Home
Gadgets

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ విడుదల..హెల్త్‌ ట్రాకర్లు సహా హార్ట్‌ బీట్‌పై ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌లు.. ధర, సేల్

శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ జులై 10న నిర్వహించింది. ఇందులో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లు సహా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గెలాక్సీ రింగ్‌ను (Samsung Galaxy Ring Launched) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ రింగ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్లు మరియు నిద్రను పర్యవేక్షించే ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ స్మార్ట్‌ రింగ్‌ బరువు 2.3 గ్రాముల నుంచి 3.0 గ్రాముల వరకు ఉంటుంది. ఈ గెలాక్సీ రింగ్‌ను ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. జులై 24 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ గెలాక్సీ రింగ్ మొత్తం తొమ్మిది సైజుల్లో లభిస్తుంది. సైజింగ్ కిట్‌ ద్వారా సరైన సైజ్‌ను ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ రింగ్‌ 8MB Memory తో వస్తుంది. మరియు PPG (Photo Plethysmo Graphy) సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ సెన్సార్‌ హార్ట్‌ బీట్‌లో ఎటువంటి మార్పులు వచ్చినా గుర్తిస్తుంది.

Samsung Galaxy ring

శాంసంగ్ హెల్త్‌ యాప్‌ ద్వారా హార్ట్‌ బీట్‌ (హృదయ స్పందన రేటు) కు సంబంధించిన నోటిఫికేషన్‌లను ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఆటో వర్కౌట్‌ డిటెక్షన్, మరియు ఇన్‌ యాక్టివ్‌ అలెర్ట్‌లను కూడా ఇతర హెల్త్ ట్రాకర్ల ద్వారా పొందవచ్చు. దీంతోపాటు టెంపరేచర్‌ సెన్సార్‌, యాక్సిలిరోమీటర్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. శాంసంగ్‌ హెల్త్ యాప్‌ ద్వారా ఇవి పనిచేస్తాయి. ఈ గెలాక్సీ రింగ్‌ AI ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

ఎనర్జీ స్కోర్‌, వెల్‌నెస్‌ టిప్స్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ రింగ్‌ యూజర్‌ ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక రూపొందించి, సలహాలు ఇస్తుంది. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ రింగ్‌ స్లీప్‌ AI అల్గారిథంను కలిగి ఉంటుంది. అంటే నిద్రకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. దీంతోపాటు గుండె మరియు శ్వాస క్రియ రేటు వివరాలను అందిస్తుంది. దీంతోపాటు మహిళల్లో చర్మ ఉష్ణోగ్రత ఆధారంగా రుతుచక్రాన్ని ట్రాక్‌ చేస్తుంది.

Samsung Galaxy ring

ఈ స్మార్ట్‌ రింగ్‌ను శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా ఫోటోలను క్యాప్చర్‌ చేయడం, అలారం ను ఆఫ్‌ చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా గెలాక్సీ రింగ్‌ లోకేషన్‌ను గుర్తించవచ్చు. ఆండ్రాయిడ్‌ 11 లేదా అంత కంటే అప్‌డేట్‌ వెర్షన్‌లు కలిగిన శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లతో జతచేయవచ్చు.

ఈ గెలాక్సీ రింగ్‌ మొత్తం 9 సైజుల్లో అందుబాటులో ఉంటుంది. 5 సైజు కలిగిన రింగ్‌ 18mAh బ్యాటరీని కలిగి ఉండగా.. 13 సైజ్‌ కలిగిన రింగ్‌ 23.5mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రింగ్‌ ప్రత్యేకమైన ఛార్జింగ్ కేస్‌ను కలిగి ఉంది. దీనికి ఉన్న LED లైట్‌ ద్వారా ఛార్జింగ్‌ తీరును గుర్తించవచ్చు. ఈ ఛార్జింగ్ కేస్‌ 361mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది.

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ రింగ్‌ను 0-40 శాతం ఛార్జింగ్ చేసేందుకు 30 నిమిషాల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది. అయితే పూర్తి ఛార్జింగ్‌ ద్వారా 7 రోజుల పాటు వినియోగించుకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ రింగ్ IP68 రేటింగ్‌తో చెమట మరియు నీటి నుంచి మెరుగైన రక్షణ పొందుతుంది. బ్లూటూత్‌ 5.4 తో పనిచేస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్ ధర, సేల్‌ :
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ధర $399 (భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.34,000) గా ఉంది. జులై 10 నుంచే ముందస్తు బుకింగ్‌ చేసుకొనే అవకాశం ఉంది. జులై 24 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. టైటానియం బ్లాక్‌, టైటానియం సిల్వర్‌, టైటానియం గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy ring launched with key health trackers in galaxy unpacked event
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X