Home
Gadgets

తొలిసారి ఫ్యాన్‌ ఎడిషన్‌ వాచ్‌ను ఆవిష్కరించిన శాంసంగ్‌.. ఫీచర్‌లు, ధర, సేల్‌ వివరాలు..!!

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ శాంసంగ్‌ తొలిసారిగా స్మార్ట్‌వాచ్‌ ఫ్యాన్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ FE ను (Samsung Galaxy Watch FE) ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌వాచ్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్ కెమెరా, డిజిటల్‌ వాలెట్‌ను వినియోగించవచ్చు. ఈ ఫ్యాన్‌ ఎడిషన్ స్మార్ట్‌వాచ్‌ ఎప్పటి నుంచి కొనుగోలుకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. ప్రాంతాలకు అనుగుణంగా వేర్వేరు ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ గెలాక్సీ వాచ్‌ FE అల్యూమినియం బాడీని కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ FE స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
శాంసంగ్ గెలాక్సీ వాచ్‌ FE.. 396*396 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 1.2 అంగుళాల సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్‌ డ్యూయర్‌ కోర్ Exynos W920 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు Wear OS ఆధారిత One UI 5 వాచ్‌ పైన పనిచేస్తుంది. ఈ వాచ్‌ 1.5GB ర్యామ్‌ మరియు 16GB అంతర్గత స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

Samsung Galaxy Watch FE announced globally

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ FE సఫైర్‌ క్రిస్టల్‌ గ్లాస్‌ మరియు Always on display ఫీచర్‌లను కలిగి ఉంది. డిజిటల్‌ వాలెట్‌ యాక్సెస్‌ మరియు ఈ స్మార్ట్‌వాచ్‌తో జతచేసిన స్మార్ట్‌ఫోన్‌ కెమెరాను నియంత్రించే ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ వాచ్‌ బరువు కేవలం 26.6 గ్రాములుగా ఉంటుంది.

ఈ శాంసంగ్‌ ఫ్యాన్‌ ఎడిషన్‌ వాచ్‌.. అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంటుంది. హార్ట్‌ రేట్‌ సహా బ్లడ్‌ ప్రజర్‌ (BP), నిద్ర నాణ్యత పర్యవేక్షణ సహా మరెన్నో ట్రాకర్లను కలిగి ఉంది. హార్ట్‌ రేట్‌లో తేడాలను గుర్తిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 100 వర్కౌట్‌ మోడ్స్‌ను కలిగి ఉంది. 40mm సైజ్‌ ఆప్షన్‌లో బ్లాక్‌, పింక్‌ గోల్డ్‌ మరియు సిల్వర్‌ రంగుల్లో లభించనుంది.

ఈ శాంసంగ్‌ ఫ్యాన్‌ ఎడిషన్ వాచ్‌.. WPC ఆధారిత వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 247mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్‌ 5.3, LTE, GPS, NFC, Glonass, Beidou, Galileo వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. 5ATM వాటర్‌ రెసిస్టెన్స్‌ మరియు IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది.

అయితే ఈ వాచ్‌ ధర మరియు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనే వివరాలను శాంసంగ్‌ వెల్లడించలేదు. అయితే కొన్ని లీక్‌ల ద్వారా ధర వివరాలు వెల్లడయ్యాయి. ఈ వాచ్‌ బ్లూటూత్‌ వెర్షన్‌ ధర EUR 199 (భారత్‌ కరెన్సీ ప్రకారం సుమారు రూ.16,600) గా ఉంది.

అయితే Verge నివేదిక ప్రకారం.. శాంసంగ్‌ గెలాక్సీ వాచ్ FE బ్లూటూత్‌ వెర్షన్‌ ధర $199.99 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.16,700) గా ఉంటుంది. మరియు జూన్ 24 నుంచి అందుబాటులో ఉంటుంది. అదే LTE వెర్షన్‌ ధర $249.99 (భారత్ వెర్షన్‌లో రూ.20,900) గా ఉంటుంది. ఈ సంవత్సరం చివర్లో అందుబాటులోకి వస్తుంది. అయితే ధర, లభ్యత వివరాలపై శాంసంగ్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Watch FE unveiled globally features price sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X