వచ్చేసిన శాంసంగ్ నియో క్యూలెడ్ 2025 సిరీస్.. NQ8 AI Gen3 పవర్‌తో 8K టీవీలు, NQ4 AIతో 4K మోడల్స్..!
2025 Neo QLED 8K and 4K TVs: శాంసంగ్ తన సరికొత్త 2025 నియో క్యూలెడ్ 8K, 4K టీవీలను అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. సీఈఎస్ 2025లో ప్రదర్శించిన ఈ టీవీలు ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. "శాంసంగ్ విజన్ ఏఐ" అనే ప్రత్యేక టెక్నాలజీతో వస్తున్న ఈ టీవీలు అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తాయి.
వీటి పనితీరు చాలా బాగుంటుంది, ఎక్కడా ఆగకుండా సాఫీగా కదిలే దృశ్యాలతో యూజర్లను కట్టిపడేస్తాయి. సినిమాలు, ఆటలు ఇష్టపడేవారికి ఇవి బాగా నచ్చుతాయి. ఈ కొత్త లైనప్‌లో నియో క్యూలెడ్ 8K సిరీస్‌లో QN990F, QN900F మోడళ్లు, నియో క్యూలెడ్ 4K సిరీస్‌లో QN90F, QN80F మోడళ్లు ఉన్నాయి.

* నియో క్యూలెడ్ 8K సిరీస్
నియో క్యూలెడ్ 8K సిరీస్ విషయానికొస్తే, ఇవి కళ్లు చెదిరే స్పష్టతను అందిస్తాయి. దీనికి కారణం NQ8 ఏఐ జెన్3 ప్రాసెసర్ సహాయంతో పనిచేసే 8K ఏఐ అప్‌స్కేలింగ్ టెక్నాలజీ. అంటే, తక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా ఇది దాదాపు 8K నాణ్యతకు మెరుగుపరుస్తుంది.
అంతేకాదు, క్వాంటమ్ మ్యాట్రిక్స్ మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉండటం వల్ల, టీవీపై కాంతి పడినా దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి (Glare reduction), రంగులు అత్యంత కచ్చితత్వంతో ప్రకాశవంతంగా ఉంటాయి. వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి. అవేవో, వాటి ధరలు ఎంతో తెలుసుకుందాం.
* QN990F: 8K సిరీస్‌లో అసలైన హీరో
ఈ 8K సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్ QN990F. ఇది నాలుగు సైజుల్లో లభిస్తుంది. అత్యంత పెద్దదైన 98-అంగుళాల మోడల్ ధర 39,999 డాలర్లు (దాదాపు రూ.34 లక్షలు) కాగా, 85-అంగుళాల వేరియంట్ 8,499 డాలర్లు (దాదాపు రూ.7.28 లక్షలు) ఉంది.
75-అంగుళాల వేరియంట్ 6,400 డాలర్లు (దాదాపు రూ.5.3 లక్షలు), 65-అంగుళాల వేరియంట్ 5,499 డాలర్లు (దాదాపు రూ.4.7 లక్షలు) ధరలతో రానున్నాయి. ఈ అద్భుతమైన టీవీ త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని శాంసంగ్ తెలిపింది. ఫ్రీ బుకింగ్ వంటి వివరాలు ఇంకా తెలియ రాలేదు.
* QN900F: తక్కువ ధరలో 8K అనుభవం..
దాదాపు ఇలాంటి అద్భుతమైన వీక్షణ అనుభవాన్నే కొంచెం తక్కువ ధరలో అందించే మోడల్ QN900F. ఇది కూడా 8K సిరీస్‌లో భాగమే. దీనిలో 85-అంగుళాల మోడల్ ధర 5,499 డాలర్లు (దాదాపు రూ.4.7 లక్షలు), 75-అంగుళాల మోడల్ ధర 4,299 డాలర్లు (దాదాపు రూ.3.7 లక్షలు)గా ఉన్నాయి.
65-అంగుళాల మోడల్ ధర 3,299 డాలర్లు (దాదాపు రూ. 2.8 లక్షలు)గా ఉన్నాయి. ఈ QN900F టీవీని వినియోగదారులు ఇప్పటి నుంచే కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ సేల్ సందర్భంగా ఆఫర్లు కూడా ఉండవచ్చు, కాబట్టి వాటి వివరాలను తనిఖీ చేసుకోవడం మంచిది.
* నియో క్యూలెడ్ 4K సిరీస్
నియో క్యూలెడ్ 4K సిరీస్ టీవీలు అసాధారణమైన బ్రైట్‌నెస్, కచ్చితమైన రంగులతో కనువిందు చేస్తాయి. సినిమాలు, స్పోర్ట్స్ చూడటానికి, గేమింగ్ ఆడేందుకు ఇవి బాగుంటాయి. NQ4 ఏఐ జెన్3 ప్రాసెసర్ శక్తితో పనిచేసే ఈ టీవీలు 4K ఏఐ అప్‌స్కేలింగ్, నియో క్వాంటమ్ హెచ్‌డీఆర్+ టెక్నాలజీతో వస్తాయి. దీనివల్ల ప్రతి సన్నివేశంలోని అన్ని వివరాలూ స్పష్టంగా కనిపిస్తాయి.
* QN90F: చాలా సైజుల్లో అందుబాటులో ఉన్న 4K మోడల్
ఈ 4K సిరీస్‌లో ముఖ్యమైన మోడల్ QN90F. ఇది చాలా సైజుల్లో లభిస్తుండటం విశేషం. 98-అంగుళాల స్క్రీన్ ధర 14,999 డాలర్లు (దాదాపు రూ.12.85 లక్షలు) కాగా, 85-అంగుళాల మోడల్ 4,499 డాలర్లు, 75-అంగుళాల మోడల్ 3,299 డాలర్లు, 65-అంగుళాల మోడల్ 2,699 డాలర్లగా ఉన్నాయి.
55-అంగుళాల మోడల్ ధర 1,999 డాలర్లు, 50-అంగుళాల మోడల్ 1,499 డాలర్లు (దాదాపు రూ.1.28 లక్షలు), 43-అంగుళాల మోడల్ 1,399 డాలర్లు (దాదాపు రూ.1.19 లక్షలు) ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీని కూడా వినియోగదారులు ఇప్పటి నుంచే కొనుగోలు చేయవచ్చు.
* QN80F: బడ్జెట్‌లో 4K టీవీ కావాలనుకునేవారికి..
4K సిరీస్‌లోనే కొంచెం అందుబాటు ధరలో లభించే మరో ఆప్షన్ QN80F. దీనిలో 85-అంగుళాల వేరియంట్ ధర 3,499 డాలర్లు (దాదాపు రూ.3 లక్షలు), 75-అంగుళాల వేరియంట్ 2,299 డాలర్లు (దాదాపు రూ.1.96 లక్షలు), 65-అంగుళాల వేరియంట్ 1,799 డాలర్లు (దాదాపు రూ.1.54 లక్షలు)గా నిర్ణయించారు.
55-అంగుళాల వేరియంట్ 1,299 డాలర్లు (దాదాపు రూ.1.11 లక్షలు) గా నిర్ణయించారు. QN90F మాదిరిగానే, ఈ QN80F మోడల్ కూడా నేటి నుంచే అమ్మకానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ 4K సిరీస్‌లో QN70F అనే మరో మోడల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు Samsung ప్రకటించింది.


Click it and Unblock the Notifications








