Home
Gadgets

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌పై రూ.10000 డిస్కౌంట్.. ఈ స్మార్ట్‌ రింగ్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

శాంసంగ్‌ గత సంవత్సరం జులై నెలలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ లో గెలాక్సీ రింగ్‌ ను ఆవిష్కరించింది. భారత్‌ మార్కెట్‌ లో 2024 అక్టోబర్‌ నెలలో అందుబాటులోకి వచ్చింది. లాంచ్‌ సమయంలో ఈ స్మార్ట్‌ రింగ్‌ ధర రూ.38,999 గా ఉంది. తాజాగా ఈ రింగ్‌ పై (Samsung Galaxy Ring) రూ.10,000 డిస్కౌంట్‌ ను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఫలితంగా ధర రూ.28999 గా ఉంటుంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, శాంసంగ్‌ షాప్‌ యాప్‌ లో GALAXYRING కూపన్‌ కోడ్‌ ద్వారా ఈ డిస్కౌంట్‌ను పొందవచ్చని శాంసంగ్‌ తెలిపింది. ఈ స్మార్ట్‌ రింగ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది.

మూడు ప్రత్యేక సెన్సార్‌లు :
శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రస్తుతం 11 సైజుల్లో అందుబాటులో ఉంది. 5 నుంచి 15 వరకు సైజుల్లో లభిస్తోంది. ముఖ్యంగా ఈ రింగ్ మూడు సెన్సార్‌ లను కలిగి ఉంది. ఆప్టికల్‌ బయో సిగ్నల్‌ సెన్సార్‌, టెంపరేచర్‌ సెన్సార్‌, యాక్సెలిరోమీటర్‌ సెన్సార్‌ కలిగి ఉంది. వీటి ద్వారా యూజర్‌ల హెల్త్‌ ను ట్రాక్‌ చేయవచ్చు.

Samsung Galaxy Ring

హెల్త్‌ ఫీచర్‌లు :
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత హెల్త్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ రింగ్‌ AI స్లీప్‌ అల్గారిథంతో పనిచేస్తాయి. దీంతో నిద్రకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తుంది. దీంతోపాటు హార్ట్ బీట్‌లో మార్పులను గుర్తించి యూజర్‌లను అప్రమత్తం చేస్తుంది. మహిళల చర్మ ఉష్ణోగ్రత ఆధారంగా రుతుక్రమాన్ని ట్రాక్‌ చేసిన అలెర్ట్‌ చేస్తుంది. వీటితోపాటు అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది.

సింగిల్‌ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 7 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. దీంతోపాటు స్మార్ట్‌ రింగ్‌ ఛార్జింగ్‌ కేస్‌ LED లైట్‌ ను కలిగి ఉంటుంది. రియల్‌ టైంలో ఛార్జింగ్‌ గురించి తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా రెండు సైజుల్లో ఈ రింగ్‌ అందుబాటులోకి వచ్చింది. 5 సైజు కలిగిన రింగ్‌ 18mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ఛార్జింగ్‌ కేస్ 361mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ రింగ్‌ 8MB స్టోరేజీతో అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్లూటూత్‌ 5.4 వెర్షన్‌ ను సపోర్టు చేస్తుంది. ఆసక్తికరంగా శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా స్మార్ట్‌ రింగ్‌ లొకేషన్‌ ను గుర్తించవచ్చు. దీంతోపాటు ప్రత్యేక గెశ్చర్స్‌ తో స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు.

ఈ స్మార్ట్ రింగ్‌ IP68 రేటింగ్‌ తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. దీంతోపాటు ఎక్కువరోజుల పాటు మన్నిక వచ్చేలా డిజైన్‌ను కలిగి ఉంది. ఈ రింగ్‌ టైటానియం సిల్వర్‌, టైటానియం బ్లాక్‌, టైటానియం గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ రింగ్‌తో స్టైలిష్‌ లుక్‌తోపాటు యూజర్లు తమ ఆరోగ్యాన్ని నిరంతరం ట్రాక్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

* ఇటీవల శాంసంగ్‌ నుంచి గెలాక్సీ S25 సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్‌, గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌ సేల్‌ ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది.

గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్‌ కేవలం 256GB స్టోరేజీ, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే త్వరలో 128GB స్టోరేజీ వేరియంట్‌లోనూ విడుదల కానుందని భావిస్తున్నారు. ధర రూ.74,999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే శాంసంగ్ ఈ వేరియంట్‌లో ఎటువంటి ప్రకటన చేయలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Ring gets RS10000 huge discount in india on samsung website and app
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X