శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా 2-ఇన్ -1 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్....

|

శామ్సంగ్ సంస్థ CES 2020 కంటే ముందు ఇప్పుడు తన గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా తన గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా రూపంలో మరొక చౌకైన ల్యాప్‌టాప్ మోడల్‌ను జోడించింది. 2-ఇన్ -1 కన్వర్టిబుల్ QLED డిస్ప్లే, యాక్టివ్ పెన్ సపోర్ట్‌ను అందిస్తున్న ఈ ల్యాప్‌టాప్ 17.5 గంటల బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తుంది. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ ను అధికారికంగా లాంచ్ చేసారు.

ల్యాప్‌టాప్
 

కేవలం 1.19 కిలోల బరువున్న సన్నని మరియు తేలికపాటి ఆల్ఫా వేరియంట్ మోడల్ కేవలం 13.9 మిమీ మందంగా ఉందని పేర్కొన్నారు. ఈ ల్యాప్‌టాప్ సరికొత్త 10 వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో పనిచేస్తుంది మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అందుబాటులోకి శామ్సంగ్ గెలాక్సీ A30s స్మార్ట్‌ఫోన్‌ 128GB స్టోరేజ్ వేరియంట్‌

ధర మరియు లభ్యత

ధర మరియు లభ్యత

శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా ల్యాప్‌టాప్ యొక్క ధర $ 829.99. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.59,300 లుగా ఉంటుంది. ఇది కేవలం ఒకే ఒక రాయల్ సిల్వర్ కలర్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 2020 సంవత్సరం యొక్క మొదటి అర్ధభాగంలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు.

ప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా ల్యాప్‌టాప్ 360 డిగ్రీల కీలను కలిగి ఉంటుంది. ఇది టాబ్లెట్ మోడ్‌లో ఉండి అన్ని రకాల కోణాలలో వంచడానికి వీలుగా ఉంటుంది. అంటే మృదువైన ఉపరితలంపై ఫ్లాట్‌గా ఉంచడానికి లేదా టెంట్ మోడ్‌లో ముందుకు సాగదీయడానికి అనుమతిస్తుంది.

RS.15000 లోపు ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

డిస్ప్లే
 

డిస్ప్లే

13.3-అంగుళాల ఫుల్-హెచ్‌డి (1920x1080 పిక్సెల్స్) 2-ఇన్ -1 QLED డిస్ప్లే గరిష్టంగా 600nits ప్రకాశంతో మరియు 100 శాతం కలర్ వాల్యూమ్‌తో ఉంటుంది. ఇది 10 వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. శామ్సంగ్ ఇంకా ఏ ఎంపికలను వివరించలేదు. ఇది ఇంటెల్ UHD గ్రాఫిక్‌లను అనుసంధానిస్తుంది. 8GB ర్యామ్ మరియు 12GB RAM ఎంపికలు మరియు 256GB మరియు 512GB స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉంటుంది. 1TB SSD (NVMe) మద్దతు, ఫింగర్ ప్రింట్ స్కానింగ్ మద్దతుతో పాటు బ్యాక్‌లిట్ కీబోర్డ్ మద్దతు కూడా ఇందులో ఉంది.

థియేటర్ కంటే ఖరీదైన Samsung Wall TV రిలీజ్... ధర చాలా ఎక్కువ

కనెక్టివిటీ ఎంపికలు

కనెక్టివిటీ ఎంపికలు

శామ్‌సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫాలో రెండు 1.5W స్టీరియో స్పీకర్లు, 720p HD కెమెరా మరియు డ్యూయల్ అర్రే డిజిటల్ మైక్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6 (802.11ax), USB టైప్-సి పోర్ట్, HDMI పోర్ట్, మైక్రో SD స్లాట్ మరియు రెండు USB 3.0 పోర్ట్‌లు ఉన్నాయి.

ఫీచర్స్

ఫీచర్స్

ఈ ల్యాప్‌టాప్ యొక్క ఫ్రేమ్ అల్యూమినియంతో తయారు చేయబడి ఉంటుంది. ఇందులో ఉన్న బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే ఇది 54Wh వద్ద ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఒక్క సారి పూర్తి ఛార్జ్ మీద సుమారు 17.5 గంటల వరకు బ్యాటరీ బ్యాక్ అప్ ఇస్తుంది. అలాగే ఇది ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్‌తో కూడా వస్తుంది. గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా 304.9x202x13.9mm కొలతల పరిమాణంలో ఉండి 1.19 కిలోల బరువును కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy Book Flex Alpha 2-In-1 Laptop Launched: Check Price,Specifications,Availability

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X