Home
Gadgets

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ముందస్తు బుకింగ్‌ ప్రారంభం.. ఎక్కడ అందుబాటులో ఉంది.. ఎంత ధర చెల్లించాలి..?

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ను ఈ సంవత్సరం జులైలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ లో సంస్థ విడుదల చేసింది. అయితే ఆ సమయంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఈ స్మార్ట్‌ రింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. ఈ శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ (Samsung Galaxy Ring Pre Order) అనేక హెల్త్‌ మరియు ఫిట్‌నెట్‌ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ను సంస్థ అధికారిక వెబ్‌సైట్ samsung.com, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా ముందస్తు బుకింగ్‌ చేయవచ్చు. ఇందుకు రూ.1999 చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న సమయంలో చెల్లించిన నగదు మొత్తాన్ని తిరిగిస్తామని సంస్థ తెలిపింది. ముందస్తు బుకింగ్‌ చేసుకొని, ఈ స్మార్ట్‌రింగ్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.4999 విలువైన వైర్‌లెస్‌ ఛార్జర్‌ డుయోను అందిస్తామని తెలిపింది.

Samsung Galaxy ring Preorder date

అయితే ఈ శాంసంగ్ గెలాక్సీ రింగ్‌ ఎప్పటి నుంచి భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందనే సమాచారం సంస్థ వెల్లడించలేదు. అయితే భారత్‌లో శాంసంగ్‌ స్మార్ట్‌ రింగ్‌ టైటానియం గోల్డ్‌, టైటానియం సిల్వర్‌, టైటానియం బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ గెలాక్సీ రింగ్‌ 5- 13 వేర్వేరు సైజుల్లో లభిస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ రింగ్‌ ధరను సంస్థ వెల్లడించలేదు.

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ మొత్తం 9 సైజుల్లో అందుబాటులో కొనుగోలు చేయవచ్చు. 5 సైజు కలిగిన రింగ్‌ 18mAh బ్యాటరీని.. అదే గరిష్ఠంగా 13 సైజు కలిగిన రింగ్ 23.5mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రింగ్‌ ఛార్జింగ్‌ కేస్‌ 361mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఛార్జింగ్ కేస్‌ ప్రత్యేక LED లైట్‌ను అమర్చి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజులపాటు వినియోగించుకోవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్ PPG సెన్సార్‌ను కలిగి ఉంటంది. హార్ట్‌ బీట్‌లో మార్పులను గుర్తిస్తుంది. దీంతోపాటు టెంపరేచర్‌ సెన్సార్‌, యాక్సిలిరోమీటర్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. ఎనర్జీ స్కోర్‌, వెల్‌నెస్‌ టిప్స్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు AI స్లీప్‌ అల్గారిథంను కలిగి ఉంటుంది. ఫలితంగా నిద్రకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ మహిళల్లో చర్మ ఉష్ణోగ్రత ఆధారంగా రుతుక్రమాన్ని ట్రాక్‌ చేస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ రింగ్‌ 8 MB స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ రింగ్‌ శాంసంగ్‌ హెల్త్ యాప్‌ లింక్ చేయవచ్చు. మరియు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా రింగ్‌ లొకేషన్‌ను గుర్తించవచ్చు. IP68 రేటింగ్‌, బ్లూటూత్‌ 5.4 తో పనిచేస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy ring Preorder starts from today in india features and key details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X