Samsung Neo QLED 8K స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి!! ధరలు చాలా ఎక్కువ...

|

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్ నేడు ఇండియాలో కొత్తగా 2022 Neo QLED 8K మరియు Neo QLED టీవీలను విడుదల చేసి తన యొక్క ప్లాట్‌ఫారమ్ ను మరింత విస్తరించింది. ఈ కొత్త Neo QLED TV అద్భుతమైన అనేక ఫీచర్ల సమ్మేళనంతో లభిస్తుంది. శామ్సంగ్ యొక్క కొత్త టీవీ గతంలో లాంచ్ అయిన టీవీల యొక్క ప్రయోజనాలను మాత్రమే అందించకుండా గేమ్ కన్సోల్, వర్చువల్ ప్లేగ్రౌండ్ మరియు మీ ఇంటిలోని స్మార్ట్ పరికరాలను నియంత్రించడానికి స్మార్ట్ హబ్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. కాకపోతే ఈ కొత్త టీవీలు కొద్దిగా అధిక ధరను కలిగి ఉన్నాయి. అయితే వీటి యొక్క ధరకు తగ్గట్టుగా అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వాటి యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

శామ్సంగ్ Neo QLED 8K టీవీల ధరల వివరాలు

శామ్సంగ్ Neo QLED 8K టీవీల ధరల వివరాలు

శామ్సంగ్ Neo QLED 8K TVలు QN900B (85-అంగుళాల), QN800B (65- మరియు 75-అంగుళాల), QN700B (65-అంగుళాల) మోడల్‌లలో విడుదలయ్యాయి. వీటి యొక్క ధరలు రూ.3,24,990 నుండి ప్రారంభమవుతుంది. QN95B (55-, 65-అంగుళాల), QN90B (85-, 75-, 65-, 55-, 50-అంగుళాల), QN85B (55-, 65-అంగుళాల) మోడళ్లలో లభించే నియో QLED టీవీల ధర రూ.1,14,990 నుండి నుండి ప్రారంభమవుతుంది. ఈ టీవీలు శామ్సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ శామ్సంగ్ షాప్‌తో సహా అన్ని శామ్సంగ్ రిటైల్ స్టోర్‌లు, ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లు మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి.

Neo QLED 8K లైనప్

శామ్సంగ్ Neo QLED 8K లైనప్ లో 65-అంగుళాల, 75-అంగుళాల, 85-అంగుళాల మూడు స్క్రీన్ పరిమాణాలతో సిరీస్‌లను కలిగి ఉంటుంది. Neo QLED TV 50-అంగుళాలు మరియు 85-అంగుళాల వరకు స్క్రీన్ పరిమాణాలతో మూడు సిరీస్‌లలో అందుబాటులో ఉంటుంది. కొత్త శ్రేణి Neo QLED టీవీలు రిటైల్ స్టోర్లలో మరియు ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్‌లో అలాగే Samsung అధికారిక ఆన్‌లైన్ స్టోర్ Samsung షాప్‌లో అందుబాటులో ఉంటాయి.

శామ్సంగ్ Neo QLED 8K టీవీల లాంచ్ ఆఫర్లు
 

శామ్సంగ్ Neo QLED 8K టీవీల లాంచ్ ఆఫర్లు

పరిమిత వ్యవధి ఆఫర్‌లో భాగంగా ఏప్రిల్ 19-30, 2022 మధ్య నియో QLED 8K టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,49,900 విలువైన శామ్సంగ్ సౌండ్‌బార్ (HW-Q990B)తో పాటు రూ.8,900 విలువైన SlimFit క్యామ్‌ను ఉచితంగా పొందుతారు. Neo QLED టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులు రూ.8,900 విలువైన స్లిమ్‌ఫిట్ క్యామ్‌ను ఉచితంగా పొందుతారు. Neo QLED 8K మరియు Neo QLED టీవీలను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వినియోగదారులు వరుసగా రూ.10,000 మరియు రూ. 5,000 విలువైన తగ్గింపులను పొందవచ్చు.

Samsung నియో QLED 8K స్పెసిఫికేషన్స్

Samsung నియో QLED 8K స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ బ్రాండ్ యొక్క Neo QLED లైనప్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది క్వాంటమ్ మినీ LED ల ద్వారా ఆధారితమై క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రోతో వస్తుంది. ఇది సాధారణ LED ల కంటే 40 రెట్లు చిన్నదని Samsung పేర్కొంది. సాపేక్షంగా చిన్న పరిమాణం మెరుగైన కాంతి స్థాయిని మరియు డిస్ప్లే యొక్క ప్రకాశంపై మరింత ఖచ్చితమైన నియంత్రణను అందిస్తుంది. Neo QLED 8K టీవీ AI- ఆధారిత త్రీ-డైమెన్షనల్ డెప్త్‌ను రూపొందించబడి ఉండి ఏదైనా వస్తువులను గుర్తించి మెరుగుపరిచే నిజమైన డెప్త్ పెంచే న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 8K ద్వారా శక్తిని పొందుతుంది. Neo QLED ఫీచర్స్ లలో ముఖ్యంగా ఐకంఫోర్ట్ మోడ్ ఉంది. ఇది అంతర్నిర్మిత సెన్సార్ల ఆధారంగా స్క్రీన్ యొక్క బ్రైట్ నెస్ మరియు టోన్‌ను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది. పరిసర కాంతి మారినప్పుడు స్క్రీన్ క్రమంగా కాంతి పరిమాణాన్ని తగ్గిస్తుంది.

శామ్సంగ్ నియో QLED ఫీచర్స్

శామ్సంగ్ నియో QLED ఫీచర్స్

శామ్సంగ్ నియో QLED టీవీలు అంతర్నిర్మిత IoT హబ్‌తో కూడా వస్తాయి. ఇది వినియోగదారులు తమ ఇంటిలోని అన్ని రకాల స్మార్ట్ పరికరాలను ఈ టీవీతో స్మార్ట్ మార్గంలో నియంత్రించుకునేలా చేస్తుంది. వినియోగదారులు టీవీ డిజైన్ లేదా వీక్షణ అనుభవాన్ని రాజీ పడకుండా అటాచ్ చేయగల స్లిమ్‌ఫిట్ క్యామ్ (టీవీ వెబ్‌క్యామ్)తో పెద్ద టీవీ స్క్రీన్‌పై వీడియో కాలింగ్ లేదా వెబ్ కాన్ఫరెన్స్‌లను కూడా పొందవచ్చు. స్మార్ట్ హబ్ ఫీచర్ కొత్తగా యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఇది స్మార్ట్ అనుభవాన్ని సులభంగా నావిగేట్ చేయగల హోమ్ స్క్రీన్‌లోకి తీసుకువస్తుంది. శామ్‌సంగ్ టీవీ ప్లస్‌లో భాగంగా అత్యుత్తమ కంటెంట్ వీక్షణ అనుభవంతో 45+ భారతీయ & గ్లోబల్ టీవీ ఛానెల్‌లు రిఫ్రెష్ చేయబడిన నియో QLED టీవీ శ్రేణిని వినియోగదారులకు అంతిమ ఎంపికగా మార్చాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung launched Neo QLED 8K New Smart TVs in India: Price, Specs, Sale Offers and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X