శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ కీలక వివరాలు లీక్.. Wi-fi, eSIM సహా 32GB స్టోరేజీతో లాంచ్..?
శాంసంగ్ త్వరలో గెలాక్సీ వాచ్ 7 సిరీస్‌ను (Samsung Galaxy Watch 7 Series) విడుదల చేయనుంది. ఈ వాచ్ సిరీస్ గత సంవత్సరం లాంచ్ అయిన గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌కు తర్వాత తరం వెర్షన్‌గా రానుంది. గెలాక్సీ Z ఫ్లిప్ 6 మరియు గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ల లాంచ్ సమయంలోనే గెలాక్సీ వాచ్ 7 సిరీస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వైఫై, eSIM తో గెలాక్సీ వాచ్ 7 సిరీస్..! :
కొన్ని నివేదికల ప్రకారం ఈ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ మూడు వెర్షన్‌లలో (Samsung Galaxy New Watch Series) అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ వెర్షన్‌లు Wi-Fi, eSIM తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ 32GB అంతర్గత స్టోరేజీతో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

గెలాక్సీ వాచ్ 7 సిరీస్ మోడల్ నంబర్లు :
శామ్‌మొబైల్స్ రిపోర్టు ఆధారంగా గెలాక్సీ వాచ్ 7 సిరీస్ తొలి వేరియంట్ రెండు మోడల్ నంబర్లను కలిగి ఉంది. SM-L300 మరియు SM-L305 నంబర్లను కలిగి ఉంది. దాంతోపాటు రెండో వేరియంట్ SM-L310 మరియు SM-L315 మోడల్ నంబర్లను కలిగి ఉంది. అదే మూడో వేరియంట్ (టాప్ ఎండ్ వేరియంట్) SM-L700 మరియు SM-L705 మోడల్ నంబర్లను కలిగి ఉంది.
32GB అంతర్గత స్టోరేజీ! :
ఈ రిపోర్టు ఆధారంగా మోడల్ నంబర్లలో చివరి అంకె 5 గా ఉన్న వేరియంట్ eSIM సపోర్టు సహా సెల్యూలర్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ కొత్త వాచ్ సిరీస్ 32GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుందని సమాచారం. గెలాక్సీ వాచ్ 6 సిరీస్ కేవలం 16GB స్టోరేజీని కలిగి ఉంది.
కొత్త వెర్షన్ Wear OS :
దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ 3nm చిప్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు కొత్త వెర్షన్ Wear OS మరియు One UI వాచ్ పైన పనిచేస్తుందని సమాచారం. గత మోడల్ కంటే 50 శాతం ఎక్కువ పనితీరును కనబరుస్తాయని పేర్కొంది.
గెలాక్సీ వాచ్ 7 సిరీస్ ధర సహా ఇతర వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు మరిన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న గెలాక్సీ వాచ్ 6 బేస్ బ్లూటూత్ వేరియంట్ రూ.19,999 గా ఉంది. అదే క్లాసిక్ వేరియంట్ రూ.36,999 గా ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








