Galaxy Watch 7 శాంసంగ్ కొత్త వాచ్ సిరీస్ కీలక వివరాలు లీక్.. అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో విడుదల?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్ల తయారీ సంస్థ శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను ఈ సంవత్సరం జులైలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌లో అనేక కీలక ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉంది. తర్వాత తరం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, శాంసంగ్ స్మార్ట్ రింగ్ విడుదల చేసే అవకాశం ఉంది.
వీటితోపాటు తర్వాత తరం గెలాక్సీ వాచ్‌ను (Samsung Galaxy Watch 7) కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ వాచ్ 7 తాజాగా బ్లూటూత్ SIG (Special interest Group) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ వెబ్‌సైట్ ఆధారంగా ఈ వాచ్ 7.. బ్లూటూత్ 5.3 వెర్షన్‌పైన పనిచేసే అవకాశం ఉంది. వాచ్ 7 పై శాంసంగ్ అధికారిక ప్రకటన చేయలేదు.

గత సంవత్సరం శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ వాచ్ 6 లోను ఇదే బ్లూటూత్ వెర్షన్‌ను వినియోగించారు. దీంతోపాటు మరిన్ని కీలక స్పెసిఫికేషన్లు వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ గెలాక్సీ వాచ్ 7.. శాంసంగ్‌కు చెందిన తొలి 3nm చిప్‌సెట్‌పై పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ గెలాక్సీ వాచ్ 6 కంటే 50 శాతం ఎక్కువ పనితీరును కనబరుస్తుంది. మరియు 32GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.
దీంతోపాటు ఈ తర్వాత తరం వాచ్ సిరీస్‌పై గతంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గెలాక్సీ వాచ్ 7 సిరీస్ దీర్ఘచతురస్రాకార డిజైన్ (Rectangular) డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. అయితే ఇందుకు గల కారణాలు వెల్లడికాలేదు. ఫలితంగా ఆపిల్‌కు పోటీనిచ్చే అవకాశం ఉంది.
గత నెలలో వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ మూడు వెర్షన్‌లలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ వెర్షన్‌లు వైఫై, eSIM తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. శామ్‌మొబైల్స్ రిపోర్టు ఆధారంగా గెలాక్సీ వాచ్ 7 సిరీస్ తొలి వేరియంట్ రెండు మోడల్ నంబర్లను కలిగి ఉంది.
SM-L300 మరియు SM-L305 నంబర్లను కలిగి ఉంది. దాంతోపాటు రెండో వేరియంట్ SM-L310 మరియు SM-L315 మోడల్ నంబర్లను కలిగి ఉంది. అదే మూడో వేరియంట్ (టాప్ ఎండ్ వేరియంట్) SM-L700 మరియు SM-L705 మోడల్ నంబర్లను కలిగి ఉంది. మోడల్ నంబర్లలో చివరి అంకె 5 గా ఉన్న వేరియంట్ eSIM సపోర్టు సహా సెల్యూలర్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గెలాక్సీ వాచ్ 7 సిరీస్ ధర సహా ఇతర వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు మరిన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న గెలాక్సీ వాచ్ 6 బేస్ బ్లూటూత్ వేరియంట్ రూ.19999 గా ఉంది. అదే క్లాసిక్ వేరియంట్ రూ.36,999 గా ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications