కెమెరా లేదా ల్యాప్‌టాప్‌లను కూడా ఛార్జింగ్‌ చేయవచ్చని శాంసంగ్‌ సంస్థ చెబుతోంది.

డ్యూయల్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ : 10000mAh బ్యాటరీ పవర్‌ బ్యాంక్‌ డ్యూయల్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ లను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్లు, వాచ్‌, వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌, ఇతర డిజిటల్‌ డివైజ్‌ లను ఛార్జింగ్ చేయవచ్చు. ఈ రెండు పవర్‌ బ్యాంక్‌లు బీజ్‌ కలర్‌ వేరియంట్‌ లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం శాంసంగ్‌ ప్యాబ్‌ గ్రాబ్‌ ఫెస్ట్ పేరుతో సమ్మర్‌ సేల్‌ నిర్వహిస్తోంది. శాంసంగ్ వెబ్‌ సైట్‌, యాప్‌, స్టోర్‌లలో డిస్కౌంట్‌ సహా క్యా్‌ష్‌బ్యాక్‌ ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫెస్ట్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ S సిరీస్‌, Z సిరీస్‌, A సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపిక చేసిన వేరియంట్లను 64 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

దీంతోపాటు గెలాక్సీ బుక్‌ 4 సిరీస్ ల్యాప్‌టాప్‌ లలో ఎంపిక చేసిన మోడల్‌లపై 24 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎంపిక చేసిన టీవీ మోడళ్లపై గరిష్ఠంగా 43 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు కొన్నింటిపై ఎక్స్చేంజీ బోనస్‌ పేరుతో రూ.5000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మే 12 వరకు ఈ సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung 10000mAh and 20000mAh battery power banks launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X