Samsung Galaxy Watch6 సీరిస్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు లీక్.. ధర, బ్యాటరీ వివరాలు..!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ శాంసంగ్ త్వరలో Galaxy Watch 6 మరియు Galaxy Watch 6 Classic లను త్వరలో విడుదల చేయనుందని సమాచారం. జులై నెల చివరలో నిర్వహించనున్న కార్యక్రమంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు ఈ స్మార్ట్‌వాచ్‌లకు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. గతంలోనూ ఈ వాచ్ డిజైన్ లీక్ అయింది.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 సీరిస్ Exynos W930 SoC సహా హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ AhmedQwaider ఈ రెండు వాచ్‌లకు సంబంధించిన బ్యాటరీ స్పెసిఫికేషన్లు సహా మరిన్ని వివరాలను తన ట్విట్టర్ ద్వారా లీక్ చేశారు.

గత సంవత్సరం విడుదలైన గెలాక్సీ వాచ్ 5 స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే.. త్వరలో విడుదల కానున్న గెలాక్సీ వాచ్ 6 సీరిస్ బ్యాటరీలు 20 శాతం పెద్దవిగా ఉంటాయని తెలిపారు. దీని ఆధారంగా గెలాక్సీ వాచ్ 6 40ఎంఎం మోడల్ వాచ్‌లు 300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే 44ఎంఎం మోడల్ 425mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది.
అదే విధంగా గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 43ఎంఎం మోడల్ 300mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే 47ఎంఎం మోడల్ 425mAh బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా గెలాక్సీ వాచ్ 6 సీరిస్ మరింత పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఈ రెండు వాచ్‌లు రెండు రంగుల్లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. గెలాక్సీ వాచ్ 6- గ్రాఫైట్-గోల్డ్, గ్రాఫైట్ సిల్వర్ అదే గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ స్మార్ట్‌వాచ్ గ్రాఫైట్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు Exynos W930 ప్రొసెసర్‌తో రానున్నాయని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ 6 సీరిస్ స్మార్ట్‌వాచ్‌లు 2GB ర్యామ్ మరియు 16GB అంతర్గత స్టోరేజీ సదుపాయంతో రానున్నాయని సమాచారం. అయితే ఈ స్పెసిఫికేషన్లపై శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గెలాక్సీ వాచ్ 6 ధర రూ.26,600 మరియు గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ ధర రూ.37,600కు అందుబాటులో ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది.
గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ స్మార్ట్‌వాచ్‌లకు సంబంధించిన డిజైన్ ఇప్పటికే లీక్ అయింది. ఈ రెండు వాచ్‌లు సుమారుగా ఒకే తరహాలో ఉండవచ్చు. రోటేటింగ్ బెజిల్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను గత సంవత్సరం విడుదలైన గెలాక్సీ వాచ్ 5 సీరిస్‌లో తొలగించింది. శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లతో పాటు గెలాక్సీ Z ఫోల్డ్ ఫోన్లు కూడా జులై చివరిలో జరగనున్న కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications