అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో Samsung Galaxy Watch 5 సిరీస్ విడుద‌ల‌!

|

Samsung కంపెనీ త‌మ త‌దుప‌రి త‌రం ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ల‌ను బుధ‌వారం నిర్వ‌హించిన గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్ ఈవెంట్‌లో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. వాటితో పాటుగా త‌మ కంపెనీకి చెందిన స్మార్ట్‌వాచ్‌ల‌ను, ఇయ‌ర్ బ‌డ్స్‌ను కూడా విడుద‌ల చేసింది.

Samsung Galaxy Watch 5

Samsung Galaxy Watch 5, Galaxy Watch 5 Pro, Galaxy Buds2 Pro ల‌ను విడుద‌ల చేసింది. ఇప్పుడు ఆ స్మార్ట్‌వాచ్‌ల ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

Samsung Galaxy Watch 5 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy Watch 5 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy Watch 5 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు డిజైన్, ఫీచర్లు మరియు మొత్తం పనితీరు పరంగా అనేక అప్‌గ్రేడ్‌లను క‌లిగి ఉన్నాయి. Samsung గెలాక్సీ వాచ్ 5 మరియు వాచ్ 5 ప్రో రెండూ సాఫైర్‌ క్రిస్టల్ బాడీని కలిగి ఉంటాయి, ఇవి సాంప్రదాయ గ్లాస్ బాడీ కంటే మెరుగైన మన్నికను అందిస్తాయి. అయినప్పటికీ, ప్రో మోడల్‌లో టైటానియం ఫారమ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, కాబ‌ట్టి తద్వారా అది మరింత ప్రీమియంగా ఉంటుంది.

Samsung Galaxy Watch 5 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 44mm వేరియంట్‌ 450x450 pixels రిసొల్యుష‌న్‌తో 1.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఇది WearOS 3.5- ఆధారిత‌ One UI Watch 4.5 ఓఎస్‌పై ర‌న్ అవుతుంది. 40mm వేరియంట్ 396x396 pixels రిసొల్యుష‌న్‌తో 1.2-అంగుళాల AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. రెండు వేరియంట్స్ కూడా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచ‌ర్ క‌లిగి ఉన్నాయి. ఇది డ్యుయ‌ల్ కోర్ Exynos W920 SoC ప్రాసెస‌ర్ 1.5GB of RAM తో వ‌స్తోంది.

కంపెనీ ప్రకారం, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఎలక్ట్రికల్ హార్ట్ సిగ్నల్ మరియు బయోఎలెక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ ఫీచ‌ర్స్‌ క‌లిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. Samsung Galaxy Watch 5ని ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీని ఉపయోగించే ఉష్ణోగ్రత సెన్సార్‌తో కూడా అమర్చింది. ఆన్‌బోర్డ్‌లోని ఇతర సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, బేరోమీటర్, గైరోస్కోప్, కంపాస్ మరియు లైట్ సెన్సార్ ఉన్నాయి.

అంతేకాకుండా ఇది 5.2 బ్లూటూత్ వ‌ర్ష‌న్‌ను క‌లిగి ఉంది. మ‌రోవైపు ఈ స్మార్ట్ వాచ్ డ‌స్ట్ మ‌రియు వాట‌ర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP68 సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. రెండు వేరియంట్‌లు WPC-ఆధారిత వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. Samsung ప్రకారం, బ్యాటరీ 13 శాతం పెద్దది మరియు 8 నిమిషాల ఛార్జింగ్‌తో 8 గంటల స్లీప్ ట్రాకింగ్‌ను అందిస్తుంది.

Samsung Galaxy Watch 5 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు::
 

Samsung Galaxy Watch 5 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు::

Samsung Galaxy Watch 5 Pro యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 450x450 pixels రిసొల్యుష‌న్‌తో 1.4-అంగుళాల సూప‌ర్ AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఇది WearOS 3.5- ఆధారిత‌ One UI Watch 4.5 ఓఎస్‌పై ర‌న్ అవుతుంది. ఇది కూడా నాన్ ప్రో మోడ‌ల్ మాదిరి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచ‌ర్ క‌లిగి ఉన్నాయి. ఇది డ్యుయ‌ల్ కోర్ Exynos W920 SoC ప్రాసెస‌ర్ 1.5GB of RAM తో వ‌స్తోంది.

కంపెనీ ప్రకారం, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఎలక్ట్రికల్ హార్ట్ సిగ్నల్ మరియు బయోఎలెక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ ఫీచ‌ర్స్‌ క‌లిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. Galaxy Watch 5 Pro ట్రాక్ బ్యాక్ ఫీచర్‌ను అందిస్తుంది, హైకర్లు, మౌంటెన్ బైకర్స్ మరియు ఇతరులు వారు ఎక్కడ నుండి త‌మ ట్రాక్‌ ప్రారంభించారో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ధరించిన వారు తమ Galaxy Watch 5 Proలో హైకింగ్ మరియు సైక్లింగ్ మార్గాలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా ఇది 5.2 బ్లూటూత్ వ‌ర్ష‌న్‌ను క‌లిగి ఉంది. మ‌రోవైపు ఈ స్మార్ట్ వాచ్ డ‌స్ట్ మ‌రియు వాట‌ర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP68 సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. రెండు వేరియంట్‌లు WPC-ఆధారిత వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. క‌నెక్టివిటీ ప‌రంగా వైఫై, NFC, GPS స‌పోర్ట్ క‌లిగి ఉంది. ఇక బ్యాట‌రీ విష‌యానికొస్తే 590mAh సామ‌ర్గ్యం గ‌ల బ్యాట‌రీ అందిస్తున్నారు.

Galaxy Buds2 Pro ఫీచర్లు, స్పెసిఫికేష‌న్లు:

Galaxy Buds2 Pro ఫీచర్లు, స్పెసిఫికేష‌న్లు:

సామ్‌సంగ్ Galaxy Unpacked 2022 ఈవెంట్‌లో భాగంగా బుధ‌వారం 24-బిట్ ఆడియోతో Samsung Galaxy Buds2 Pro ఇయ‌ర్‌బ‌డ్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ 360-డిగ్రీల ఆడియో మరియు హెచ్‌డి వాయిస్ ఫీచర్‌లతో స్టూడియో-నాణ్యత ఆడియో అనుభవాన్ని అందిస్తాయని శామ్‌సంగ్ పేర్కొంది. కొత్త ఇయర్‌బడ్స్‌ ఇంటలిజెంట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటాయి, ఇది మెరుగైన యాంబియంట్ నాయిస్ అనుభవాన్ని అందిస్తుంది.

Samsung Galaxy Buds2 Pro కూడా మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. కేస్‌పై 515 mAh బ్యాటరీ మరియు 61 mAh బ్యాటరీ ఇయ‌ర్‌బ‌డ్స్‌పై అందిస్తోంది. ఇయర్‌బడ్‌లు ANC ఆన్‌లో 18 గంటల వరకు మరియు ANC ఆఫ్‌తో 29 గంటల వరకు లైఫ్ అందిస్తాయని శామ్‌సంగ్ తెలిపింది. అదనంగా, స్మార్ట్ థింగ్స్ యాప్ బడ్స్2 ప్రోని ఇతర శాంసంగ్ గాడ్జెట్‌లతో సింక్ చేయడంలో మరింత సహాయపడుతుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Watch 5, Watch 5 Pro Launched; Samsung Galaxy Buds2 Pro Launched Alongside

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X