Home
Gadgets

శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ 4 సిరీస్‌ విడుదల.. ముందస్తు బుకింగ్, ఫీచర్ల వివరాలు..!

Samsung Galaxy Buds 4 Series : గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌ బుధవారం రాత్రి నిర్వహించింది. ఈవెంట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌తోపాటు గెలాక్సీ బడ్స్ 4 సిరీస్‌ కూడా విడుదల అయింది. ఇందులో గెలాక్సీ బడ్స్‌ 4, గెలాక్సీ బడ్స్‌ 4 ప్రో మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ బడ్స్‌ 4, గెలాక్సీ బడ్స్‌ 4 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ బడ్స్‌ సిరీస్‌ హెడ్‌ గెశ్చర్స్‌ను సపోర్టు చేస్తుంది. ఈ గెశ్చర్స్‌తో కాల్స్‌ ను స్పందించేందుకూ అవకాశం ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్ 6 మైక్రోఫోన్‌లను కలిగి ఉన్నాయి. టూ వే స్పీకర్లను కలిగి ఉన్నాయని శాంసంగ్‌ తెలిపింది. అడాప్టివ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) సపోర్టును కలిగి ఉంది.

Samsung Galaxy Buds 4 Series

ప్రత్యేక ఫీచర్లు :
గెలాక్సీ బడ్స్‌ 4 ప్రో మోడల్‌ సీరెన్‌ డిటెక్షన్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు కన్వర్జేషన్ డిటెక్షన్‌, 360 ఆడియో సపోర్టును కలిగి ఉంది. అయితే బేస్‌ వేరియంట్‌లో సీరెట్‌ డిటెక్షన్‌ మినహా ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ బడ్స్‌ AAC, SBC, SSC, LC3, SSC-UHQ ను సపోర్టు చేస్తాయి.

బ్యాటరీ, ఛార్జింగ్ :
శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్ 4 ప్రో ఇయర్‌బడ్స్‌ ఛార్జింగ్‌ కేస్‌ 530mAh బ్యాటరీ, బడ్స్‌ 61mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఛార్జింగ్‌ కేస్‌ను పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 30 గంటల వరకు ప్లేబ్యాక్‌ టైమ్‌ను (ANC Off) పొందుతుంది. ANC ఆన్‌లో ఉండే 26 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ను అందిస్తుంది.

అదే గెలాక్సీ బడ్స్‌ 4 ఇయర్‌బడ్స్‌ ఛార్జింగ్‌ కేస్‌ 515mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే బడ్స్‌ 45mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ 30 గంటలపాటు (ANC Off) వినియోగించుకోవచ్చు. ANC ఆన్‌లో ఉంటే 24 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ను అందిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ 4 సిరీస్‌ బ్లూటూత్‌ 6.1 సపోర్టు చేస్తుంది. మల్టీ పాయింట్‌ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. గెలాక్సీ బడ్స్ 4 IP54 రేటింగ్‌, ప్రో మోడల్‌ IP57 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి.

గెలాక్సీ బడ్స్‌ 4 సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్ 4 ధర రూ.16999 గా ఉంది. అదే ప్రో మోడల్‌ ధర రూ.22999 గా ఉంది. శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, అమెజాన్‌ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. బేస్‌ వేరియంట్‌ వైట్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే ప్రో మోడల్‌ బ్లాక్, పింక్‌ గోల్డ్‌, వైట్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ సిరీస్‌ను ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి. వీరికి మార్చి 6 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానున్నాయి. 15 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే గరిష్టంగా రూ.2500, రూ.3449 వరకు తగ్గింపును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Buds 4 Series now available for pre booking here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X