Home
Gadgets

Samsung గెలాక్సీ వాచ్ FE లాంచ్ తేదీ లీక్! ధర,స్పెసిఫికేషన్ల వివరాలు  

Samsung నుంచి Galaxy Watch FE స్మార్ట్ వాచ్ చాలా రోజులుగా వార్తలలో చర్చనీయాంశంగా ఉంది. ఇది శాంసంగ్ నుండి వస్తున్నమొదటి ఫ్యాన్ ఎడిషన్ వాచ్ అవుతుంది. రాబోయే ఈ గెలాక్సీ వాచ్ నుండి ఏమి ఆశించవచ్చనే వివరాలు గురించి. ఇప్పటివరకు విడుదలైన పుకార్లు మరియు నివేదికలు ఇప్పటికే మాకు ఒక ఆలోచనను అందించాయి. అంతేకాకుండా, ఈ పరికరం ఇటీవల అమెజాన్ ఇటలీ వెబ్‌సైట్‌లో దాని ధరతో పాటు గుర్తించబడింది. ఇప్పుడు, ఈ తాజా వార్త శాంసంగ్ గెలాక్సీ వాచ్ FE యొక్క లాంచ్ తేదీని కూడా వెల్లడించింది. ఇక్కడ అన్ని వివరాలను నిశితంగా పరిశీలిద్దాం.

Samsung Galaxy Watch FE లాంచ్ తేదీ విడుదల చేయబడింది
ప్రముఖ టిప్‌స్టర్ మిస్టరీ లుపిన్ సమాచారం ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ వాచ్ FE జూన్ 24న లాంచ్ కాబోతోంది. ఇది శాంసంగ్ యొక్క తదుపరి గెలాక్సీ అన్ ప్యాకెడ్ ఈవెంట్ కంటే కొన్ని వారాల ముందే ఈ స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy Watch FE

Samsung Galaxy Watch FE అంచనా ధర మరియు ఫీచర్ల వివరాలు
అమెజాన్ జాబితా ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ వాచ్ FE ధర €199 (దాదాపు రూ. 17,862). ఈ వాచ్ బ్లాక్, సిల్వర్ మరియు పింక్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే, గెలాక్సీ వాచ్ FE 396 x 396 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.2-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇది 1.5GB RAM మరియు 16GB స్టోరేజీ తో జత చేయబడి, ఎక్సీనోస్ W920 డ్యూయల్-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇక సాఫ్ట్‌వేర్ వివరాలు గమనిస్తే ఈ వాచ్ Wear OS ఆధారిత One UI 5.0 వాచ్‌తో వస్తుంది. ఈ గెలాక్సీ వాచ్ FE స్మార్ట్ వాచ్ 247 mAh బ్యాటరీతో వస్తుందని అంచనా వేయబడింది, ఇది సుమారు 30 గంటల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.

గెలాక్సీ వాచ్ FE లో యాక్సిలరోమీటర్, బేరోమీటర్, బయోఇంపెడెన్స్ అనాలిసిస్, ECG సెన్సార్, గైరోస్కోప్, బ్రైట్‌నెస్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా, బ్రాండ్ తన తదుపరి గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను జూలై 10న లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందని ప్రకటించారు. ఇందులో, కొత్త తరం ఫోల్డబుల్ ఫోన్‌లు, గెలాక్సీ వాచ్ 7, వాచ్ 7 అల్ట్రా మరియు మరెన్నో పరికరాలు ప్రకటించవచ్చు. ఈ Galaxy Unpacked ఈవెంట్‌లో గెలాక్సీ వాచ్ FE ప్రారంభించబడుతుందని ఆల్విన్ అనే మరొక టిప్‌స్టర్ పేర్కొన్నారని గమనించండి. ఈ విషయంపై శాంసంగ్ ఇంకా ఏమీ ధృవీకరించనప్పటికీ ఇవి అంచనాలుగా తీసుకోవడం మంచిది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Watch FE Launch Expected Ahead Of Galaxy Unpacked Event. Launch Date And Price Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X