ఎప్పటి నుంచో స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. రేపు విడుదలయ్యే ఈ వాచ్ గురించి తెలుసుకోండి!
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ రేపు (జులై 9) జరగనుంది. ఈ ఈవెంట్ లో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు గెలాక్సీ వాచ్ 8 సిరీస్ (Samsung Galaxy Watch 8 Series) కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వాచ్ సిరీస్ డిజైన్ సహా స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఈ సిరీస్ లో భాగంగా గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 (LTE), గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్, గెలాక్సీ వాచ్ అల్ట్రా వంటి మోడల్స్ విడుదల కానున్నాయని తెలుస్తోంది.
గత వేరియంట్స్ తో పోలిస్తే అనేక మార్పులను గమనించవచ్చని తెలుస్తోంది. హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్ తోపాటు స్టోరేజీ, బ్యాటరీ, డిస్‌ప్లే వంటి అనేక మార్పులను చూడవచ్చని తెలుస్తోంది. Dealabs, 9to5google ప్రకారం ఈ స్మార్ట్‌వాచ్‌లు Exynos W1000, One UI 8 తో పనిచేస్తాయని తెలుస్తోంది.

వేరియంట్స్ :
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 వేరియంట్ 40mm, 44mm సైజుల్లో లాంచ్ కానుంది. అదే క్లాసిక్ మోడల్ 46mm వేరియంట్ లోనే విడుదల కానుంది. అదే అల్ట్రా మోడల్ 47mm టైటానియం కేస్ తో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ వాచ్ సిరీస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఈ సిరీస్ స్టాండర్డ్ వేరియంట్ అల్యూమినియం ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. అదే క్లాసిక్ వేరియంట్ స్టెయిన్‌లెస్ స్టీల్, అల్ట్రా వేరియంట్ టైటానియం ఫ్రేమ్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
స్టాండర్డ్ మోడల్ సిలికాన్ స్పోర్ట్స్ స్ట్రాప్ తో అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. అదే క్లాసిక్ వేరియంట్ హైబ్రిడ్ లెదర్, రబ్బర్ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. మరియు అల్ట్రా వేరియంట్ ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్ బ్రాస్‌లెట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గరిష్ఠంగా 64GB స్టోరేజీ :
గెలాక్సీ వాచ్ 8 32GB స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే క్లాసిక్, అల్ట్రా వేరియంట్స్ 64GB స్టోరేజీని కలిగి ఉంటాయని సమాచారం. బ్యాటరీ పరంగానూ అప్‌గ్రేడ్ అయిందని తెలుస్తోంది. స్టాండర్డ్, క్లాసిక్ మోడల్స్ 435mAh, 445mAh బ్యాటరీతో పనిచేస్తాయని తెలుస్తుండగా.. అల్ట్రా వేరియంట్ మాత్రం 590mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
అంచనా ధర వివరాలు :
గెలాక్సీ వాచ్ 8 బ్లూటూత్ వేరియంట్ ధరలు Euro 379.99 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.38400), Euro 409.99 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.41400) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే LTE వేరియంట్ ధరలు భారత కరెన్సీ ప్రకారం రూ.43400, రూ.46400 గా ఉండనున్నాయి.
గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ బ్లూటూత్ వేరియంట్ ధర Euro 529.99 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.53500), అదే LTE వేరియంట్ Euro 579.99 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.58500) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అల్ట్రా వేరియంట్ ధర భారత కరెన్సీ ప్రకారం రూ.70700 గా ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








