Samsung Galaxy Watch 5 సిరీస్ ప్రీ-బుకింగ్స్‌పై క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు!

|

Samsung కంపెనీ ఇటీవ‌ల నిర్వ‌హించిన Galaxy అన్‌ప్యాక్‌డ్ ఈవెంట్ 2022 లో భాగంగా Samsung Galaxy Watch 5 మరియు Galaxy Watch 5 Pro ల‌ను లాంచ్ చేసింది. కాగా, భార‌త దేశంలో ఆయా స్మార్ట్ వాచ్‌ల ధరలను కూడా కంపెనీ ఇప్ప‌టికే వెల్ల‌డించింది. అయితే, ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌ల కోసం ప్రీ-బుకింగ్‌లు ఆగస్ట్ 16న ప్రారంభమవుతాయని Samsung ప్రకటించింది.

 
Samsung Galaxy Watch 5 సిరీస్ ప్రీ-బుకింగ్స్‌పై క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు!

దక్షిణ కొరియా కంపెనీ Galaxy Z Fold 4, Galaxy Z Flip 4 మరియు Galaxy Buds 2 Proతో పాటు Galaxy Watch 5 సిరీస్‌ని Galaxyలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇదిలా ఉండ‌గా, ఈ Galaxy Watch 5 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు ఆపిల్ వాచ్ సిరీస్ 7 స్మార్ట్‌వాచ్‌లకు పోటీగా ఉండ‌నున్న‌ట్లు కనిపిస్తోంది.

భార‌త మార్కెట్లో Samsung Galaxy Watch 5, Galaxy Watch 5 Pro ధ‌ర‌లు, ప్రీబుకింగ్స్ వివ‌రాలు:

భార‌త మార్కెట్లో Samsung Galaxy Watch 5, Galaxy Watch 5 Pro ధ‌ర‌లు, ప్రీబుకింగ్స్ వివ‌రాలు:

Samsung నుండి వచ్చిన సమాచారం ప్రకారం, కొత్తగా లాంచ్ చేయబడిన వేరబుల్స్ Galaxy Watch 5 మరియు Galaxy Watch 5 Pro వాచ్‌ల‌ను Samsung.com సైట్ ద్వారా లేదా ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ఆగస్టు 16 నుండి ప్రీ-బుక్ చేయవచ్చు. భారతదేశంలో Galaxy Watch 5 ప్రారంభ ధర రూ. 27,999 మరియు భారతదేశంలో గెలాక్సీ వాచ్ 5 ప్రో ప్రారంభ ధర రూ.44,999 గా నిర్ణ‌యించింది.

Galaxy Watch 5 (40mm) బ్లూటూత్ మోడల్ ధర రూ.27,999 మరియు LTE వెర్షన్ ధర రూ.32,999. 44mm బ్లూటూత్ వెర్షన్ ధర రూ.30,999 మరియు LTE వెర్షన్ రూ.35,999 లకు అందుబాటులో ఉంటుంది. Galaxy Watch 5 Pro (45mm) బ్లూటూత్ వెర్షన్ ధర రూ.44,999 మరియు LTE వెర్షన్ ధర రూ. 49,999 కు అందుబాటులో రానుంది.

Galaxy Watch 5 యొక్క 40mm వేరియంట్ గ్రాఫైట్, పింక్ గోల్డ్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. Galaxy Watch 5 యొక్క 44mm వెర్షన్ గ్రాఫైట్, సాఫైర్ మరియు సిల్వర్ రంగులలో ప్రారంభించబడింది. వినియోగదారులు స్మార్ట్ వాచ్ కొనుగోలుపై అన్ని ప్రముఖ బ్యాంకుల నుండి రూ.3,000 క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు. అదేవిధంగా, గెలాక్సీ వాచ్ 5 ప్రో బ్లాక్ టైటానియం మరియు గ్రే టైటానియం రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల కస్టమర్‌లు అన్ని ప్రముఖ బ్యాంకుల నుండి రూ.5,000 క్యాష్‌బ్యాక్ పొందే అవ‌కాశం ల‌భించ‌నుంది.

ఇంకా, Galaxy Watch 5 సిరీస్‌ను ప్రీ-బుక్ చేసే వారు గెలాక్సీ బడ్స్ 2 రూ.2,999 ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు. కస్టమర్‌లు సులభమైన ఫైనాన్స్ ఎంపికలకు కూడా అర్హులు మరియు వారి పాత డివైజ్‌ను మార్పిడి చేసినప్పుడు రూ.5,000 క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చని Samsung పేర్కొంది.

Samsung Galaxy Watch 5 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
 

Samsung Galaxy Watch 5 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy Watch 5 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు డిజైన్, ఫీచర్లు మరియు మొత్తం పనితీరు పరంగా అనేక అప్‌గ్రేడ్‌లను క‌లిగి ఉన్నాయి. Samsung గెలాక్సీ వాచ్ 5 మరియు వాచ్ 5 ప్రో రెండూ సాఫైర్‌ క్రిస్టల్ బాడీని కలిగి ఉంటాయి, ఇవి సాంప్రదాయ గ్లాస్ బాడీ కంటే మెరుగైన మన్నికను అందిస్తాయి. అయినప్పటికీ, ప్రో మోడల్‌లో టైటానియం ఫారమ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, కాబ‌ట్టి తద్వారా అది మరింత ప్రీమియంగా ఉంటుంది.

Samsung Galaxy Watch 5 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 44mm వేరియంట్‌ 450x450 pixels రిసొల్యుష‌న్‌తో 1.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఇది WearOS 3.5- ఆధారిత‌ One UI Watch 4.5 ఓఎస్‌పై ర‌న్ అవుతుంది. 40mm వేరియంట్ 396x396 pixels రిసొల్యుష‌న్‌తో 1.2-అంగుళాల AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. రెండు వేరియంట్స్ కూడా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచ‌ర్ క‌లిగి ఉన్నాయి. ఇది డ్యుయ‌ల్ కోర్ Exynos W920 SoC ప్రాసెస‌ర్ 1.5GB of RAM తో వ‌స్తోంది.

కంపెనీ ప్రకారం, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఎలక్ట్రికల్ హార్ట్ సిగ్నల్ మరియు బయోఎలెక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ ఫీచ‌ర్స్‌ క‌లిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. Samsung Galaxy Watch 5ని ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీని ఉపయోగించే ఉష్ణోగ్రత సెన్సార్‌తో కూడా అమర్చింది. ఆన్‌బోర్డ్‌లోని ఇతర సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, బేరోమీటర్, గైరోస్కోప్, కంపాస్ మరియు లైట్ సెన్సార్ ఉన్నాయి.

అంతేకాకుండా ఇది 5.2 బ్లూటూత్ వ‌ర్ష‌న్‌ను క‌లిగి ఉంది. మ‌రోవైపు ఈ స్మార్ట్ వాచ్ డ‌స్ట్ మ‌రియు వాట‌ర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP68 సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. రెండు వేరియంట్‌లు WPC-ఆధారిత వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. Samsung ప్రకారం, బ్యాటరీ 13 శాతం పెద్దది మరియు 8 నిమిషాల ఛార్జింగ్‌తో 8 గంటల స్లీప్ ట్రాకింగ్‌ను అందిస్తుంది.

Samsung Galaxy Watch 5 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు::

Samsung Galaxy Watch 5 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు::

Samsung Galaxy Watch 5 Pro యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 450x450 pixels రిసొల్యుష‌న్‌తో 1.4-అంగుళాల సూప‌ర్ AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఇది WearOS 3.5- ఆధారిత‌ One UI Watch 4.5 ఓఎస్‌పై ర‌న్ అవుతుంది. ఇది కూడా నాన్ ప్రో మోడ‌ల్ మాదిరి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచ‌ర్ క‌లిగి ఉన్నాయి. ఇది డ్యుయ‌ల్ కోర్ Exynos W920 SoC ప్రాసెస‌ర్ 1.5GB of RAM తో వ‌స్తోంది.

కంపెనీ ప్రకారం, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఎలక్ట్రికల్ హార్ట్ సిగ్నల్ మరియు బయోఎలెక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ ఫీచ‌ర్స్‌ క‌లిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. Galaxy Watch 5 Pro ట్రాక్ బ్యాక్ ఫీచర్‌ను అందిస్తుంది, హైకర్లు, మౌంటెన్ బైకర్స్ మరియు ఇతరులు వారు ఎక్కడ నుండి త‌మ ట్రాక్‌ ప్రారంభించారో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ధరించిన వారు తమ Galaxy Watch 5 Proలో హైకింగ్ మరియు సైక్లింగ్ మార్గాలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా ఇది 5.2 బ్లూటూత్ వ‌ర్ష‌న్‌ను క‌లిగి ఉంది. మ‌రోవైపు ఈ స్మార్ట్ వాచ్ డ‌స్ట్ మ‌రియు వాట‌ర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP68 సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. రెండు వేరియంట్‌లు WPC-ఆధారిత వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. క‌నెక్టివిటీ ప‌రంగా వైఫై, NFC, GPS స‌పోర్ట్ క‌లిగి ఉంది. ఇక బ్యాట‌రీ విష‌యానికొస్తే 590mAh సామ‌ర్గ్యం గ‌ల బ్యాట‌రీ అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Watch 5, Galaxy Watch 5 Pro Price in India Revealed; Pre-Bookings Start August 16

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X