సామ్‌సంగ్ 8జీబి ర్యామ్, సెకనులో 13 హెచ్‌డి సినిమాలు ట్రాన్స్‌ఫర్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ సామ్‌సాంగ్ తన యాక్సెసరీస్ విభాగం నుంచి మరో విప్లవాత్మక ప్రోడక్టును మార్కెట్లో అనౌన్స్ చేసింది
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ సామ్‌సాంగ్ తన యాక్సెసరీస్ విభాగం నుంచి మరో విప్లవాత్మక ప్రోడక్టును మార్కెట్లో అనౌన్స్ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న LPDDR4 ర్యామ్‌కు
అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా LPDDR5 ర్యామ్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించింది. 8జీబి మాడ్యుల్స్‌ను ప్రొడ్యూస్ చేయగలిగే ఈ సింగిల్ చిప్‌ను 5జీ నెట్‌వర్క్‌ను ఉద్దేశించి సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎంబెడె కాబడిన ఈ చిప్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది.

పనితీరుపరంగా వేగవంతమైన రిజల్ట్స్...
LPDDR5 ర్యామ్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న LPDDR4, LPDDR4X ర్యామ్‌లతో పోలిస్తే తక్కువ శక్తిని ఖర్చు చేయటంతో పాట పనితీరుపరంగా వేగవంతమైన రిజల్ట్స్‌ను ప్రొడ్యూస్ చేయగలుగుతుందని సామ్‌సంగ్ చెబుతోంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న LPDDR4, LPDDR4X ర్యామ్‌లను అత్యంత శక్తివంతమైన గాడ్జెట్‌లలో మాత్రమే వినియోగించటం జరుగుతోంది.

13 ఫుల్ హైడెఫినిషన్ సినిమాలను సెకనులో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు...
LPDDR5 ర్యామ్‌కు సంబంధించిన వేగం సెకనుకు 6400 ఎంబీలుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న LPDDR4, LPDDR4X ర్యామ్‌ల వేగం సెకనుకు 4266 ఎంబీలుగా ఉంటుంది. LPDDR5 ర్యామ్ ద్వారా సెకనుకు 51.2 జీబీల డేటాను సెండ్ చేసుకునే వీలుంటుందట. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే 13 ఫుల్ హైడెఫినిషన్ సినిమాలను కేవలం సెకనులో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పవర్ వినియోగానికి వచ్చేసరికి LPDDR4 ర్యామ్ వినియోగించుకునే శక్తితో పోలిస్తే సగం ఖర్చుతో LPDDR5 ర్యామ్ రన్ అవ్వగలదని సామ్‌సంగ్ చెబుతోంది. ఈ కొత్త చిప్‌ను అప్‌కమ్మింగ్ గెలాక్సీ 9 ఫోన్‌లో సామ్‌సంగ్ వినియోగించే అవకాశం ఉంది.

డీడీఆర్ అంటే డబుల్ డేటా రేట్ అని అర్థం...
డీడీఆర్ 3 ర్యామ్ అనే స్పెసిఫికేషన్ ఇటీవల చాలా డివైజుల్లో వస్తోంది. డీడీఆర్ అంటే డబుల్ డేటా రేట్ అని అర్థం. అంటే ఒక్కో క్లాక్ సైకిల్‌కు రెండు డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతాయని అర్థం. టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడంతో డీడీఆర్, డీడీఆర్2, డీడీఆర్3 ర్యామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో డీడీఆర్2 ర్యామ్ 240 పిన్‌లతో ఉంటుంది. పాత వాటిని అప్‌డేట్ చేసుకోవడానికి ఈ ర్యామ్ ఉపయోగపడుతుంది. ర్యామ్‌లలో డీడీఆర్ 4 లేటెస్ట్ మోడల్.

ర్యామ్‌లో స్టోర్ కాబడిన డేటాను వేగవంతంగా యాక్సెస్ చేసుకోవచ్చు...
ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ కంటే వేగంగా స్పందించ గల సామర్థ్యం ర్యామ్‌కు ఉంటుంది. ర్యామ్‌లో స్టోర్ కాబడిన డేటాను వేగవంతంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫోన్‌లో ఏ విధమైన యాప్స్ లేకపోయినట్లయితే 1జీబి లేదా 2జీబి ర్యామ్ మల్టీ టాస్కింగ్‌కు సరిపోతుతంది. అలా కాకుండా మీ ఫోన్‌లో పిచ్చాపాటిగా యాప్స్ ఉన్నట్లయితే ర్యామ్ పై ఒత్తిడి మరింత పెరిగి ఫోన్ నెమ్మదించే అవకాశం ఉంటుంది.

ర్యామ్ ఎక్కువగా ఉండటం ఎటువంటి నష్టం లేదు...
స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ యాప్స్‌ను రన్ చేసే అలవాటున్న వారికి 4జిబి ర్యామ్ ఫోన్ సరిపోతుంది. వాస్తవానికి, 8జీబి ర్యామ్ అనేది స్మార్ట్‌ఫోన్‌కు చాలా ఎక్కువ. ఇదే సమయంలో ఫోన్‌లో ర్యామ్ ఎక్కువగా ఉండటం ఎటువంటి నష్టం లేదు. మీ ఫోన్‌లో 8జీబి ర్యామ్ ఉన్నట్లయితే, మీ ఫోన్ ఎక్కువ డేటాను ఒకేసారి హ్యాండిల్ యగలుగుతుంది. యాప్స్ మధ్య త్వరగా స్విచ్ అవ్వొచ్చు. ఎక్కువ ర్యామ్‌ను కలిగి ఉండే ఫోన్‌లు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి.


Click it and Unblock the Notifications








