భారత్‌లో ఎట్టకేలకు శాంసంగ్ గెలాక్సీ రింగ్ ధర వెల్లడి.. హెల్త్ ట్రాకర్లు సహా ఎన్నో ప్రత్యేకతలు..!
శాంసంగ్ నుంచి ఎట్టకేలకు గెలాక్సీ రింగ్ (Samsung Galaxy Ring Launched) భారత్‌లో లాంచ్ అయింది. ఇటీవలే రూ.1999 చెల్లించి ముందస్తు బుకింగ్‌లు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. తాజాగా ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ శాంసంగ్ గెలాక్సీ రింగ్‌ను ఈ సంవత్సరం జులైలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. అనంతరం కొన్ని దేశాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ రింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. తాజాగా ఈ శాంసంగ్ స్మార్ట్ రింగ్ ధరలను భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది.
శాంసంగ్ గెలాక్సీ రింగ్ 5- 13 వరకు మొత్తం 9 సైజుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రింగ్ అనేక హెల్త్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. AI స్లీప్ అల్గారిథంలో విడుదల అయింది. ఫలితంగా నిద్రకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. మరియు PPG సెన్సార్.. హార్ట్ బీట్‌లో మార్పులను గుర్తిస్తుంది. యూజర్లను అప్రమత్తం చేస్తుంది.

ఈ శాంసంగ్ స్మార్ట్ రింగ్ టెంపరేచర్ సెన్సార్, యాక్సిలిరోమీటర్ సెన్సార్, ఎనర్జీ స్కోర్, వెల్‌నెస్ టిప్స్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మహిళల చర్మ ఉష్ణోగ్రత ఆధారంగా వారి రుతు క్రమాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ గెలాక్సీ రింగ్‌ను శాంసంగ్ హెల్త్ యాప్‌తో లింక్ చేయవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ రింగ్ 8MB స్టోరేజీని కలిగి ఉంది. ఈ రింగ్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. మరియు బ్లూటూత్ 5.4 పైన పనిచేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ స్మార్ట్ రింగ్ లొకేషన్‌ను గుర్తించవచ్చు. గెశ్చర్స్ ద్వారా ఈ రింగ్ కనెక్ట్ చేయబడిన స్మార్ట్‌ఫోన్ నుంచి ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు, అలారంను ఆఫ్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ రింగ్ 9 సైజుల్లో లభిస్తుంది. 5 సైజు కలిగిన రింగ్ 18mAh బ్యాటరీని కలిగి ఉండగా.. 13 సైజు కలిగిన రింగ్ 23.5mAh బ్యాటరీని కలిగి ఉంది. LED లైట్‌తో కూడిన ఛార్జింగ్ కేస్ 361mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ రింగ్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 7 రోజులపాటు వినియోగించుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ధర, సేల్ వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ధర (Samsung Galaxy Ring Price) రూ.38,999 గా ఉంది. గెలాక్సీ రింగ్‌ను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ samsung.com, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ సైజింగ్ కిట్ ద్వారా సైజు సరిచూసుకొని, శాంసంగ్ గెలాక్సీ రింగ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ రింగ్‌ను నో కాస్ట్ EMI రూపంలోనూ కొనుగోలు చేయవచ్చు. 24 నెలలపాటు రూ.1625 చొప్పున చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా అక్టోబర్ 18 తేదీ లోపల ఈ స్మార్ట్ రింగ్‌ను కొనుగోలు చేసిన వారు 25W ట్రావెల్ అడాప్టర్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ రింగ్ టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, టైటానియం గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








