శాంసంగ్ బిగ్ లీగ్ : పెద్ద టీవీ కొంటే రూ.2 లక్షల విలువైన టీవీ ఫ్రీ లేదా 20% క్యాష్‌బ్యాక్.. రూ.2990 EMI..!
Samsung TV offers 2025: శాంసంగ్ ఇండియా సరికొత్తగా 'బిగ్ లీగ్. బిగ్గర్ స్క్రీన్' పేరుతో అదిరిపోయే క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. పెద్ద స్క్రీన్ ప్రీమియం టీవీలపై ఎవరూ ఊహించని ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ క్యాంపెయిన్‌ను తీసుకొచ్చారు. ఇది 2025, ఏప్రిల్ 1 నుంచి, ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ ఆఫర్లతో ఇంట్లోనే స్టేడియం లాంటి అనుభూతిని పొందవచ్చు. శాంసంగ్ అందిస్తున్న AI పవర్డ్ టీవీలు అద్భుతమైన విజువల్ క్వాలిటీని, శక్తివంతమైన సౌండ్‌ను అందిస్తాయి. వాటిపై ఇప్పుడు బెస్ట్ డీల్స్ నడుస్తున్నాయి. వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇలాంటి డీల్స్ మళ్లీ రాకపోవచ్చు కాబట్టి దీనిని బంధుమిత్రులతో కూడా పంచుకోండి.

* శాంసంగ్ టీవీలపై అదిరిపోయే ఆఫర్లు
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా, ఎంపిక చేసిన శాంసంగ్ టీవీలను కొనుగోలు చేసే కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటంటే, ఏకంగా రూ.2,04,990 విలువైన టీవీని ఉచితంగా పొందే అవకాశం ఉంది. లేదా రూ.99,990 విలువైన సౌండ్‌బార్‌ను ఉచితంగా అందుకోవచ్చు.
ఎంపిక చేసిన మోడళ్లపై 20% వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. అంతేకాదు, కొనుగోలుదారులు సున్నా డౌన్ పేమెంట్ సౌకర్యాన్ని, సులభమైన EMI ఆప్షన్లను ఎంచుకోవచ్చు. నెలవారీ వాయిదాలు (EMIs) కేవలం రూ.2,990 నుంచి ప్రారంభమవుతాయి, 30 నెలల వరకు EMI సౌకర్యం ఉంది. దీంతో వీటిని ఎవరైనా కొనుగోలు చేయగలరు.
* ఏయే టీవీ సైజులు, మోడళ్లపై ఆఫర్లు..
ఈ క్యాంపెయిన్ 43 అంగుళాలు అంతకంటే పెద్ద సైజు ఉన్న అన్ని శాంసంగ్ టీవీ మోడళ్లకు వర్తిస్తుంది. ఇందులో లేటెస్ట్ అయిన నియో క్యూఎల్ఈడీ 8K (Neo QLED 8K), నియో క్యూఎల్ఈడీ 4K, ఓఎల్ఈడీ ఉన్నాయి. క్రిస్టల్ 4K UHD టీవీలు ఉన్నాయి.
ఈ టీవీలను శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (Samsung.com), శాంసంగ్ షోరూమ్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య రిటైలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ప్రీమియం టీవీలలో ప్రతి క్రికెట్ మ్యాచ్ అనుభూతిని పెంచే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
* ఫీచర్లు
నియో క్యూఎల్ఈడీ 8K టీవీలలో శక్తివంతమైన NQ8 AI జెన్2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది తక్కువ క్వాలిటీ కంటెంట్‌ను కూడా దాదాపు 8K నాణ్యతకు అప్‌స్కేల్ చేస్తుంది. ఇందులో మోషన్ ఎక్సెలరేటర్ టర్బో ప్రో ఫీచర్ ఉండటం వల్ల, వేగవంతమైన క్రికెట్ షాట్స్ లేదా స్పోర్ట్స్ సన్నివేశాల్లో సైతం దృశ్యాలు ఎంతో స్మూత్‌గా, క్లియర్‌గా కనిపిస్తాయి.
నియో క్యూలెడ్ 4K టీవీలలో NQ4 AI జెన్2 ప్రాసెసర్, క్వాంటమ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల రంగులు చాలా సహజంగా, నలుపు రంగు ఎంతో లోతుగా, వివరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. రంగుల ఖచ్చితత్వం కోసం ఇవి పాంటోన్ వ్యాలిడేటెడ్ (Pantone Validated) సర్టిఫికేషన్ కూడా పొందాయి.
క్యూఎల్ఈడీ టీవీలలో 43 అంగుళాల నుంచి ఏకంగా 98 అంగుళాల వరకు సైజుల్లో లభించే ఈ టీవీలు క్వాంటమ్ డాట్ టెక్నాలజీని వాడుతాయి. దీని ప్రత్యేకత ఏంటంటే, బ్రైట్‌నెస్ లెవెల్ ఎలా ఉన్నా సరే, రంగులు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఓఎల్ఈడీ టీవీలు ఇప్పుడు గ్లేర్-ఫ్రీ స్క్రీన్‌తో (Glare-free screen) వస్తున్నాయి.
అంటే, టీవీ చూస్తున్నప్పుడు లైట్ల నుంచి లేదా కిటికీల నుంచి వచ్చే వెలుతురు వల్ల స్క్రీన్‌పై పడే ప్రతిబింబాల సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇవి HDR ప్రోకు కూడా సపోర్ట్ చేస్తాయి, దీనివల్ల హై డైనమిక్ రేంజ్ కంటెంట్ అద్భుతంగా కనిపిస్తుంది.
* UHD టీవీలు విషయానికొస్తే
తక్కువ ధరలో మంచి టీవీ కావాలనుకునే వారి కోసం శాంసంగ్ UHD టీవీలు ఉన్నాయి. ఇవి డైనమిక్ క్రిస్టల్ కలర్ టెక్నాలజీతో అద్భుతమైన, సహజమైన రంగులను అందిస్తాయి. బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ టీవీ కొనాలనుకునే వారికి ఇవి ఒక గొప్ప ఎంపిక. ఈ ఐపీఎల్ సీజన్‌లో, శాంసంగ్ పెద్ద స్క్రీన్ టీవీలతో మీ ఇంటినే స్టేడియంగా మార్చుకోండి! ఆఫర్లు ఏప్రిల్ 30, 2025 వరకు మాత్రమే.


Click it and Unblock the Notifications