Home
Gadgets

అమెజాన్‌లో శాంసంగ్‌ ఇయర్‌బడ్స్‌ ధర తగ్గింపు.. 29 గంటల బ్యాటరీ లైఫ్ సహా ANC ఫీచర్లు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ శాంసంగ్‌ నుంచి త్వరలో అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 6 మరియు గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లతోపాటు గెలాక్సీ బడ్స్‌ 3 సిరీస్‌ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా గెలాక్సీ బడ్స్ 2 ప్రో ధర (Samsung Galaxy Buds 2 Pro Price Drop) తగ్గింది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ 2 ప్రో ధర :
శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్ 2 ప్రో విడుదల సమయంలో ధర రూ.17999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.10949 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు HDFC క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపును పొందవచ్చు. మరియు 12 నెలలపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

Samsung galaxy buds 2 pro attracts with price cut on amazon

ఈ గెలాక్సీ బడ్స్ 2 ప్రో ఇయర్‌బడ్స్ 10mm AKG డ్రైవర్‌లను కలిగి ఉంటుంది. ఏరోడైనమిక్ డిజైన్‌తో వెంట్‌ హోల్‌ మరియు నాజిల్‌ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. అత్యాధునిక ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌) సపోర్టుతో 3 మైక్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

కాలింగ్‌ సమయంలో యూజర్లు ANC ఫీచర్‌ నుంచి యాంబియంట్ మోడ్‌లోకి మారేందుకు అవకాశం ఉంది. డాల్బీ హెడ్ ట్రాకింగ్‌ సపోర్టుతో 24 బిట్‌ Hi-Fi సౌండ్‌ మరియు 360 డిగ్రీల ఆడియో అనుభూతిని పొందవచ్చు. ఫలితంగా ఆడియో, కాలింగ్ సమయంలో సౌకర్యవతంగా వినియోగించుకోవచ్చు.

బ్యాటరీ లైఫ్‌ పరంగా ఈ గెలాక్సీ ఇయర్‌బడ్స్.. 515mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. సింగిల్‌ ఛార్జింగ్‌తో 29 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. అదే ANC ఫీచర్‌ ఆన్‌ (ON) లో ఉన్నప్పుడు 5 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. బడ్స్ ఆడియో స్విచ్‌, ఈజీ పెయిర్‌, బ్లూటూత్‌ వంటి ఫీచర్‌తో అందుబాటులో ఉంది.

** ఇటీవలే శాంసంగ్‌ గెలాక్సీ F15 5G ఎయిర్‌టెల్‌ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. 18 నెలల వరకు ఎయిర్‌టెల్‌ సిమ్ కార్డుతో లాక్‌ చేయబడి ఉంటుంది. ఈ సంవత్సరం మార్చి నెలలో శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాగా రెండు రోజుల క్రితం ఈ హ్యాండ్‌సెడ్‌ ఎయిర్‌టెల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.

శాంసంగ్ గెలాక్సీ F15 5G ఎయిర్‌టెల్‌ ఎడిషన్‌ కొనుగోలుపై 50GB కూపన్‌ సహా గరిష్ఠంగా 7 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 18నెలలపాటు ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డు మాత్రమే వినియోగించాలి. మరియు కనీసం రూ.199 రీఛార్జి చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ముగిసిన 15 రోజుల్లోగా రీఛార్జ్‌ చేయించాల్సి ఉంటుంది. లేకుంటే స్మార్ట్‌ఫోన్‌ లాక్ చేయబడుతుంది.

శాంసంగ్ గెలాక్సీ F15 5G ఎయిర్‌టెల్‌ ఎడిషన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.12,249, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,749, 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.15,249 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy buds 2 pro received price drop on amazon features and offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X