శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7, వాచ్ అల్ట్రా ధర వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానున్నాయి..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్ల తయారీ సంస్థ శాంసంగ్ జులై నెలలో అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ ఈవెంట్‌లో అనేక ఉత్పత్తులను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6, గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుందని సమాచారం. దీంతోపాటు గెలాక్సీ వాచ్ 7 (Samsung Galaxy watch 7 and Ultra), గెలాక్సీ వాచ్ అల్ట్రా సహా గెలాక్సీ బడ్స్ 3 సిరీస్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. వీటితోపాటు గెలాక్సీ రింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
అయితే తాజాగా గెలాక్సీ వాచ్‌ల ధర వివరాలు లీక్ అయ్యాయి. 91మొబైల్స్ గెలాక్సీ వాచ్ 7, గెలాక్సీ వాచ్ అల్ట్రా ధర వివరాలు లీక్ చేసింది. టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ భాగస్వామ్యంతో ఈ ధరలను లీక్ చేసింది. ఈ నివేదిక ఆధారంగా ధర వివరాలతోపాటు కలర్ ఆప్షన్‌లు కూడా వెల్లడయ్యాయి.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 ధర..! : టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ లీక్‌ల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 ధర $299- $310 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.25,000- రూ.26,000) గా ఉండే అవకాశం ఉంది. మార్బల్ గ్రే, క్రీమ్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అదే గెలాక్సీ వాచ్ అల్ట్రా ధర $699- $710 (భారత కరెన్సీ ప్రకారం రూ.58,400 - రూ.59,300) గా ఉండే అవకాశం ఉంది. మరియు టైటానియం గ్రే రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ధరలపై శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఫీచర్‌లు సహా ఇతర వివరాలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గెలాక్సీ వాచ్ 7 40mm, 44mm సైజుల్లో లభించే అవకాశం ఉంది. మరియు 3nm Exynos చిప్ పైన పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌వాచ్ 300mAh లేదా 425mAh బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై శాంసంగ్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
**శాంసంగ్ గతవారం శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ వాచ్ FEను ఆవిష్కరించింది. ఈ వాచ్ 1.2 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్ డ్యూయర్ కోర్ Exynos W920 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. Wear OS ఆధారిత One UI 5 వాచ్ ను కలిగి ఉంది. పైన పనిచేస్తుంది. ఈ వాచ్ 1.5GB ర్యామ్ మరియు 16GB అంతర్గత స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఈ శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ వాచ్.. అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంటుంది. హార్ట్ రేట్ సహా బ్లడ్ ప్రజర్ (BP), నిద్ర నాణ్యత సహా మరెన్నో ట్రాకర్లను కలిగి ఉంది. హార్ట్ రేట్‌లో తేడాలను గుర్తిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 100 వర్కౌట్ మోడ్స్‌ను కలిగి ఉంది. 40mm సైజ్ ఆప్షన్‌లో బ్లాక్, పింక్ గోల్డ్ మరియు సిల్వర్ రంగుల్లో లభించనుంది.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ FE సఫైర్ క్రిస్టల్ గ్లాస్ మరియు Always on display ఫీచర్‌లను కలిగి ఉంది. డిజిటల్ వాలెట్ యాక్సెస్ మరియు ఈ స్మార్ట్‌వాచ్‌తో జతచేసిన స్మార్ట్‌ఫోన్ కెమెరాను నియంత్రించే ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ వాచ్ బరువు కేవలం 26.6 గ్రాములుగా ఉంటుంది. ఈ వాచ్ ధర, ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనే వివరాలను శాంసంగ్ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








