Home
Gadgets

Galaxy Watch 8 series శాంసంగ్ గెలాక్సీ వాచ్‌ 8 సిరీస్‌ విడుదల.. ఆకట్టుకొనే డిజైన్‌ సహా ఫీచర్లు..!

శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ 2025 ఈవెంట్‌ లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 7, గెలాక్సీ Z ప్లిప్‌ 7, గెలాక్సీ Z ఫ్లిప్‌ 7 FE స్మార్ట్‌ఫోన్‌లతోపాటు గెలాక్సీ వాచ్ 8 మరియు గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్‌ స్మార్ట్‌వాచ్‌లను (Galaxy Watch 8 Series) విడుదల చేసింది. ఈ వాచ్‌ ప్రారంభ ధర రూ.32999 గా ఉంది. ఈ సిరీస్‌ లో అనేక హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లున్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 8 :
గెలాక్సీ వాచ్‌ 8 మోడల్‌ 40mm, 44mm వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ వాచ్‌ Sapphire గ్లాస్‌ కోటింగ్‌తో అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ 40mm వేరియంట్‌ 1.34 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 44mm వేరియంట్‌ 1.47 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 327 ppi డెన్సిటీ ను కలిగి ఉంది.

Samsung Galaxy Watch 8 series launched telugu news

ఈ వాచ్‌ 325mAh (40mm), 435mAh (44mm) బ్యాటరీతో పనిచేస్తుంది. Exynos W1000 చిప్‌తో పనిచేస్తుంది. Wear OS 6 ఆధారిత One UI 8.0 ను కలిగి ఉంది. 2GB ర్యామ్, 32GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

గెలాక్సీ వాచ్‌ 8 క్లాసిక్‌ :
గెలాక్సీ వాచ్‌ 8 క్లాసిక్‌ 46mm సైజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ వాచ్‌ Sapphire గ్లాస్‌ కోటింగ్‌తో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కేసింగ్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ 1.34 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 327 ppi డెన్సిటీ ను కలిగి ఉంది.

ఈ వాచ్‌లు Exynos W1000 చిప్‌తో పనిచేస్తుంది. Wear OS 6 ఆధారిత One UI 8.0 ను కలిగి ఉంది. 2GB ర్యామ్, 64GB స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ 445mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ వేరియంట్‌ క్విక్‌ బటన్‌ను కలిగి ఉంటుంది.

Samsung Galaxy Watch 8 series launched telugu news

గెలాక్సీ వాచ్‌ 8 సిరీస్‌ బయో యాక్టివ్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో బయో సిగ్నల్‌ సెన్సర్‌, ఎలక్ట్రికల్‌ హార్ట్‌ సిగ్నల్‌, బయో ఎలక్ట్రికల్‌ ఇంపిడెన్స్‌ అనాలసిస్‌ సెన్సార్‌లు ఉన్నాయి. వీటితోపాటు బారో మీటర్, యాక్సెలిరోమీటర్, గైరో సెన్సర్‌, జియోమాగ్నటిక్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సర్‌, టెంపరేచర్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లు హార్ట్‌ మానిటరింగ్‌, ECG, నిద్ర, ఒత్తిడి పర్యవేక్షణ, AGES ఇండెక్స్‌ మానిటరింగ్‌ వంటి ట్రాకర్‌లు ఉన్నాయి. దీంతోపాటు ఫాల్ డిటెక్షన్‌, బ్లడ్‌ ప్రజర్‌ మానిటరింగ్‌, బాడీ కంపోజిషన్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లున్నాయి. ఈ రెండు వాచ్‌లు మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌తోపాటు IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉన్నాయి.

Samsung Galaxy Watch 8 series launched telugu news

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 8, గెలాక్సీ 8 క్లాసిక్‌ ధర :
గెలాక్సీ వాచ్‌ 8 బ్లూటూత్‌ వేరియంట్‌ (40mm) ధర రూ.32999, 44mm వేరియంట్‌ రూ.35999 గా ఉంది. గెలాక్సీ వాచ్‌ 8 LTE (40mm) ధర రూ.36999, 44mm LTE రూ.39999 గా ఉంది. గ్రాఫైట్‌, సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ అయింది.

అదే శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 8 క్లాసిక్‌ 46mm (బ్లూటూత్‌ వేరియంట్‌) రూ.46999 గా ఉంది. అదే LTE వేరియంట్‌ ధర రూ.50999 గా ఉంది. బ్లాక్‌, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ వాచ్‌లను ఇవాళ్టి నుంచి (జులై 9) ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. జులై 25 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Watch 8 series launched with Exynos W1000 chip here are the features, price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X