Samsung Galaxy Tab A8 లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

Samsung India Galaxy Tab A8ని భారతదేశంలో నేడు లాంచ్ చేసారు. ఈ టాబ్లెట్ 10.5-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, Unisoc టైగర్ T618 చిప్‌సెట్ మరియు క్వాడ్-స్పీకర్ సెటప్ వంటి ఫీచర్స్ లను కలిగి ఉన్నాయి. ఈ గెలాక్సీ ట్యాబ్ A8 ను USలో 2021 డిసెంబర్ లో మొదటిసారి లాంచ్ చేసింది. కొత్తగా ప్రారంభించబడిన Samsung టాబ్లెట్ ఇండియాలో జనవరి 17న ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి.

 

Samsung గెలాక్సీ ట్యాబ్ A8 ధర, లభ్యత, విక్రయ ఆఫర్‌లు

Samsung గెలాక్సీ ట్యాబ్ A8 ధర, లభ్యత, విక్రయ ఆఫర్‌లు

Samsung గెలాక్సీ ట్యాబ్ A8 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఇందులో 3GB+32GB WiFi వేరియంట్ ధర రూ.17,999 కాగా 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ WiFi వేరియంట్ ధర రూ.19,999. అలాగే గెలాక్సీ ట్యాబ్ A8 యొక్క LTE వేరియంట్ 3GB ర్యామ్ +32GB స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999 మరియు 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999. ఇది గ్రే, పింక్ గోల్డ్ మరియు సిల్వర్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

Samsung గెలాక్సీ ట్యాబ్ A8 సేల్స్ ఆఫర్స్

Samsung గెలాక్సీ ట్యాబ్ A8 సేల్స్ ఆఫర్స్

Samsung గెలాక్సీ ట్యాబ్ A8 విక్రయ ఆఫర్‌ల విషయానికొస్తే కస్టమర్‌లు ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లపై రూ.2,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా రూ.4,499 విలువైన బుక్ కవర్‌ను కేవలం రూ.999కే పొందవచ్చు. భారతదేశంలో జనవరి 17న మధ్యాహ్నం 12 గంటలకు Amazon, Flipkart మరియు Samsung ఆన్‌లైన్ స్టోర్‌లలో మొదటిసారి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.

Samsung Galaxy Tab A8 స్పెసిఫికేషన్స్
 

Samsung Galaxy Tab A8 స్పెసిఫికేషన్స్

కొత్తగా ప్రారంభించబడిన Samsung Galaxy Tab A8 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 10.5-అంగుళాల LCDని కలిగి ఉంటుంది. ఇది 1,920 x 1,200 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 16:10 కారక నిష్పత్తిని అందిస్తుంది. కంపెనీ ప్రకారం కొత్త టాబ్లెట్ దాని ముందున్న Galaxy Tab A7 లాగానే నాలుగు డాల్బీ అట్మోస్-ఎనేబుల్డ్ స్పీకర్లతో వస్తుంది. ఈ ట్యాబ్ 2GHz వద్ద క్లాక్ చేయబడిన Unisoc టైగర్ T618 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. గెలాక్సీ ట్యాబ్ A8 యొక్క CPU మరియు GPU ప్రతి ఒక్కటి ముందుతరంతో పోలిస్తే సున్నితమైన పనితీరును అందించడానికి 10% వరకు పెంచబడ్డాయి. అలాగే ఇది ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది.

Samsung Galaxy Tab A8

Samsung Galaxy Tab A8 యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే ఈ ట్యాబ్ 4 GB RAM మరియు 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది Wi-Fi 5 (ac) మరియు బ్లూటూత్ 5కి మద్దతుతో వచ్చే WiFi మరియు LTE వేరియంట్‌లో వస్తుంది. టాబ్లెట్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB-C 2.0 పోర్ట్ కూడా ఉన్నాయి. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7,040 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అయితే టాబ్లెట్ 7.5W ఛార్జర్‌తో వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab A8 Launched in India With Unisoc Tiger T618 Chipset: Price, Specs, Sale Date, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X